TE/Prabhupada 0930 - ఈ భౌతిక స్థితి నుండి బయట పడితే అప్పుడు వాస్తవ జీవితము, శాశ్వతమైన జీవితము ఉంటుంది: Difference between revisions

(No difference)

Revision as of 12:12, 15 December 2017



730423 - Lecture SB 01.08.31 - Los Angeles


మీరు ఈ భౌతిక స్థితి నుండి బయట పడితే. అప్పుడు వాస్తవ జీవితము, శాశ్వతమైన జీవితము ఉంటుంది విమర్శించడము మా కర్తవ్యము కాదు, కానీ కలి యుగము యొక్క లక్షణాలు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి, మరియు ఇవి మరింతగా మరింతగా పెరుగుతాయి. మనము కలి యుగములో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిపాము, కానీ కలి-యుగము యొక్క కాల వ్యవధి 4,00,000, 4,32,000 సంవత్సరాలు, దీనిలో మనము కేవలము 5,000 సంవత్సరాలు మాత్రమే గడిపినాము. 5,000 సంవత్సరాల గడిచిన తరువాత, మనము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము మనము ఈ కలి యుగములో మరింత ముందుకు వెళ్ళితే, రోజులు మరింత కష్టం అవుతాయి. కాబట్టి మీ కృష్ణ చైతన్యము పనులను పూర్తి చేస్తే మంచిది తిరిగి భగవద్ ధామమునకు వెళ్ళటము, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటము. అది మిమ్మల్ని రక్షిస్తుంది. లేకపోతే, మనము తిరిగి వస్తే, ఇబ్బందులు, కష్టమైన రోజులు ముందు ఉన్నాయి. మనము మరింత బాధపడాలి.

కాబట్టి కృష్ణుడు ఇక్కడ అజాగా వర్ణించబడ్డాడు. Ajo 'pi sann avyayātmā bhūtānām īśvaro 'pi san. ఇది భగవద్గీతలో చెప్పబడింది. Ajo 'pi. "నేను జన్మించలేదు." అవును. కృష్ణుడు జన్మించలేదు. మనము కూడా జన్మించలేదు. కానీ వ్యత్యాసం ఏమిటంటే, ఈ భౌతిక శరీరములో మనము చిక్కుకున్నాము. అందుకు మనము మన స్థితిని జన్మించినట్లుగా ఉంచుకోలేము. మనం జన్మ తీసుకోవలసి ఉంటుంది, ఒక శరీరం నుండి మరొక దానికి వెళ్ళడానికి, మీరు తదుపరి ఏ విధమైన శరీరం పొందుతారో హామీ లేదు. కానీ మీరు అంగీకరించాలి.

ఉదాహరణకు ఈ జీవితంలో ఒకటి తరువాత మరొక శరీరమును మనం అంగీకరిస్తున్నాం. పిల్లవాడు తన శిశువు శరీరాన్ని వదలి వేస్తున్నాడు, బాల్య శరీరాన్ని తీసుకుంటున్నాడు. పిల్లవాడు తన బాల్య శరీరాన్ని వదలి వేస్తున్నాడు, యువకుని శరీరం స్వీకరిస్తున్నాడు. అదేవిధముగా , ఈ వృద్ధాప్య శరీరం, మనము వదలివేసినప్పుడు సహజ సారంశము నేను మరొక శరీరమును అంగీకరించవలసి ఉంటుంది. మరల బాల్య శరీరం. ఉదాహరణకు కాలానుగుణ మార్పులు ఉన్నట్లుగా. వేసవి తరువాత, వసంతం ఉంది, లేదా వసంత ఋతువు తరువాత వేసవి ఉంటుంది, వేసవి తరువాత, వర్ష ఋతువు వస్తుంది వర్ష ఋతువు తరువాత, శీతాకాలం ఉంది. లేదా పగలు తర్వాత, రాత్రి, రాత్రి తరువాత, పగలు ఉంటాయి. ఈ విధముగా , ఇవి ఒకటి తరువాత మరొకటి (గుండ్రంగా) (చక్రంలో) ఉన్నాయి, అదేవిధముగా , మనం ఒకదాని తరువాత మరొక శరీరం మారుస్తున్నాము. సహజ సారంశము ఈ శరీరం మారిన తర్వాత నేను మరొక శరీరమును పొందుతాను. Bhūtvā bhūtvā pralīyate ( BG 8.19)

ఇది చాలా తార్కికం, శాస్త్రము ద్వారా మద్దతు ఇవ్వబడినది, గొప్ప ప్రామాణికముచే మాట్లాడబడినది. కృష్ణునిచే ఎందుకు మీరు దీనిని అంగీకరించకూడదు? మీరు అంగీకరించకపోతే, అది మూర్ఖత్వం. మీరు అనుకోకపోతే, మరణం తరువాత జీవితం లేదని, ఇది మూర్ఖత్వం. మరణం తరువాత జీవితం ఉంది. అందువల్ల మనము ఒక శరీరము తరువాత మరొక శరీరమును అంగీకరిస్తున్నాము కనుక, అనాది కాలము నుండి మనకు శాశ్వతమైన జీవితం ఉందని ఆలోచించలేము. మనకు ఇది చాలా కష్టము.

ఉదాహరణకు వ్యాధి ఉన్న వ్యక్తి లాగానే. ఆయన మంచం మీద పడి ఉన్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే మలం చేస్తున్నాడు, అక్కడే, అక్కడే మూత్రము పోస్తున్నాడు, ఆయన కదలలేడు, చాలా చేదు ఔషధం తీసుకుంటున్నాడు. చాలా అసౌకర్యములు ఉన్నాయి. ఆయన పడుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఓ, ఈ జీవితం చాలా భరించలేనిది. నన్ను ఆత్మహత్య చేసుకోనియండి. కాబట్టి నిరాశాజనక పరిస్థితిలో కొన్నిసార్లు శూన్యము మరియు నిరాకారము అనుసరించబడుతుంది. విషయాలను సున్నా చేయడానికి. ఎందుకంటే ఈ జీవితం చాలా సమస్యాత్మకమైనది, కొన్నిసార్లు దీని నుండి బయటపడటానికి ఆత్మహత్య చేసుకుంటాడు, నేను భౌతిక జీవితము సమస్యాత్మకమైన జీవితము అని చెప్తాను. కాబట్టి శూన్యము మరియు నిరాకార తత్వము అలాంటిదే. ఇంకొక జీవితం గురించి ఆలోచించలేరు, వదల లేరు, మళ్ళీ తినడం, నిద్రపోవటం, మరలా పనిచేయడం. ఆయన తినడం, నిద్రపోవటం, అంటే మంచం మీద అని ఆలోచిస్తాడు. అంతే. మరియు బాధ. ఆయన వేరొకటి ఆలోచించలేరు. ప్రతికూల విధానములో, ఇది సున్నా చేయడానికి. అది శూన్య తత్వము. కానీ నిజానికి అది వాస్తవము కాదు. వాస్తవము ఏమిటంటే మీరు భౌతిక పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఈ భౌతిక పరిస్థితి నుండి బయటపడండి. అప్పుడు వాస్తవమైన జీవితం, శాశ్వత జీవితం ఉంది.