TE/Prabhupada 0968 - పాశ్చాత్య తత్వము అంటే హేడొనిజము, ఇది తినండి, త్రాగండి మరియు ఆనందించండి
730400 - Lecture BG 02.13 - New York
పాశ్చాత్య తత్వము అంటే హేడొనిజము, ఇది తినండి, త్రాగండి మరియు ఆనందించండి
- dehino 'smin yathā dehe
- kaumāraṁ yauvanaṁ jarā
- tathā dehāntara-prāptir
- dhīras tatra na muhyati
- (BG 2.13)
కాబట్టి ఇది భగవంతుని ద్వారా ఒక ప్రకటన, భగవాన్ ఉవాచా, మీరు ఈ శరీరము కాదు. ఆధ్యాత్మిక అవగాహన కోసం మొదటి ఆదేశం నేను ఈ శరీరం కాదు అని తెలుసుకోవడము. ఇది ప్రారంభం. యోగులు అని పిలవబడే వారు, వారు శరీర వ్యాయామములు చేస్తున్నారు చార్ట్స్ ద్వారా మనస్సు యొక్క మనస్తత్వము అధ్యయనం చేస్తున్నారు, చాలా చెత్త పద్దతుల ద్వారా. కానీ మన తత్వము (ఇది) మనము ఈ శరీరము కాదు. అప్పుడు శరీర వ్యాయామము మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించే ప్రశ్న ఎక్కడ ఉంది? నేను ఈ శరీరాన్ని కాకపోతే, అప్పుడు నేను కొన్ని జిమ్నాస్టిక్ పద్ధతుల ద్వారా నన్ను ఎలా గ్రహించుకోగలను? కాబట్టి ఇది తప్పు - కర్మిలు, జ్ఞానులు మరియు యోగులు. కర్మిలు, ఫలాపేక్ష కార్మికులు, భౌతిక వ్యక్తులు, వారికి శరీర సుఖాలు కావాలి. వారి ఆలోచన కేవలము వారి శరీరమునకు ఉత్తమ సుఖమును ఎలా ఇవ్వాలి అని మాత్రమే. ఈ శరీరం అంటే ఇంద్రియాలు అని అర్థం. మనకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉంది, నాలుక, చేతులు, జననేంద్రియాలు- మనకు అనేక ఇంద్రియాలు ఉన్నాయి.
మనము జీవితం యొక్క శారీరక భావనలో ఉన్నప్పుడు, వెంటనే ఆవశ్యకత ఇంద్రియ తృప్తి ఎలా చేసుకోవడము కానీ కృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు, "మీరు ఈ దేహము కాదు." కాబట్టి నా సొంత ఆసక్తి నా శారీరక సౌకర్యాలపై ఆధారపడదు. వారికి ఇది తెలియదు. ప్రస్తుతం, ప్రతి ఒక్కరూ, ఈ యుగంలో, వారి ఏకైక కర్తవ్యము ఇంద్రియాలను ఎలా తృప్తి పరుచుకోవాలి. నాస్తిక సూత్రం. ఉదాహరణకు ఒక గొప్ప నాస్తికుడు, చార్వాక ముని ఉన్నాడు అన్ని రకాల తత్వవేత్తలు భారతదేశంలో ఉన్నారు. పాశ్చాత్య దేశాలు, వారి దగ్గర కొంచము సమాచారమే ఉంది, కానీ భారతదేశంలో, అన్ని రకాల తత్వము పెంపొందించుకోవడము ఉంది. కాబట్టి నాస్తిక తత్వము ఉంది. చార్వాక ముని నాస్తిక తత్వవేత్తల గురువు. అందువల్ల ఆయన అన్నాడు హేడోనిజము. పాశ్చాత్య తత్వము హేడొనిజము, తినండి, త్రాగండి, సంతోషముగా ఉండండి. ఇది తత్వము. ఎంత కాలము మీరు ఈ శరీరమును కలిగి ఉంటారో, తినండి, త్రాగండి మరియు ఆనందించండి. చార్వాక ముని ఇలా కూడా అన్నాడు: ṛṇaṁ kṛtvā ghṛtaṁ pibet.