TE/Prabhupada 0426 - పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని , మరణించిన వారిని గూర్చి గాని శోకించరు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0426 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0425 - Ils ont peut être changé des choses|0425|FR/Prabhupada 0427 - L’âme diffère des corps grossier et subtil|0427}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0425 - వారు కొన్ని మార్పులు చేసి ఉండవచ్చును|0425|TE/Prabhupada 0427 - ఆత్మ, స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం నుండి భిన్నంగా ఉన్నది|0427}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Wu3fkC2hIFk|పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని , మరణించిన వారిని గూర్చి గాని శోకించరు  <br/>- Prabhupāda 0426}}
{{youtube_right|CdZ0ZcxEV-w|పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని , మరణించిన వారిని గూర్చి గాని శోకించరు  <br/>- Prabhupāda 0426}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:27, 8 October 2018



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972


ప్రభుపాద: అనువాదం.

ప్రద్యుమ్న: అనువాదం: "భగవంతుడు చెప్పారు: ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచూనే, నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించు చున్నావు. పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని లేదా మరణించిన వారిని గూర్చి గాని శోకించరు ( BG 2.11) "

ప్రభుపాద: "ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే, నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించు చున్నావు. పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని లేదా మరణించిన వారిని గూర్చి గాని శోకించరు. " ఈ కృష్ణ తత్వము, కృష్ణ చైతన్య ఉద్యమం, జీవి యొక్క స్వరూప స్థితి ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రజలకు నేర్పుతుంది. ఇక్కడ చెప్పబడినది పండితుడైన వ్యక్తి, ఆయన జీవించి ఉన్నలేదా మరణించిన శరీరము గురించి గాని విచారించడు. (ప్రక్కన :) వారిని ముందు వరుసలో నుండి పంపించాలి. వారిని పంపించాలి, వారు వెనుకకు వెళ్ళాలి. ప్రస్తుత నాగరికత శరీర భావన పై ఆధారపడి ఉంది: నేను ఈ శరీరము. "నేను ఇండియన్," "నేను అమెరికన్," నేను హిందూ, "నేను ముస్లిం," "నేను నల్లవాడను," "నేను తెల్ల వాడను," ఇంకా ఎన్నో. మొత్తం నాగరికత ఈ శరీర భావనలో జరుగుతోంది. నేర్చుకోవడములో పురోగతి ఉన్నప్పటికీ, అనేక విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు ఉన్నాయి, కానీ ఎక్కడా ఈ విషయమును చర్చించలేదు లేదా నేర్పించబడలేదు, "నేను ఏమిటి." అయితే, వారికి విద్య ఇవ్వడం ద్వారా వారు మరింత తప్పుదోవ పడుతున్నారు నీవు ఈ దేశంలో జన్మించారు. నీ దేశము కోసం మీరు తప్పక అనుభూతి చెందాలి, నీ దేశము కోసం మీరు పని చేయాలి. లేదా జాతీయత అని పిలవబడేది నేర్పించబడుతుంది. కానీ ఆయన ఎవరు అని వాస్తవానికి ఆయన బోధించబడలేదు.

అదే పరిస్థితి అర్జునుడికి ఉంది, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉంది. ఒక పోరాటం ఉంది. అది భారతదేశం యొక్క చరిత్ర, మహాభారతము. దీనిని మహాభారతము అని పిలుస్తారు. ఈ భగవద్గీత మహాభారతములో భాగం. మహాభారతము అంటే విశాల భారతదేశము లేదా గొప్ప లోకము. కాబట్టి విశాల భారతదేశం యొక్క చరిత్రలో, ఇద్దరు జ్ఞాతి సోదరుల మధ్య పోరాటం జరిగింది, పాండవులు మరియు కౌరవులు పాండవులు మరియు కౌరవులు, వారు ఒకే కురు రాజవంశం అని పిలవబడే దానికి ఒకే కుటుంబానికి చెందిన వారు, ఆ సమయంలో, 5,000 సంవత్సరాల క్రితం, కురు రాజవంశం ప్రపంచమంతా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు, మనము పిలుస్తున్న భరత-వర్ష అనేది ఒక భాగము మాత్రమే పూర్వం, ఈ లోకము భరత-వర్ష అని పిలువబడింది. దానికి ముందు, వేల సంవత్సరాల క్రితం, ఈ లోకము ఇలావృత వర్ష గా పిలువబడింది. కానీ భరతుడు అనే ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు. ఆయన నామము ద్వారా, ఈ లోకమును భరత-వర్ష అని పిలిచేవారు. కానీ క్రమంగా, కాలక్రమమున, ప్రజలు ఒకే భాగము నుండి విచ్ఛిన్నమైపోయారు. ఉదాహరణకు భారతదేశంలో మనకు అనుభవం ఉన్నట్లుగానే, 20 సంవత్సరాలు, లేదా 25 సంవత్సరాల క్రితం చెప్పాలంటే, పాకిస్తాన్ లేదు. కానీ ఏదో ఒక విధముగా, మరొక విభాగం వచ్చింది పాకిస్తాన్. కాబట్టి నిజానికి, చాలా చాలా సంవత్సరాల క్రితం ఈ లోకము యొక్క విభజన లేదు. లోకము ఒకటి, రాజు కూడా ఒకరే, సంస్కృతి కూడా ఒకటే. సంస్కృతి వేదముల సంస్కృతి, రాజు ఒకరే. కురు రాజవంశ రాజులు, ప్రపంచమంతా పరిపాలించారు అని నేను చెప్పినట్లుగా. ఇది రాచరికం. కాబట్టి ఒకే కుటుంబము యొక్క ఇద్దరు బంధువుల మధ్య పోరాటం జరిగింది, ఇది భగవద్గీత యొక్క ఇతీవృత్తము. భగవద్గీత యుద్ధభూమిలో చెప్పబడినది. యుద్దభూమిలో, మనకు చాలా తక్కువ సమయం ఉంటుంది. రెండు పక్షములు యుద్దభూమిపై కలుసుకున్నప్పుడు ఈ భగవద్గీత చెప్పబడినది. అర్జునుడు, ఎదుటి పక్షమును చూసిన తరువాత, ఆ ఎదుట పక్షములో, వారందరూ ఆయన కుటుంబమునకు చెందిన వారు, కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇది జ్ఞాతి సోదరుల మధ్య పోరాటం కనుక, అందువలన ఆయన బాధ పడినాడు బాధతో, ఆయన కృష్ణుడితో ఇలా అన్నాడు, "నా ప్రియమైన కృష్ణా, నేను పోరాడాలని కోరుకోవడము లేదు. నా జ్ఞాతి సోదరులు రాజ్యమును ఆనందింప నివ్వండి. నేను ఈ పోరాటంలో వారిని చంపలేను. " ఇది భగవద్గీత యొక్క విషయము. కానీ కృష్ణుడు అతడిని ప్రేరేపించాడు "నీవు ఒక క్షత్రియుడవు. పోరాడటము నీ బాధ్యత. ఎందుకు నీవు నీ కర్తవ్యం నుండి వైదొలగుతున్నావు?"