TE/Prabhupada 0417 - ఈ జీవితంలోను మరియు తదుపరి జీవితంలోను కూడా ఆనందంగా ఉండండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0417 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 13:05, 12 September 2017



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ఈ కృష్ణచైతన్య ఉద్యమంను స్వీకరించండి. ఈ జీవితంలోను మరియు తదుపరి జీవితంలోను కూడా ఆనందంగా ఉండండి. ఈ జీవితంలో మీరు కృష్ణుడికి మీ ప్రేమ యుత సేవలను పూర్తిగా అందిస్తే, అప్పుడు మీరు 100% చేసినట్లు అవుతుంది. చేయలేకపోతే, మీ జీవితంలో మీరు అమలు చేసిన మొత్తం శాతం మీతోపాటే ఉంటుంది. ఇది ఎక్కడికీ పోదు, దీని గురించి భగవద్గీతలో హామీ ఇవ్వబడింది. అది ఏమిటంటే, śucīnāṁ śrīmatāṁ gehe yoga bhraṣṭo sañjāyate ( BG 6.41) ఈ యోగ పద్ధతిని పూర్తిగా వందకు వంద శాతం అమలు చేయలేని వ్యక్తి, అతనికి తర్వాత జన్మ గొప్ప ధనవంతుల కుటుంబంలో లేదా పవిత్రమైన కుటుంబంలో జన్మించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. రెండు ప్రత్యామ్నాయాలు. మీరు పవిత్రమైన కుటుంబంలో లేదా ధనవంతుల కుటుంబంలో జన్మించాల్సి వస్తుంది. కనీసం మీ జన్మ మానవజన్మ నే అన్నది హామీ ఇవ్వబడుతుంది. కానీ మీరు ఈ కృష్ణచైతన్య ఉద్యమమును తీసుకోకపోతే మీ తదుపరి జన్మ ఏమిటో మీకు తెలియదు. 84 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి వాటిలో దేనిలోకైనా మీరు వెళ్ళవచ్చును. మీరు ఒకవేళ మీరు ఒక చెట్టు జన్మలోకి బదిలీ చేయబడితే.... నేను ప్రాన్సిస్కో లో చూసినట్లుగానే వారు చెప్పారు అది "ఈ చెట్టు 7 వేల సంవత్సరాలపాటు గా నిలిచి ఉంది" అని అన్నారు వారు ఏడు వేల సంవత్సరాలు ఒక చోటనే నిలబడాలి. ఈ బాలురు కొన్నిసార్లు పాఠశాలలో ఉపాధ్యాయులచే శిక్షింప బడతారు, "బల్ల మీద ఎక్కి నిలబడండి." అలాగనే ఈ చెట్లు ఇట్ల శిక్షించ బడుతున్నాయి, ప్రకృతి చట్టంచే "నిలబడి ఉoడండి" కావునా ఒక చెట్టు కావడానికి అవకాశముంది,కుక్క పిల్లిగా లేదా ఎలుకగా మారడానికి అవకాశం ఉంది. చాలా రకాల జీవజాతులు ఉన్నాయి, ఈ మానవజీవిత అవకాశాన్ని వదులుకోవద్దు. మీ యొక్క ప్రేమను కృష్ణుని పై సంపూర్ణంగా నిలపండి మరియు ఈ జీవితములో తదుపరి జీవితంలో ఆనందంగా ఉండండి