TE/Prabhupada 0969 - మీరు భగవంతుని యొక్క సేవలో మీ నాలుకను నిమగ్నము చేస్తే, ఆయన మీకు స్వయంగా ప్రకటితమవుతారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0968 - La philosophie occidentale, c'est l'hédonisme : Mangez, buvez, soyez heureux et jouissez|0968|FR/Prabhupada 0970 - La langue devrait être toujours utilisée pour glorifier le Seigneur Suprême|0970}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0968 - పాశ్చాత్య తత్వము అంటే హేడొనిజము, ఇది తినండి, త్రాగండి మరియు ఆనందించండి|0968|TE/Prabhupada 0970 - దేవాదిదేవుడును కీర్తించడానికి నాలుకను ఎల్లప్పుడూ ఉపయోగించాలి|0970}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|E3MPN3o9TWA|మీరు భగవంతుని యొక్క సేవలో మీ నాలుకను నిమగ్నము చేస్తే, ఆయన మీకు స్వయంగా ప్రకటితమవుతారు  <br/>- Prabhupāda 0969}}
{{youtube_right|vVue1CHt4ME|మీరు భగవంతుని యొక్క సేవలో మీ నాలుకను నిమగ్నము చేస్తే, ఆయన మీకు స్వయంగా ప్రకటితమవుతారు  <br/>- Prabhupāda 0969}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



730400 - Lecture BG 02.13 - New York


మీరు భగవంతుని యొక్క సేవలో మీ నాలుకను నిమగ్నము చేస్తే, ఆయన మీకు స్వయంగా ప్రకటితమవుతారు భారతదేశంలో, శారీరక ఆనందము అంటే మొదట, నాలుక. నాలుక యొక్క ఆనందము. అన్నిచోట్లా. ఇక్కడ కూడా. నాలుక ఆనందం. కావున మనము మన ఇంద్రియాలను నియంత్రించాలనుకుంటే... అందువలన భక్తివినోద ఠాకురా, పూర్వ ఆచార్యుల అడుగుజాడలను అనుసరిస్తూ, "నీ నాలుకను నియంత్రించుకోండి" అని ఆయన చెప్పాడు. మీ నాలుకను నియంత్రించండి. భాగవతములో కూడా చెప్పబడింది, ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ (BRS. 1.2.234). మీ, ఈ మొద్దుబారిన ఇంద్రియాలతో, మనము కృష్ణుణ్ని అర్థం చేసుకోలేము. ఇది సాధ్యం కాదు. ఇంద్రియాలు చాలా అసంపూర్ణముగా ఉన్నాయి, అందువలన ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోతున్నాను, భౌతిక లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును, ఇంద్రియాల ద్వారా. అది సాధ్యం కాదు. అతః. మీరు ఈ భౌతిక ప్రపంచం యొక్క వ్యవహారాలను సంపూర్ణముగా తెలిసుకోనప్పటికీ. వారు చంద్రుని లోకము, సమీప లోకమును పరిశోధన చేస్తున్నట్లుగానే. ఈ చంద్రుని లోకముతో పాటు, లక్షల ట్రిలియన్ల ఇతర లోకములు ఉన్నాయి. వారు ఏమీ చెప్పలేరు. ఎందుకంటే ఇంద్రియాలు అసంపూర్ణమైనవి. మీరు ఎలా అర్థం చేసుకోగలరు? నేను చూడగలను, ఒక మైలు వరకు అని చెప్పవచ్చు. కానీ లక్షల, లక్షలాది మైళ్ల ప్రశ్న వచ్చినప్పుడు, మీరు మీ ఇంద్రియాలను ఎలా ఉపయోగించి, పరిపూర్ణ జ్ఞానాన్ని ఎలా కలిగివుంటారు? కాబట్టి ఈ ఇంద్రియాలను ఉపయోగించడం ద్వారా సంపూర్ణ భౌతిక జ్ఞానమును కూడా మీరు పొందలేరు. భగవంతుని గురించి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి ఏమి మాట్లాడాలి? అది అతీతమైనది, మానస-గోచరా, మీ భావనలకు అతీతమైనది అందువల్ల శాస్త్రము చెప్తుంది: ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ (BRS. 1.2.234). మీరు మానసిక కల్పన ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, ఆ కప్ప తత్వము, డాక్టర్ కప్ప, అట్లాంటిక్ మహా సముద్రాన్ని లెక్కించడానికి, బావిలో కూర్చొని వుండి. దీనిని కప్ప తత్వము అని అంటారు. మీరు అర్థం చేసుకోలేరు. అప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు? తరువాతి పంక్తి sevonmukhe hi jihvādau svayam eva sphuraty... భగవంతుని సేవలో మీ నాలుకను మీరు ఉపయోగించినట్లయితే, అయన నీకు తనకు తానుగా ప్రకటితమవుతాడు. ఆయన ప్రకటితమవుతాడు, ప్రకటితమవుతాడు.

కాబట్టి మనము నాలుకను నియంత్రించవలసి ఉంటుంది. నాలుక పని ఎమిటి? నాలుక యొక్క పని రుచి చూడడము మరియు కీర్తన చేయడము కాబట్టి మీరు భగవంతుని సేవలో, హరే కృష్ణ మంత్రమును కీర్తన చేసినట్లైతే. హరే కృష్ణ అంటే "ఓ కృష్ణ, ఓ భగవంతుని యొక్క శక్తి, దయతో నీ సేవలో నన్ను నిమగ్నం చేయుము." హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే... ఇది హరే కృష్ణ అర్థం. దీనికి ఏ ఇతర అర్థం లేదు. ఓ నా ప్రభు మరియు ఓ కృష్ణుడి యొక్క శక్తి, రాధారాణి, ముఖ్యంగా, దయతో మీరు ఇరువురు మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి. " నరోత్తమ దాస ఠాకురా చెప్పినట్లుగా: hā hā prabhu nanda-suta vṛṣabhānu-sutā-juta: నా ప్రభు, కృష్ణ, మీరు నంద మహా రాజా యొక్క కుమారునిగా బాగా ప్రసిద్ధి చెందారు నీ శాశ్వత సహవాసి, రాధారాణి, ఆమెను వృషభాను రాజు యొక్క కుమార్తెగా కూడా పిలుస్తారు. కాబట్టి మీరు ఇరువురూ ఇక్కడ ఉన్నారు. "Hā hā prabhu nanda-suta vṛṣabhānu-sutā... karuṇā karaha ei-bāra. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. దయచేసి మీరు ఇరువురు నా మీద దయతో ఉండండి. ఇది హరే కృష్ణ అంటే: "నా మీద కరుణ చూపించండి." నరోత్తమ-దాస kaya, nā ṭheliha rāṅgā-pāya: మీరు కలిగిన మీ కమల పాదములతో, నన్ను నిర్లక్ష్యం చేయవద్దు లేదా మీ కమల పాదములతో నన్ను నెట్టి వేయ వద్దు. కృష్ణుడు తన్ని దూరంగా నెట్టి వేస్తే అది మన గొప్ప అదృష్టం అని నేను భావిస్తాను. మీరు చూడండి. తన కమల పాదాలతో కృష్ణుడు తన్ని వేస్తే: "మీరు దూరంగా వెళ్ళిపొండి," అది కూడా గొప్ప అదృష్టం. అంగీకరించడం గురించి ఏమి మాట్లాడతాము? ఉదాహరణకు కాళీయుని యొక్క తలల మీద కృష్ణుడు తంతున్నప్పుడు. కాళీయుని యొక్క భార్యలు ఇలా ప్రార్థించారు: నా ప్రియమైన ప్రభు, నాకు తెలియదు, ఈ అపరాధి, కాళీయుడు, ఆయన ఎలా అదృష్ట వంతుడు అయ్యాడు తన తల మీద మీరు కొడుతున్నారు మీ కమల పాదముల యొక్క స్పర్శ, గొప్ప, గొప్ప సాధువులు, ఋషులు లక్షలాది సంవత్సరాలు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ కాళీయుడు... నాకు తెలియదు, తను గత జీవితంలో ఆయన ఏమి చేసాడు ఆయనకు ఈ అదృష్టం కలిగింది తన తల మీద మీరు తంతున్నారు.