TE/Prabhupada 0704 - హరే కృష్ణ కీర్తన చేయండి.ఈ పరికరమును మీ చెవిని ఉపయోగించి వినండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0704 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0703 - Si vous absorbez votre mental avec Krishna, alors c'est le samadhi|0703|FR/Prabhupada 0705 - On trouvera dans le Bhagavad-gita, la super-excellence de cette science de Dieu|0705}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0703 - మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి|0703|TE/Prabhupada 0705 - మనము భగవద్గీతలో కనుగొంటాము. భగవంతుని యొక్క గొప్ప తనము|0705}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|gEBh8DuXUco|హరే కృష్ణ కీర్తన చేయండి.ఈ పరికరమును మీ చెవిని ఉపయోగించి వినండి  <br />- Prabhupāda 0704}}
{{youtube_right|Ub5qjnuM9C4|హరే కృష్ణ కీర్తన చేయండి.ఈ పరికరమును మీ చెవిని ఉపయోగించి వినండి  <br />- Prabhupāda 0704}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:39, 1 October 2020



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


ప్రభుపాద: అవును?

విష్ణుజన: ప్రభుపాద? భౌతిక ప్రపంచంలో శక్తిని కొలిచే వివిధ రకాలైన సాధనాలు ఉన్నాయి. ఎలా ఒకరు కొలుస్తారు, ఏ విధమైన పరికరం ద్వారా, ఆధ్యాత్మిక శక్తిని కొలిచేందుకు ఆయన దాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు?

ప్రభుపాద: భౌతిక శక్తి... మీ ప్రశ్న, ఉదాహరణకు శక్తి మరియు విద్యుత్ వలె?

విష్ణుజన: కొన్ని పరికరాలతో మనము దాన్ని కొలవగలము. కాని కృష్ణుడి ఆధ్యాత్మిక శక్తిని కొలిచే సాధనమేమిటి?

ప్రభుపాద: మీ దగ్గర ఉన్న వాయిద్యం. ఈ మృదంగం మరియు కరతాళాలు. కేవలము మ్రోగించు. ఇది చాలా సాధారణ వాయిద్యం. ఆ పరికరం మీ నాలుక. కీర్తన చేయండి హరే కృష్ణ. మీరు కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు, మీరు కొనుగోలు చేయనవసరం లేదు. పరికరం మీ చెవి. కేవలం కంపనం వినండి. మీరు అన్ని పరికరాలు మీలోనే కలిగి ఉన్నారు. మీరు ఎక్కడి నుండి అయినా కొనుగోలు లేదా అద్దెకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నాలుకను కలిగి ఉన్నారు, చెవిని కలిగి ఉన్నారు. హరే కృష్ణ కీర్తన చేయండి . ఈ పరికరాన్ని వినడానికి ఉపయోగించండి. సంపుర్ణమవుతుంది. అందులోనే మొత్తం పరిపూర్ణము ఉంది. ఇది విద్యావంతుడైన శాస్త్రవేత్త, తత్వవేత్త కావాల్సిన అవసరం లేదు, అది లేదా ఇది కానవసరం లేదు. కేవలం మీరు హరే కృష్ణ కీర్తన చేయండి మరియు వినండి. అందులో అంతా ఉంది. అందరూ ఈ పరికరాలను కలిగి ఉన్నారు. మీరు ఏ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు విద్యుత్ శక్తిని ఉపయోగిస్తే దాని కొరకు మీరు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ప్రతిదీ సంపూర్ణముగా కలిగి ఉన్నారు. పూర్ణము అదః పూర్ణము ఇదమ్ (Śrī Īśopaniṣad, Invocation). దేవుడు చేత సృష్టించబడిన ప్రతిదీ సంపూర్ణము. మీరు ఈ భూమిని చూడలేరా? ఈ భూమి యొక్క మొత్తం స్థితి తీసుకోండి. ఇది సంపూర్ణము. అక్కడ సముద్రంలో, మహా సముద్రంలో తగినంత నీటి నిల్వ ఉంది. సూర్యకాంతి ప్రభావం పనిచేస్తుంది, నీటిని ఆవిరిచేస్తుంది అది మేఘంగా మారుతుంది. అప్పుడు మేఘము భూమంతటా విస్తరించి వర్షం పడుతుంది. నది ప్రవహిస్తుంది. మీరు మీ నీటిని పెద్ద ట్యాంక్ లో నిల్వ చేసుకుంటున్నారు, పర్వత శిఖరాలు ఉన్నాయి, అక్కడ నీరు నిల్వ ఉంది. సంవత్సరము మొత్తము నది ప్రవహిస్తుంది, నీరు సరఫరా అవుతుంది. ఇది ఎంత చక్కని మేధస్సు అని మీరు చూడరా? మీరు నీటిని పోయగలరా? వంద... నీవు వంద గాలన్ల నీటిని ఆవిరి చేయాలని అనుకుంటే, మీరు చాలా యంత్రాలు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఇక్కడ, మిలియన్ల కొద్దీ టన్నుల నీరు మహాసముద్రం మరియు సముద్రం నుండి వెంటనే తీసివేయబడుతుంది, మేఘంగా మారిపోతుంది, తేలికపాటి మేఘం అందువలన అది వెంటనే పడిపోదు. మీరు చూడండి? ఒక తొట్టి వలె కాదు. అది పర్వతం యొక్క తల మీద నిలువ చేయబడి ఉంటుంది, అది భూమి మీద వెదజల్లబడుతుంది కాబట్టి అక్కడ అంతా ఉంది.మీరు ధాన్యాలు, కూరగాయలు ఉత్పత్తి చేయడానికి నీరు అవసరం. కాబట్టి ప్రతిదీ ఉంది.

పూర్ణము అదః పూర్ణము ఇదమ్ (Śrī Īśopaniṣad, Invocation). ఎందుకంటే ఇది పూర్ణ మేధస్సుచే తయారవుతుంది కాబట్టి, ప్రతిదీ పూర్ణము. అదేవిధముగా మీ శరీరం ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కూడా పూర్ణముగా ఉంది. మీరు ఏ ఇతర బాహ్య శోధనను చేయనవసరము లేదు. ఈ యోగ పద్ధతి కేవలం ఆ పరిపూర్ణమును అర్థం చేసుకోవడం కోసము అంతా సంపూర్ణముగా ఉంది. మీ ఆహార పదార్థాలు సంపూర్ణముగా ఉన్నాయి, మీ కొరకు ఏర్పాట్లు సంపూర్ణముగా ఉన్నాయి, మీ మానవ శరీరం సంపూర్ణముగా ఉంది. మీరు దీనిని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించండి మీరు జీవితం యొక్క అన్ని వేదనల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు, . శబ్ద (అస్పష్టముగా ఉంది). వేదాంత-సూత్రా, కేవలం ధ్వని కంపనంతో ఒకరు ముక్తి పొందవచ్చు. కాబట్టి ఈ శబ్ద - శబ్ద అంటే అర్థం శబ్దం. Śabda (అస్పష్టముగా ఉంది). మీరు చూడండి? కాబట్టి యంత్రం ఇప్పటికే మీతో ఉంది, ప్రతి ఒక్కరు. కేవలం దీనిని ఉపయోగించుకోండి. ఈ సులభమైన పద్ధతి. హరే కృష్ణ కీర్తన చేయండి, వినండి. అంతే. అవును.