TE/Prabhupada 1039 - ఆవు మన తల్లి ఎందుకంటే మనము ఆవు పాలను త్రాగుతాము. ఆమె తల్లికాదని ఎలా తిరస్కరించగలను



730809 - Conversation B with Cardinal Danielou - Paris

ఆవు మనకు తల్లి ఎందుకంటే మనము ఆవు పాలను త్రాగుతాము. నేను ఆమె తల్లి కాదని నేను ఎలా తిరస్కరించగలను?

ప్రభుపాద: జంతువును చంపడం పాపము కాదు అని మీరు ఎలా చెప్పగలరు?

యోగేశ్వర: (అనువాదము)

కార్డినల్ డానియల్:.... భగవాన్: మీరు దానిని ఎలా సమర్థిస్తారు?

కార్డినల్ డానియల్ : అవును, ఎందుకంటే మేము స్వభావము తేడా ఉన్నదని మేము భావిస్తాము, మనిషి యొక్క జీవితం, ఆత్మ యొక్క జీవితం మరియు, జంతువు మరియు మొక్కల యొక్క జీవితము మధ్య, మేము అనుకుంటున్నాము జంతువు మరియు మొక్క యొక్క మొత్తము సృష్టి మనిషికి సహాయం చేయటానికి దేవుడు ఇచ్చినది. యేసు, నీ కృప వలన, ఆత్మ మాత్రమే వాస్తవమైన జీవులు అని, మిగతావి కనిపిస్తాయి మరియు వాస్తవముగా ఉండవు, మేము అలా అనుకుంటున్నాము. మేము జంతువులు, మరియు మొక్కలు వాస్తవమైన జీవులు కాదు అని అనుకుంటాము ప్రపంచములో కనిపిస్తాయి. మరియు మానవుడు మాత్రమే వాస్తవమైన జీవి. ఈ కోణంలో, భౌతిక ప్రపంచం ప్రాముఖ్యత లేనిది.

ప్రభుపాద: ఇప్పుడు నేను అర్థము చేసుకున్నాను. మీరు ఈ ఇంట్లో నివసిస్తున్నారని అనుకుందాం. కాబట్టి మీరు ఈ ఇల్లు కాదు, అది సత్యము.

కార్డినల్ డానియల్: అవును. అవును.

ప్రభుపాద: నేను వచ్చి మీ ఇంటిని విచ్ఛిన్నం చేస్తే, అది మీకు అసౌకర్యం కాదా?

కార్డినల్ డానియల్: అవును, పరిపూర్ణ౦గా. పరిపూర్ణ౦గా ఇది అసౌకర్యంగా ఉంటుంది.

ప్రభుపాద: నేను మిమ్మల్ని అసౌకర్యమునకు గురిచేసినట్లయితే, అది నేరము కాదా?

కార్డినల్ డానియల్: అది నాకు అసౌకర్యంగా ఉంటుంది, కాని ఇది ...

ప్రభుపాద: కాదు. మీకు కొంత అసౌకర్యం కలుగ చేస్తే, అది నేరము కాదా? అది పాపము కాదా?

కార్డినల్ డానియల్ : ఒక తీవ్రమైన కారణం ఉంటే ఇది ఆధ్యాత్మిక మనిషిని నాశనం చేయడము కాదు అని నేను అనుకుంటున్నాను ఉదాహరణకు, భౌతిక ప్రపంచం యొక్క వాస్తవాన్ని ఉపయోగించడం సంపూర్ణంగా సాధ్యమవుతుంది, సహజ ప్రపంచములో విలువైన అంతిమ మానవ ధర్మమునకు. మేము భావిస్తున్నాము ఈ సమస్య ఏమిటంటే ప్రేరణ యొక్క ప్రశ్న ఇది ఒక జంతువును చంపడానికి చెడు కారణం కావచ్చు. జంతువును చంపడం పిల్లలు, వ్యక్తులు, స్త్రీలకు ఆహారం ఇవ్వడం కోరకైతే...

భక్తుడు: ఆకలి.

కార్డినల్ డానియల్ : ఆకలి, మేము ఆకలితో ఉన్నాము, ఇది చట్టబద్ధమైనది, చట్టబద్దమైనది... మనము కలిగి ఉన్నాము ... భారతదేశంలో, ఇది అంగీకరించడము కష్టము....

యోగేశ్వర: ఆవులు.

కార్డినల్ డానియల్ : ఆవులు. ఇక్కడ చంపడానికి అనుమతి లేదు...?

యోగేశ్వర : ఆవు.

కార్డినల్ డానియల్ : ఆకలితో ఉన్న పిల్లలకు ఇస్తాము ఒక ఆవు ...

ప్రభుపాద: లేదు, లేదు, ఏ ఇతర పరిశీలన నుండి అయినా, ఆవుల పాలను మనము త్రాగుతాము. అందువలన ఆమె తల్లి. అవునా కాదా?

యోగేశ్వర : (అనువాదము)

కార్డినల్ డానియల్: . అవును, అవును, పరిపూర్ణ౦గా, పరిపూర్ణ౦గా, కాని ...

ప్రభుపాద: వేదముల ప్రకారము, మనకు ఏడుగురు తల్లులు ఉన్నారు, Ādau-mātā, వాస్తవ తల్లి, guroḥ patnī, గురువు భార్య, ఆధ్యాత్మిక గురువు ...

కార్డినల్ డానియల్: అవును. భగవాన్: మీరు అర్థం చేసుకోగలరా?

యోగేశ్వర : (అనువాదము)

ప్రభుపాద: Ādau-mātā guroḥ patnī brāhmaṇī, గురువు, బ్రాహ్మణుని భార్య.

యోగేశ్వర : (అనువాదము) కార్డినల్ డేనియౌ: (అనువాదము)

ప్రభుపాద: రాజ-పత్నిక, రాజు భార్య, రాణి. కార్డినల్ డేనియౌ:....

ప్రభుపాద: నాలుగు. Ādau-mātā guroḥ patnī brāhmaṇī rāja-patnikā, dhenur. ధేను అంటే ఆవు అని అర్థం. Dhenur dhātrī. ధాత్రి అంటే నర్స్. దాది. Tathā pṛthvī. పృథ్వి అంటే భూమి. వీరు ఏడుగురు తల్లులు. కాబట్టి ఆవు తల్లి ఎందుకంటే మనము పాలు, ఆవు పాలను త్రాగుతాము.

కార్డినల్ డానియల్: అవును.

ప్రభుపాద: ఆమె తల్లి కాదని నేను ఎలా తిరస్కరించగలను? కాబట్టి మనం తల్లిని హతమార్చడానికి ఎలా సహకరిస్తాము? కార్డినల్ డేనియౌ: అవును, అవును, ఇది ఒక ప్రేరణ. కాని మేము అనుకుంటాము, ఆ ...

ప్రభుపాద: అందువల్ల, భారతదేశంలో మాంసం తినేవారికి, వారికి సలహా ఇవ్వబడినది ... అది కూడా పరిమితముగా. ఉదాహరణకు కొన్ని మేకలు, కొన్ని తక్కువ స్థాయి జంతువులను, గేదె వరకు కూడా చంపమని సలహా ఇచ్చారు. కానీ ఆవును చంపడము గొప్ప పాపము.

కార్డినల్ డానియల్: అవును, అవును, అవును, అవును. అవును, ... నాకు తెలుసు, నాకు తెలుసు. ఇది మాకు, ఒక కష్టం, ఒక కష్టం...

ప్రభుపాద: అవును, ఎందుకంటే ఆవు తల్లి. కార్డినల్ డేనియౌ: అవును, అవును, అది అటువoటిదే

ప్రభుపాద: మీరు, మీరు తల్లి నుండి పాలు తీసుకుoటారు, ఆమె వృద్ధాప్యములో ఉన్నప్పుడు, ఆమె మీకు పాలు ఇవ్వలేనప్పుడు, అందువలన ఆమెను హత్య చేయాలా?

కార్డినల్ డానియల్: అవును.

ప్రభుపాద: ఇది చాలా మంచి ప్రతిపాదననా?

యోగేశ్వర: (అనువాదము),

కార్డినల్ డానియల్ : ....

యోగేశ్వర: ఆయన అవును అని చెప్పాడు. ఆయన చెప్పాడు: "అవును, ఇది మంచి ప్రతిపాదన."

కార్డినల్ డానియల్ : వ్యక్తులు ఆకలితో ఉన్నట్లయితే, వ్యక్తుల జీవితం ఆవు జీవితం కంటే చాలా ముఖ్యమైనప్పుడు

ప్రభుపాద: అందువలన, మనము ఈ కృష్ణ చైతన్యమును ప్రచారం చేస్తున్నందున, మనము మాంసం తినవద్దని, ఏ రకమైనది తినవద్దని ప్రజలను అడగుతాము.

కార్డినల్ డానియల్ : అవును, అవును.

ప్రభుపాద: కానీ ఏదైనా పరిస్థితులలో మాంసం తినవలసి వస్తే, ఏదైనా తక్కువ స్థాయి జంతువుల మాంసం తినండి. ఆవులను చంపవద్దు. ఇది అత్యంత గొప్ప పాపము. ఎంత కాలము మనము పాపంగా ఉంటామో, ఆయనకు దేవుడు అంటే ఏమిటో అర్థం చేసుకోలేడు. కాని మానవుడు, ప్రధాన కర్తవ్యము దేవుణ్ణి అర్థం చేసుకోవటము ఆయనను ప్రేమించడము. ఆయన పాపాత్ముడుగా ఉండినట్లయితే, ఆయన దేవుణ్ణి అర్థం చేసుకోలేడు, ఆయనను ప్రేమించే ప్రశ్న ఏమిటి. అందువలన, కనీసం మానవ సమాజం నుండి, ఈ క్రూరమైన కబేళాలల నిర్వహణను నిలిపివేయాలి.

కార్డినల్ డానియల్: (.......)

యోగేశ్వర: (అనువాదము)

కార్డినల్ డానియల్ : ..... నేను అనుకుంటున్నాను, బహుశా ఇది ముఖ్యమైన అంశం కాదు. ఈ ప్రపంచములో వివిధ మతాల ఉపయోగాలు బాగున్నాయని నేను భావిస్తున్నాను. ప్రాముఖ్యత దేవుణ్ణి ప్రేమిoచడము.

ప్రభుపాద: అవును.

కార్డినల్ డానియల్ : కాని దేవుని ఆజ్ఞ ఆచరణ వేరుగా ఉండవచ్చు.

ప్రభుపాద: లేదు. ఉదాహరణకు దేవుడు , దేవుడు కనుక ఇలా చెప్పితే: "నీవు దీనిని చేయవచ్చు," అది పాపం కాదు కాని దేవుడు కనుక చెప్పితే: "నీవు చేయకూడదు", అది పాపం.