TE/Prabhupada 0705 - మనము భగవద్గీతలో కనుగొంటాము. భగవంతుని యొక్క గొప్ప తనముLecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969భక్తుడు: కృష్ణుడి యొక్క సంపూర్ణమైన విస్తరణ విష్ణువు గురించి మనమేమి అర్థం చేసుకోవాలి?

ప్రభుపాద: అవును. కృష్ణుడు తనను తాను విస్తరించవచ్చు. ఉదాహరణకు మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు. మీరు మీ అపార్ట్మెంట్లో లేరు. ఎందుకంటే మీరు కట్టివేయ బడి ఉన్నారు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, విముక్తి పొందినప్పుడు, మీరు కూడా విస్తరించవచ్చు. కానీ కృష్ణుడు, ఆయనకు భౌతిక శరీరము లేకపోవడము వలన , ఆయన మిలియన్ రూపాల్లో విస్తరించవచ్చు. ఆయన ఇక్కడ కూర్చుని, అక్కడ కూర్చుని ఉండవచ్చు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) ఆయన ప్రతి ఒక్కరి హృదయములో కూర్చుని ఉంటాడు. అందరు ఆయన విస్తరణతో అందరూ. ఆయన ఒకటి అయినప్పటికీ, ఆయన విస్తరించవచ్చు. అంటే... ఆయన గొప్పవాడు కనుక, ఉదాహరణకు సూర్యుడు గొప్ప వాడు కాబట్టి, మీరు ఐదువేల మైళ్ళ దూరంలో ఉన్న మీ స్నేహితుడికి టెలిగ్రామ్ని పంపితే ఉదయాన్నే, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన "నా తలపై" అని చెప్తాడు. సూర్యుడు మీ తలపై ఉన్నాడు అని మీరు చూస్తారు. ఎందుకు? ఎందుకంటే ఆయన గొప్ప వాడు. కాబట్టి కృష్ణుడు గొప్పవాడు కనుక, ఆయన ఒకే సమయంలో ప్రతిచోటా ఉండగలడు. అది విస్తరణ. మీరు ఉదాహరణ తీసుకోండి. సూర్యుడు అంటే ఏమిటి? అది కృష్ణుడి యొక్క సుక్ష్మమైన సృష్టి. సూర్యుడు అందరి తలపై ఏకకాలంలో ఉంటే, అయినా అయిదు వేల, పదివేల మైళ్ల దూరములో ఉన్నప్పటికీ, కృష్ణుడు ఎందుకు ఉండలేడు? మీరు మీ వాదన శక్తిని ఎందుకు ఉపయోగించరు? కృష్ణుడు కంటే సూర్యుడు గొప్పవాడా? కాదు. కృష్ణుడు సూర్యుని వంటి వాటిని లక్షల కొలది సృష్టించగలడు. సూర్యుడు అంతటి శక్తిని కలిగి ఉంటే, ఎందుకు కృష్ణుడు కలిగి ఉండడు? అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు.

కావున కృష్ణుడు, akhilātma-bhūtaḥ (BS 5.37). ఆయన విస్తరించవచ్చు, మీరు పదమూడవ అధ్యాయంలో చూస్తారు అది kṣetra-jñaṁ cāpi māṁ viddhi sarva-kṣetreṣu bhārata ( BG 13.3) Kṣetra, kṣetra-jñam. ఉదాహరణకు మీరు ఒక ఆత్మ. మీరు ఈ శరీర యజమాని. నేను ఈ శరీర యజమానిని, మీరు మీ శరీరం యొక్క యజమాని. కానీ నేను ఈ శరీరం లోపల కూర్చుని ఉన్నాను ఎందుకంటే... కానీ కృష్ణుడు అన్ని శరీరాల యొక్క యజమాని, ఎందుకంటే ఆయన ప్రతిచోటా కూర్చుని ఉన్నాడు. ఉదాహరణకు ఈ ఇల్లు నాకు లేదా ఎవరికైనా స్వంతం కావచ్చు. ఆ ఇల్లు ఆయనకి స్వంతం. కానీ అమెరికా మొత్తం ప్రభుత్వము స్వంతం. అదేవిధముగా గొప్పతనము అనే ప్రశ్న ఉన్నప్పుడు, ఆ విస్తరణ సాధ్యమే. నేను విస్తరించలేనందున, కప్ప తత్వము, అందుచేత కృష్ణుడు విస్తరించలేడు, అది అర్థంలేనిది. నా వైపు నుండి మనము ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాం. నేను విస్తరించలేనందున కృష్ణుడికి విస్తరించడము ఎలా సాధ్యము. మీరు ఏమిటి? మీ స్థానము ఏమిటి? మీతో కృష్ణుని ఎందుకు పోల్చుకుంటారు? అవును, కృష్ణుడు విస్తరించగలడు. చాలా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. మీరు విస్తరించలేరు కనుక కృష్ణుడు విస్తరించలేడు అని అనుకోవద్దు. ఇది అర్థం లేని తత్వము యొక్క లోపం. వారు మర్యాదపూర్వకంగా చెప్తారు "భగవంతుడు గొప్పవాడు" అని అంటారు. కానీ, వాస్తవానికి ఆయన ఆలోచించినప్పుడు, "ఓ, ఆయన ఎంత గొప్ప వాడు? నేను ఇది చేయలేను. ఎలా కృష్ణుడు చేయగలడు. " కానీ అధికారికముగా, "ఓ, భగవంతుడు గొప్పవాడు." భగవంతుడు ఎంత గొప్ప వాడో వారికి తెలియదు. మనము భగవద్గీతలో కనుగొంటాము. అందువల్ల భగవంతుని యొక్క గొప్ప తనము శాస్త్రంలో. Akhilātma-bhūtaḥ (BS 5.37). మీరు భగవంతుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకోవాలంటే అప్పుడు మీరు ఈ వేదముల సాహిత్యం నుండి తీసుకోవాలి. ఇతర సాహిత్యం లేదు.

భక్తుడు: ప్రభుపాద మనకు తెలుసు పరమ పూజ్యశ్రీ పూజనీయులు భక్తి సిద్దాంత సరస్వతి ఎల్లప్పుడూ చాలా నిటారుగా కూర్చోని ఉండేవారు అని మనకు తెలుసు భగవద్గీతలో చెప్పబడింది ఒకరు నిటారుగా కూర్చుని ఉండాలని . ఇది మనము జపము చేసేటప్పుడు మనము శ్రద్ధతో చేయడానికి మనకు సహాయం చేస్తుంది, మనం నిటారుగా కూర్చొని ఉండటానికి ప్రయత్నించినట్లయితే ఏవిధమైన (వంపు) లేకుండా (అస్పష్టముగా ఉంది), జపము,కీర్తన చేసే సమయంలో...?

ప్రభుపాద: లేదు, లేదు, ఏ కూర్చుని ఉండే భంగిమ అవసరం లేదు. మీరు కూర్చుని ఉంటే అది మీకు సహాయ పడుతుంది. ఇది మీకు సహాయ పడుతుంది. మీరు ఈ విధముగా నిటారుగా కూర్చుని ఉంటే, అది చాలా బాగుంటుంది. ఇది మీకు సహాయము చేస్తుంది , అవును, మీరు కీర్తన, జపము చేయడము శ్రవణము చేయడానికి కూడా, దృష్టి పెట్టవచ్చు. అందువలన ఈ విషయాలు అవసరం. కానీ మనం దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టము. కానీ ఆయన బ్రహ్మచారి కనుక, ఆయన ఆ విధముగా కూర్చో గలరు ఇది బ్రహ్మచారి యొక్క చిహ్నము. ఆయన ఒక మోసపు బ్రహ్మచారి కాదు, కానీ ఆయన వాస్తవమైన బ్రహ్మచారి, అవును. (ముగింపు)