TE/Prabhupada 0479 - మీరు మీ వాస్తవస్థితిని గ్రహిస్తే అప్పుడు వాస్తవంగా మీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0479 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
No edit summary
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Seattle]]
[[Category:TE-Quotes - in USA, Seattle]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0478 - La télévision du coeur|0478|FR/Prabhupada 0480 - Dieu ne peut pas être impersonnel, car nous sommes tous des personnes|0480}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0478 - మీ హృదయంలో టెలివిజన్ పెట్టెఉంది|0478|TE/Prabhupada 0480 - దేవుడు నిరాకారము కాదు, మనము అందరము వ్యక్తులు కనుక|0480}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|51-YOG1y_Qs|మీరు మీ వాస్తవస్థితిని గ్రహిస్తే అప్పుడు వాస్తవంగా మీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి  <br />- Prabhupāda 0479}}
{{youtube_right|wpoL6ztwA4A|మీరు మీ వాస్తవస్థితిని గ్రహిస్తే అప్పుడు వాస్తవంగా మీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి  <br />- Prabhupāda 0479}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681018LE.SEA_clip2.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681018LE_SEA_clip02.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 11:58, 25 August 2019



Lecture -- Seattle, October 7, 1968


ఇక్కడ కృష్ణుడు యోగ పద్ధతి గురించి భగవద్గీతలో ఇలా చెబుతున్నాడు, mayy āsakta-manāḥ, ఆయన ఇప్పటికే ఆరవ అధ్యాయంలో యోగపద్దతి గురించి వివరించాడు. మొదటి ఆరు అధ్యాయల్లో, ఏమని వివరించబడినది అనగా, జీవుని యొక్క స్వరూప స్థితి ఏమిటి. భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. మొదటి ఆరు అధ్యాయలు జీవుల స్వరూప స్థితిని మాత్రమే వివరిస్తాయి. అది అర్థం చేసుకున్నప్పుడు ... మీరు మీ వాస్తవిక స్థితిని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు మీ కార్యక్రమాలు మొదలవుతాయి. మీ వాస్తవ స్థితి ఏమిటో మీకు తెలియకపోతే ... ఉదాహరణకు కార్యాలయంలో మీ పదవి గురించి కచ్చితత్వం లేకుంటే, మీరు అమలు చేయవలసిన పని గురించి కచ్చితత్వం లేకుంటే, అప్పుడు మీరు ఏదీ చక్కగా చెయ్యలేరు. ఇక్కడ ఒక టైపిస్టు ఉన్నాడు, ఇక్కడ గుమస్తా వున్నాడు, ఇక్కడ ఒక పనివాడు ఉన్నాడు, అలా ఆయా పనులలో ఆయా వ్యక్తులు వున్నారు. కాబట్టి వారివారి పనులను వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ జీవుని యొక్క స్వరూప స్థితి ఏమిటో గ్రహించవలెను. ఆ విషయం గురించి మొదటి ఆరు అధ్యాయాలలో వివరించబడింది. Adyena śastena upāsakasya jivasya svarūpa-prāpti-sādhanaṁ ca pradhānaṁ niṁ proktam. బలదేవ విద్యాభూషణుడు, భగవద్గీత యొక్క చాలా చక్కని ప్రామాణిక వ్యాఖ్యాత, ఆయన చెబుతున్నారు మొదటి ఆరు అధ్యాయాల్లో, జీవుని యొక్క స్వరూపస్థితి చాలా చక్కగా వివరించబడింది. మరియు ఎవరైనా తమ స్వరూప స్థితిని ఎలా గ్రహించగలరో అది కూడా వివరించబడింది. కాబట్టి యోగ పద్ధతి అంటే తన స్వరూప స్థితిని అర్ధం చేసుకోవడం అని అర్ధం. Yoga indriya-saṁyamaḥ. మనము ఇంద్రియ కార్యక్రమాలలో మునిగి ఉన్నాము. భౌతిక జీవితం అంటే ఇంద్రియకార్యక్రమాల సమాహారము. మొత్తం ప్రపంచ కార్యక్రమాలన్నీ, మీరు వీధిలో కెళ్ళి గమనించినట్లయితే, మీరు అందరూ చాలా బిజీగా వుండడం గమనిస్తారు. దుకాణాదారుడు బిజీగా ఉంటాడు, మోటారు-డ్రైవర్ బిజీగా ఉంటాడు. అందరూ చాలా బిజీగా ఉన్నారు - ఎంత బిజీగా వున్నారంటే వారి కార్యక్రమాల్లో చాలా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇప్పుడు, ఎందుకు వారు బిజీగా ఉన్నారు? అనే విషయానికి వస్తే, మీరు వారి పనులను సూక్ష్మంగా అధ్యయనం చేస్తే, వారి ఏకైక కార్యక్రమం ఇంద్రియ తృప్తి. అంతే. అందరూ ఇంద్రియలను ఎలా సoతృప్తి పరచాలి అని బిజీగా ఉన్నారు. ఇది భౌతికము. మరి యోగ అంటే ఇంద్రియాలను నియంత్రించడము అని అర్థం, నా ఆధ్యాత్మిక స్థితిని , నా స్వరూపస్థితిని అర్థం చేసుకోవడం. ఎలాగంటే కేవలం ఆడడానికి అలవాటుపడిన ఒక పిల్లవాడు, అతను తన చదువు పట్ల శ్రధ్ధ పెట్టలేడు, తన భవిష్యత్తు జీవితాన్ని అర్ధం చేసుకోవడం గురించి, లేదా తనకు తనుగా ఉన్నత స్థానాన్ని పెంచుకోవడం గురించి ఆలోచించలేడు. అదేవిధముగా, మనము జీవితం యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోకుండా పిల్లల వలె వర్తించినట్లయితే, కేవలం ఇంద్రియ కలాపాల్లో నిమగ్నం అయితే,దానిని భౌతిక జీవనం అంటారు భౌతిక జీవనం మరియు ఆధ్యాత్మిక జీవనం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమంటే, ఎవరైనా కేవలం ఇంద్రియ తృప్తి కార్యక్రమాలలో నిమగ్నమైనప్పుడుతే, అది భౌతిక జీవనం అని పిలువబడుతుంది. అటువంటి అనేక వేలమంది భౌతిక వ్యక్తులలో, ఎవరైనా "నేను ఎవరు? నేను ఇక్కడ ఎందుకు వచ్చాను?" అని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూవుంటే, " నేను ఎందుకు జీవితం యొక్క అనేక బాధాకరమైన పరిస్థితులలో ఎందుకు ఉంచబడ్డాను?దీనికి ఏదైన పరిహారం ఉందా ...?" ఇటువంటి ప్రశ్నలు, అతనికి ఉదయించినప్పుడు,ఆచరణాత్మకంగా, అతని ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. మరియు మానవజీవితం అందుకోసమే ఉద్దేశించబడింది.