TE/Prabhupada 0482 - మనస్సు అనేది బంధకారకమైన దాని వైపు వెళ్లే వాహనం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0482 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Seattle]]
[[Category:TE-Quotes - in USA, Seattle]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0481 - Krishna est infiniment fascinant, Krishna est beau|0481|FR/Prabhupada 0483 - Comment pouvez-vous penser à Krishna à moins d’accroître votre amour pour Krishna?|0483}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0481 - కృష్ణుడు సర్వాకర్షకుడు. కృష్ణుడు సుందరంగా వుంటాడు|0481|TE/Prabhupada 0483 - మీరు కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకోకుండా ఎలా కృష్ణుని స్మరించగలరు|0483}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|XlUue84xyN0|మనస్సు అనేది బంధకారకమైన దాని వైపు వెళ్లే వాహనం  <br />- Prabhupāda 0482}}
{{youtube_right|8vCCKYVDamY|మనస్సు అనేది బంధకారకమైన దాని వైపు వెళ్లే వాహనం  <br />- Prabhupāda 0482}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:36, 8 October 2018



Lecture -- Seattle, October 18, 1968


మనస్సు అనేది బంధకారకమైన దాని వైపు వెళ్లే వాహనం. మీరు ఎవరిపట్లైనా బంధంపెంచుకుంటే,ఎవరో ఒక అబ్బాయి పట్లో, ఒక అమ్మాయి పట్లో, ఎవరో ఒక వ్యక్తి పట్ల ... సాధారణంగా, మనము ఒక వ్యక్తి పట్ల బంధాన్ని పెంచుకుంటాం. నిరాకారత్వపు బంధనము అనేది బూటకమైనది. మీరు బంధాన్ని పెంపొందించుకోవాలంటే అది వ్యక్తి పట్ల ప్రదర్శించాలి. ఇది సత్యమేనా? నిరాకారత్వపు బంధనము ... మీరు ఆకాశాన్ని ప్రేమించలేరు, కానీ మీరు సూర్యుడిని ప్రేమిస్తారు, మీరు చంద్రునిని ప్రేమిస్తారు, మీరు నక్షత్రాలను ప్రేమిస్తారు, ఎందుకంటే వారు ఒకానొక వ్యక్తులు. మరి మీరు ఆకాశాన్ని ప్రేమించాలనుకుంటే, అది మీకు చాలా కష్టసాధ్యము. చివరకు మీరు మళ్ళీ ఈ సూర్యుని వద్దకు రావాలి. కాబట్టి యోగ పద్ధతి, పరిపూర్ణత్వంతో ముగిస్తుంది, ప్రేమతో ముగుస్తుంది ... కాబట్టి మీరు ఎవరో ఒకరిని,ఒక వ్యక్తిని ప్రేమించాలి. అది కృష్ణుడు. ఇక్కడ ఒక చిత్రం ఉంది. రాధారాణి కృష్ణుడిని ప్రేమిస్తోంది,ఆమె పుష్పాలను కృష్ణుడికి అర్పిస్తోంది, మరియు కృష్ణుడు ఆయన వేణువును వాయిస్తున్నాడు. మీరు ఈ చిత్రాన్ని చక్కగా, ఎప్పుడూ స్మరించవచ్చు. అప్పుడు మీరు నిరంతరం యోగంలో స్థితులైవుంటారు, సమాధి. ఎందుకు నిరాకారత్వము? ఎందుకు మీరు ఏదో, శూన్యాన్ని స్మరిస్తారు? శూన్యాన్ని ధ్యానించకూడదు. మీరు ఏదో శూన్యాన్ని స్మరించదలిస్తే, ఏదో ఒక కాంతి ఉండాలి, ఏదో రంగు,వివిధ వర్ణాలు,ఇలా చాలా ప్రశ్నలు ఎదురౌతాయి. కానీ అది కూడ ఆకారం కల్గివుంటుంది. ఎలా మీరు రూపాన్ని నివారించగలరు? అది సాధ్యం కాదు. అందుచేత మీరు మీ మనస్సును వాస్తవమైన రూపము మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు, īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (Bs. 5.1), ఆ దేవాదిదేవుడు,నియామకుడు, పరమ నియామకుడు, ఎవరైతే రూపసహితుడో? ఎలా? విగ్రహః, విగ్రహః అంటే శరీరం. ఏ విధమైన శరీరం? సత్-చిత్-ఆనంద, శాశ్వత శరీరం, ఆనందంతో నిండిన, జ్ఞానంతో నిండిన శరీరం. అటువంటి శరీరం. మనలాంటి సాధారణ శరీరం కాదు. ఈ శరీరం అజ్ఞానంతో నిండినది, దుఃఖంతో నిండినది, శాశ్వతమైనది కాదు. ఇందుకు వ్యతిరేకంగా. ఆయన శరీరం శాశ్వతమైనది; నా శరీరం శాశ్వతమైనది కాదు. ఆయన శరీరం ఆనందంతో నిండి ఉంది; నా శరీరం దుఃఖాలతో నిండి ఉంది, ఎల్లప్పుడూ నాకు ఏదోఒక ఇబ్బంది కలిగుతుంటుంది. ఏదో - తలనొప్పి, పంటి, ఈ నొప్పి, ఆ నొప్పి. ఎవరోఒకరు నాకు వ్యక్తిగత ఇబ్బందులు కలిగిస్తారు. ఎన్నెన్నో... ఆధ్యాత్మిక,ఆధిభౌతిక,తీవ్రమైన వేడి, తీవ్రమైన చలి, చాలా సమస్యలు. ఈ భౌతిక శరీరం, ఈ శరీరం ఎల్లప్పుడూ త్రివిధతాపాలకు గురయ్యేటువంటిది.