TE/Prabhupada 1034 - మరణం అంటే ఏడు నెలలు నిద్ర పోవడము. అంతే. అది మరణం: Difference between revisions

(No difference)

Revision as of 06:21, 28 January 2018



720403 - Lecture SB 01.02.05 - Melbourne


మరణం అంటే ఏడు నెలలు నిద్ర పోవడము. అంతే. అది మరణం. నేను, మీరు, మనలో ప్రతి ఒక్కరు, మరణ సమయంలో మనకు ఇబ్బంది ఉంటుంది, జనన సమయంలో జననము మరియు మరణము. మనం జీవులము, మనం ఆత్మ. జననము మరణము ఈ శరీరము నందు జరుగుతుంది. శరీరం జన్మను తీసుకుంటుంది, శరీరము నాశనము అవుతుంది. మరణం అంటే ఏడు నెలలు నిద్రపోవడము అని అర్థం. అంతే. అది మరణం. ఆత్మ.... ఈ శరీరం జీవించటానికి పనికిరానపుడు, ఆత్మ శరీరాన్ని త్యజిస్తుంది. మరల ఉన్నత అమరిక ద్వారా ఆత్మ ఒక ప్రత్యేక రకమైన తల్లి గర్భంలోకి మరలుతుంది, ఆత్మ ప్రత్యేక రకమైన శరీరాన్ని పెంచుతుంది. ఏడు నెలల వరకు ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటుంది. శరీరం అభివృద్ధి చెందినప్పుడు, మళ్లీ చైతన్యం వస్తుంది పిల్లవాడు గర్భం నుండి బయటకు రావాలని కోరుకుంటున్నాడు అతడు కదులుతాడు. ప్రతి తల్లికి అనుభవం ఉంటుంది, ఎలా బిడ్డ ఏడు నెలల వయసులో తల్లి గర్భంలో కదులుతుంది.

కాబట్టి అది ఒక గొప్ప శాస్త్రం, ఆత్మ ఎలా, ఆత్మ, ఈ భౌతిక శరీరంతో సంబంధం ఉంది, ఎలా ఒక శరీరం నుండి మరొక శరీరమునకు వెళుతున్నాడు. ఉదాహరణ ఇవ్వబడింది, వాసాంసి జీర్ణాని యథా విహాయ ( BG 2.22) మనము.... దుస్తులు, మన చొక్కా కోటు చాలా పాతవి అయినప్పుడు, మనం ఇచ్చి, మరొక చొక్కా కోటును అంగీకరిస్తాము..... అదే విధముగా, నేను, మీరు, మనలో ప్రతి ఒక్కరు‌, మనము ఆత్మ. భౌతిక ప్రకృతి అమరిక ద్వారా మనకు ఒక రకమైన శరీరము మరియు చొక్కా కోటు ఇవ్వబడింది. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః! అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే!! ( BG 3.27) మన ప్రత్యేకమైన జీవన ప్రమాణం కోసం ప్రత్యేక శరీరం మనకు ఇవ్వబడుతుంది. యూరోపియన్, అమెరికన్, ఆస్ట్రేలియన్ల లాగా, మీకు ఒక ప్రత్యేకమైన రకం ఇచ్చారు, మీకు అవకాశం ఇవ్వబడింది, ఒక ప్రత్యేక జీవన నిర్దిష్ట ప్రమాణం ఇవ్వబడింది. ఎవరో భారతీయుడు మీ మెలబోర్న్ నగరం లాంటి యూరోపియన్, అమెరికన్, ఆస్ట్రేలియన్ నగరాలకు వస్తే... నేను నా విద్యార్థులతో మాట్లాడుతున్నాను, “ఎవరైనా భారతీయుడు వచ్చినా, వారు ఈ జీవన ప్రమాణాలతో ఆశ్చర్యపోతారు.”