TE/Prabhupada 1027 - నా భార్య, పిల్లలు సమాజం నా సైనికులు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1026 - Si nous comprenons que nous ne sommes pas le jouisseur, Krishna est le jouisseur - cela est Monde Spirituel|1026|FR/Prabhupada 1028 - Tous ces politiciens, Ils gâchent la situation|1028}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1026 - మనము ఆనందించే వారిమి కాదు, కృష్ణుడు ఆనందించే వాడు - అది ఆధ్యాత్మిక ప్రపంచం|1026|TE/Prabhupada 1028 - ఈ రాజకీయ నాయకులు అందరు, వారు పరిస్థితిని నాశనము చేస్తున్నారు|1028}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|tkHCEFTGYwo|నా భార్య, పిల్లలు సమాజం నా సైనికులు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తారు  <br/>- Prabhupāda 1027}}
{{youtube_right|d3IwxIzE2_0|నా భార్య, పిల్లలు సమాజం నా సైనికులు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తారు  <br/>- Prabhupāda 1027}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



731129 - Lecture SB 01.15.01 - New York


నా భార్య, పిల్లలు మరియు సమాజం నా సైనికులు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు, వారు నాకు సహాయం చేస్తారు కాబట్టి మీరు కృష్ణుడి యొక్క నియమాలను ఉల్లంఘించలేరు, లేదా ప్రకృతి యొక్క చట్టాలను, అది సాధ్యం కాదు. మీరు స్వతంత్రముగా లేరు. ఎందుకంటే ఈ మూర్ఖులకు, వారు దీనిని అర్థం చేసుకోలేరు. వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, మనము స్వతంత్రులము అని. అసంతృప్తికి ఇది కారణం. ఎవరూ స్వతంత్రులు కారు. మీరు ఎలా స్వతంత్రంగా ఉంటారు? ఎవరూ స్వతంత్రుడు కాదు, మీరు స్వతంత్రంగా ఉండలేరు, లేదా ఎవరూ స్వతంత్రంగా లేరు. వాస్తవమునకు, ఎవరు స్వతంత్రులు? ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, చాలామంది అబ్బాయిలు మరియు బాలికలు, "నేను ప్రతి దానికీ స్వతంత్రంగా ఉన్నాను" అని చెప్పగలరా? లేదు, ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఇది మన పొరపాటు, మన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడము వలన మనము ఈ భౌతిక ప్రపంచములో చాలా విధాలుగా బాధపడుతున్నాము. అది సంస్కరించవలసి ఉంటుంది. దానిని తనిఖీ చేయాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. చైతన్య మహా ప్రభు ప్రచారము చేశారు, jīvera svarūpa haya nitya kṛṣṇa dāsa ( CC Madhya 20.108-109) మనము జీవులము, మనము కృష్ణుడికి నిత్య సేవకులము. అది మన పరిస్థితి. కానీ మనము ఈ స్థానాన్ని తిరస్కరించినట్లయితే, "ఇప్పుడు నేను ఎందుకు కృష్ణుని యొక్క సేవకుని అవుతాను? నేను స్వతంత్రంగా ఉన్నాను, "అప్పుడు బాధ మొదలవుతుంది. వెంటనే Kṛṣṇa bhuliya jīva bhoga vañcha kare... మీరు స్వతంత్రంగా ఆస్వాదించాలని కోరుకున్న వెంటనే, వెంటనే... అనగా వెంటనే ఆయన మాయ ద్వారా బంధించ బడతాడు.

kṛṣṇa bhuliya jīva bhoga vāñchā kare
pāśate māyā tāre jāpaṭiyā dhare

ఇది అర్థంచేసుకోవడము చాలా సులభం. ఉదాహరణకు ప్రభుత్వ చట్టాలను మీరు పట్టించుకోకుండా, మీరు స్వతంత్రంగా జీవించాలనుకుంటే, అనగా వెంటనే మీరు పోలీసుల చేతిలో ఉన్నారు. మీరు సృష్టించ వలసిన అవసరము లేదు, అది ఇప్పటికే ఉంది. కాబట్టి మన పరిస్థితి ఎల్లప్పుడు భగవంతుని పై ఆధారపడి ఉంటుంది. మనము దీనిని అర్థం చేసుకోవాలి. ఇది కృష్ణ చైతన్యము. అందువలన, భక్తివినోద ఠాకురా ఒక పాటను పాడారు,

mānaso deho geho, yo kichu mora,
arpilun tuyā pade nanda-kiśora

ఈ తప్పు జరుగుతోంది, నేను స్వతంత్రంగా ఉన్నాను, రాజుగా, నా సైనికులు లేదా నా వర్గము , సమాజము, కుటుంబం లేదా చాలా మనము చాలా తయారు చేశాము- కానీ

dehāpatya-kalatrādiṣv
ātma-sainyeṣv asatsv api
teṣāṁ nidhanaṁ pramattaḥ
paśyann api na paśyati
(SB 2.1.4)

ఉదాహరణకు ఒక మనిషి పోరాడుతున్నట్లే, హిట్లర్ యుద్ధాన్ని ప్రకటించినట్లుగా, లేదా చాలా యుద్ధాలు ప్రకటించబడినవి,. ఈ వ్యక్తి ప్రకటిస్తున్నాడు, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు, "నేను స్వతంత్రంగా ఉన్నాను." కావున, మనకు చాలా సైనికులు ఉన్నారు అని ఆలోచిస్తున్నాము, చాలా అణు బాంబులు, అనేక విమానాలు, మనము విజయవంతముగా బయటకు వస్తాము అని అనుకుంటున్నాము. అదేవిధముగా, మనలో ప్రతి ఒక్కరూ, మనము ఆలోచిస్తున్నాము, "నేను స్వతంత్రంగా ఉన్నాను, నా భార్య, నా పిల్లలు, నా సమాజం, వారు నా సైనికులు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు, వారు నాకు సహాయం చేస్తారు. " ఇది జరుగుతోంది. దీన్ని మాయ అని పిలుస్తారు. Pramattaḥ teṣāṁ nidhanaṁ paśyann api na paśyati. స్వాతంత్ర్యం, స్వాతంత్రం అని పిలవబడిన దాని కొరకు మనము పిచ్చిగా ఉన్నాము కనుక, ఈ విషయాలు మనకు సహాయం చేస్తాయని మనము ఆలోచిస్తున్నాం, మనల్ని కాపాడతాయి, కానీ అది మాయ. Teṣāṁ nidhanam, ప్రతి ఒక్కరూ నాశనం చేయబడతారు. ఎవరూ మనకు రక్షణ ఇవ్వలేరు. వాస్తవమైన రక్షణను మనము కోరుకుంటే, ఆయన కృష్ణుడి రక్షణ పొందవలసి ఉంటుంది. ఇది భగవద్గీత యొక్క సూచన, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) మీరు మూర్ఖులు, మీరు చాలా విషయాలు మీకు రక్షణ ఇస్తాయని మీరు ఆలోచిస్తున్నారు. అది సాధ్యం కాదు. మీరు పూర్తవుతారు, మీ రక్షకుడు , స్నేహితులు, సైనికులు అని పిలువబడే వారు, వారు పూర్తి అవుతారు. మీరు వారిపై ఆధారపడవద్దు. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇam ( BG 18.66) .. మీరు నాకు శరణాగతి పొందండి, నేను మీకు రక్షణ ఇస్తాను. Ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ. ఇది వాస్తవమైన రక్షణ