TE/Prabhupada 0751 - మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి మీరు ఆహారం తీసుకోవాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0751 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(No difference)

Revision as of 12:06, 20 December 2017



Lecture on SB 1.8.37 -- Los Angeles, April 29, 1973


ప్రభుపాద: ప్రతి ఒక్కరు దగ్గుతున్నారు ఎందుకు? ఇబ్బంది ఏమిటి? నిన్న కూడా నేను విన్నాను. ఇబ్బంది ఏమిటి?

భక్తుడు: నేను జలుబు ఉంది అని అనుకుంటున్నాను.

ప్రభుపాద: అహ్?

భక్తుడు: నేను జలుబు ఉంది అని అనుకుంటున్నాను, చాలా మంది ప్రజలకు.

ప్రభుపాద: కానీ మీకు తగినంత వెచ్చని వస్త్రములు లేవా, కాబట్టి మీరు ప్రభావితం అయినారా? మీరు ఏర్పాట్లు చేయాలి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Yuktāhāra-vihārasya yogo bhavati siddhi ([[Vanisource:BG 6.17)... భగవద్గీతలో చెప్పబడినది యుక్తాహార అని అంటారు. మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి మీరు ఆహారం తీసుకోవాలి. అదేవిధముగా, శరీరం యొక్క ఇతర అవసరాలు జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు వ్యాధికి గురైనట్లయితే, అప్పుడు మీరు ఎలా కృష్ణ చైతన్యమును అమలు చేస్తారు? ఉదాహరణకు బ్రహ్మానంద ఈరోజు వెళ్ళలేదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనము ఎక్కువ లేదా తక్కువ తినకూడదు. మరింత తినడానికి బదులు తక్కువ తినండి. తక్కువ తినడం ద్వారా మీరు చనిపోరు. కానీ మీరు ఎక్కువ తినడం వలన చనిపోవచ్చు. ప్రజలు అతిగా తినడం వలన చనిపోతారు, తక్కువ తినడము వలన కాదు. ఇది సూత్రం అయి ఉండాలి. వైద్య శాస్త్రము ఎప్పుడూ నిషేధిస్తుంది, మీకు అవసరం అయిన దాని కంటే ఎక్కువ తినకూడదు. విపరీతముగా తినడం మధుమేహం యొక్క కారణం, పోషకాహార లోపం క్షయవ్యాధి కారణం. ఇది వైద్య శాస్త్రం. కాబట్టి మనం ఎక్కువ లేదా తక్కువ తీసుకోకూడదు. పిల్లల విషయములో, వారు మరింత తీసుకునే పొరపాట్లను చేయవచ్చు, కానీ పెద్ద వారు, వారు ఈ తప్పు చేయకూడదు, మరింత తీసుకోవడం. పిల్లలు, వారు జీర్ణం చేసుకోగలరు. రోజంతా వారు ఆడుతున్నారు.

కాబట్టి ఏమైనప్పటికీ, మనము మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సనాతన గోస్వామి, ఆయన దురద వలన చాలా బాధపడ్డాడు, చైతన్య మహాప్రభు ఆయనని ఆలింగనం చేసుకున్నారు. అయితే, దురద తడి దురద. రెండు రకాల దురదలు, తడి మరియు పొడి ఉన్నాయి. కొన్నిసార్లు దురద ఉన్న ప్రదేశము పొడిగా ఉంటుంది, కొన్నిసార్లు అది తడిగా ఉంటుంది. గీరుకున్న తర్వాత, అది తడి అవుతుంది. కాబట్టి సనాతన గోస్వామి యొక్క శరీరం తడిగా ఉన్న దురదతో కప్పబడి ఉంది, చైతన్య మహాప్రభు ఆయనని ఆలింగనం చేసుకుంటున్నారు. కాబట్టి తేమ, తేమ, చైతన్య మహాప్రభు యొక్క శరీరానికి అంటుకుంటుంది. అందువల్ల ఆయన చాలా సిగ్గుపడ్డాడు నేను దురద వలన బాధపడుతున్నాను, చైతన్య మహాప్రభు నన్ను ఆలింగనం చేసుకుంటున్నారు, తడి దురద ఆయన శరీరమునకు అంటుకుంటుంది ఎంత దురదృష్టకరం. " అందువలన ఆయన "రేపు నేను ఆత్మహత్య చేసుకుంటాను అని నిశ్చయించు కున్నాడు చైతన్య మహాప్రభు నన్ను ఆలింగనం చేసుకోవటానికి అనుమతించే బదులుగా. " మరుసటిరోజు చైతన్య మహాప్రభు "ఆత్మహత్య చేసుకోవాలని మీరు నిర్ణయించుకున్నారా" అని అడిగారు. ఈ శరీరం మీది అని అనుకుంటున్నారా? "కాబట్టి ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. చైతన్య మహాప్రభు చెప్తారు "మీరు ఇప్పటికే ఈ శరీరాన్ని నాకు అంకితం చేసారు. మీరు ఎలా దానిని చంపుతారు అదేవిధముగా... వాస్తవానికి, ఆ రోజు నుండి, ఆయన దురదలు అన్నీ నయమయినాయి ... కానీ ఇది నిర్ణయం, మన శరీరము, కృష్ణ చైతన్యములో ఉన్న వారు, కృష్ణుని కోసం పని చేస్తున్న వారు, శరీరం తనకు చెందినదని అనుకోకూడదు. ఇది ఇప్పటికే కృష్ణునికి అంకితం చేయబడింది. కావున ఇది తప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏ నిర్లక్ష్యం లేకుండా. ఉదాహరణకు ఇది కృష్ణుడి ప్రదేశంగా ఉన్నందున మీరు ఆలయ సంరక్షణ తీసుకుంటున్నట్లుగానే. అదేవిధముగా ... మనము అతి జాగ్రత్త తీసుకోకూడదు, కానీ మనము వ్యాధి కలగకుండా ఉండుటకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.