TE/Prabhupada 0683 - విష్ణువు రూపము మీద సమాధిలో ఉన్న యోగికి , ఒక కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తికి, తేడా లేదు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0683 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 8: | Line 8: | ||
[[Category:Telugu Pages - Yoga System]] | [[Category:Telugu Pages - Yoga System]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0682 - దేవుడు నా ఆజ్ఞ పాటించే వాడు కాదు|0682|TE/Prabhupada 0684 - యోగ పద్ధతికి పరీక్ష మీరు విష్ణువు రూపం మీద మీ మనస్సును కేంద్రీకరించగలిగితే|0684}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 19: | Line 19: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|RlFGtKCHhrA|విష్ణువు రూపము మీద సమాధిలో ఉన్న యోగికి , ఒక కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తికి, తేడా లేదు <br />- Prabhupāda 0683}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 48: | Line 48: | ||
:sa guṇān samatītyaitān | :sa guṇān samatītyaitān | ||
:brahma-bhūyāya kalpate | :brahma-bhūyāya kalpate | ||
:([[Vanisource:BG 14.26|BG 14.26]]) | :([[Vanisource:BG 14.26 (1972)|BG 14.26]]) | ||
ఎవరైతే నాకు అనన్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారో, ఆయన అప్పటికే ప్రకృతి యొక్క భౌతిక గుణాలను అధిగమిస్తాడు. Brahma-bhūyāya kalpate ఆయన బ్రహ్మణ్ స్థాయిలో ఉన్నాడు - అంటే ముక్తి అని అర్థం. బ్రహ్మణ్ స్థాయిలో ఉండటాన్ని విముక్తి పొందుట అని అర్థము. మూడు స్థాయిలు ఉన్నాయి. శరీర స్థాయి లేదా ఇంద్రియ స్థాయి, తరువాత మానసిక స్థాయి, అ తరువాత ఆధ్యాత్మిక స్థాయి. ఆధ్యాత్మిక స్థాయిని బ్రహ్మణ్ స్థాయి అని కూడా పిలుస్తారు. కాబట్టి బ్రహ్మణ్ స్థాయిలో నిలబడటము అంటే విముక్తి పొందటము. బద్ధ జీవాత్మ, మనం ప్రస్తుత క్షణం ఇంద్రియ స్థాయి లేదా శరీర స్థాయిలో ఉన్నాము. కొంచెం పైన ఉన్నవారు, వారు మానసిక స్థితి మీద, కల్పనలు చేస్తూ ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. ఈ స్థాయి పైన బ్రహ్మణ్ స్థాయి ఉంది. అందువల్ల మీరు భగవద్గీతం పన్నెండవ అధ్యాయంలో చూస్తారు లేదా పధ్నాల్గవ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను, కృష్ణ చైతన్యములో ఉన్నవాడు, ఆయన ఇప్పటికే బ్రహ్మణ్ స్థాయిలో ఉన్నారు. అంటే విముక్తి పొందటము. కొనసాగించు. | ఎవరైతే నాకు అనన్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారో, ఆయన అప్పటికే ప్రకృతి యొక్క భౌతిక గుణాలను అధిగమిస్తాడు. Brahma-bhūyāya kalpate ఆయన బ్రహ్మణ్ స్థాయిలో ఉన్నాడు - అంటే ముక్తి అని అర్థం. బ్రహ్మణ్ స్థాయిలో ఉండటాన్ని విముక్తి పొందుట అని అర్థము. మూడు స్థాయిలు ఉన్నాయి. శరీర స్థాయి లేదా ఇంద్రియ స్థాయి, తరువాత మానసిక స్థాయి, అ తరువాత ఆధ్యాత్మిక స్థాయి. ఆధ్యాత్మిక స్థాయిని బ్రహ్మణ్ స్థాయి అని కూడా పిలుస్తారు. కాబట్టి బ్రహ్మణ్ స్థాయిలో నిలబడటము అంటే విముక్తి పొందటము. బద్ధ జీవాత్మ, మనం ప్రస్తుత క్షణం ఇంద్రియ స్థాయి లేదా శరీర స్థాయిలో ఉన్నాము. కొంచెం పైన ఉన్నవారు, వారు మానసిక స్థితి మీద, కల్పనలు చేస్తూ ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. ఈ స్థాయి పైన బ్రహ్మణ్ స్థాయి ఉంది. అందువల్ల మీరు భగవద్గీతం పన్నెండవ అధ్యాయంలో చూస్తారు లేదా పధ్నాల్గవ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను, కృష్ణ చైతన్యములో ఉన్నవాడు, ఆయన ఇప్పటికే బ్రహ్మణ్ స్థాయిలో ఉన్నారు. అంటే విముక్తి పొందటము. కొనసాగించు. |
Latest revision as of 20:09, 8 October 2018
Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969
విష్ణుజన: "అందరి హృదయాలలో పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు. అంతేకాకుండా అసంఖ్యాకమైన జీవుల హృదయాలలో ఉన్న అసంఖ్యాకమైన పరమాత్మల మధ్య ఎటువంటి తేడా లేదు తేడా లేదు... "
ప్రభుపాద: ఉదాహరణకు, ఆకాశంలో ఒక సూర్యుడు ఉన్నాడు. మీరు భూమి మీద మిలియన్ల కొద్దీ నీటి కుండలను ఉంచితే, మీరు సూర్యుని ప్రతిబింబమును ప్రతి నీటి కుండలో చూస్తారు. లేదా ఇంకొక ఉదాహరణ, మధ్యాహ్న సమయంలో మీరు మీ స్నేహితుని నుండి విచారణ చేస్తే, పదివేల మైళ్ల దూరంలో, "సూర్యుడు ఎక్కడ ఉన్నాడు?" ఆయన "నా తలపై" అని చెప్తాడు. కాబట్టి మిలియన్ల మంది, ట్రిలియన్ల మంది ప్రజలు ఆయన తలపై సూర్యుని చూస్తారు. కానీ సూర్యుడు ఒకడే. మరొక ఉదాహరణ, నీటి కుండ. సూర్యుడు ఒకడే, కానీ మిలియన్ల నీటి కుండలు ఉంటే, మీరు ప్రతి కుండలో సూర్యుని ప్రతిబింబమును చూస్తారు. అదేవిధముగా అసంఖ్యాక జీవులు ఉన్నాయి. లెక్కించలేనన్ని. Jīvasya asaṅkhya. వేదముల భాషలో, జీవులు లెక్కించలేనన్ని ఉన్నాయని చెప్పబడింది. లెక్కించలేనన్ని. అదేవిధముగా విష్ణువు... సూర్యుని వలె భౌతిక విషయము ప్రతి నీటి కుండలో ప్రతిబింబిస్తూ ఉంటే, కాబట్టి ఎందుకు భగవంతుడు విష్ణువు దేవాదిదేవుడు, ప్రతి ఒక్కరి హృదయములో జీవించలేడు? ఇది అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఆయన నివసిస్తున్నాడు. అది చెప్పబడింది. యోగి ఆ విష్ణు రూపం మీద తన మనస్సును కేంద్రీకరించాలి. కాబట్టి ఈ విష్ణువు రూపం కృష్ణుడి యొక్క సంపూర్ణమైన భాగం. కాబట్టి కృష్ణ చైతన్యములో నిమగ్నమైన వ్యక్తి, ఆయన ఇప్పటికే పరిపూర్ణ యోగి. అది వివరించబడుతుంది. ఆయన పరిపూర్ణ యోగి. మనము అది ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకములో వివరిస్తాము. కొనసాగించు.
విష్ణుజన: "ఎటువంటి వ్యత్యాసము లేదు కృష్ణ చైతన్య వ్యక్తి కృష్ణుడి మీద ప్రేమతో ఎల్లప్పుడూ సేవలో నిమగ్నమైన వ్యక్తికి మరియు, పరమాత్మ మీద ధ్యానములో నిమగ్నమైన సంపుర్ణమైన యోగికి."
ప్రభుపాద: ఏ తేడా లేదు. సమాధిలో ఉన్న యోగి, విష్ణువు రూపము మీద, మరియు ఒక కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తికి, తేడా లేదు. కొనసాగించు.
విష్ణుజన: "కృష్ణ చైతన్యములో ఉన్న యోగి, ఆయన వివిధ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ భౌతిక జీవితములో ఉన్నా, ఎప్పుడూ కృష్ణుడితో ఉంటాడు. కృష్ణ చైతన్యంలో ఎల్లప్పుడూ సేవ చేస్తున్న భక్తుడు సహజముగా విముక్తి పొందుతాడు. "
ప్రభుపాద:భగవద్గీతలో పన్నెండవ అధ్యాయంలో మనము చూస్తాము...
- māṁ ca yo 'vyabhicāreṇa
- bhakti-yogena sevate
- sa guṇān samatītyaitān
- brahma-bhūyāya kalpate
- (BG 14.26)
ఎవరైతే నాకు అనన్యమైన భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారో, ఆయన అప్పటికే ప్రకృతి యొక్క భౌతిక గుణాలను అధిగమిస్తాడు. Brahma-bhūyāya kalpate ఆయన బ్రహ్మణ్ స్థాయిలో ఉన్నాడు - అంటే ముక్తి అని అర్థం. బ్రహ్మణ్ స్థాయిలో ఉండటాన్ని విముక్తి పొందుట అని అర్థము. మూడు స్థాయిలు ఉన్నాయి. శరీర స్థాయి లేదా ఇంద్రియ స్థాయి, తరువాత మానసిక స్థాయి, అ తరువాత ఆధ్యాత్మిక స్థాయి. ఆధ్యాత్మిక స్థాయిని బ్రహ్మణ్ స్థాయి అని కూడా పిలుస్తారు. కాబట్టి బ్రహ్మణ్ స్థాయిలో నిలబడటము అంటే విముక్తి పొందటము. బద్ధ జీవాత్మ, మనం ప్రస్తుత క్షణం ఇంద్రియ స్థాయి లేదా శరీర స్థాయిలో ఉన్నాము. కొంచెం పైన ఉన్నవారు, వారు మానసిక స్థితి మీద, కల్పనలు చేస్తూ ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. ఈ స్థాయి పైన బ్రహ్మణ్ స్థాయి ఉంది. అందువల్ల మీరు భగవద్గీతం పన్నెండవ అధ్యాయంలో చూస్తారు లేదా పధ్నాల్గవ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను, కృష్ణ చైతన్యములో ఉన్నవాడు, ఆయన ఇప్పటికే బ్రహ్మణ్ స్థాయిలో ఉన్నారు. అంటే విముక్తి పొందటము. కొనసాగించు.
విష్ణుజనః: "నారద పంచరాత్రంలో ఈ విధముగా ధృవీకరించబడింది: కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక రూపంపై ఒకరు దృష్టిని కేంద్రీకరించడం ద్వారా, ఎవరు అన్ని చోట్లా ఉంటాడో సమయం మరియు ప్రదేశమునకు అతీతముగా, ఒకరు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఆయనతో దివ్యమైన సంబంధము వలన సంతోషకరమైన స్థాయిని పొందుతాడు.' యోగా అభ్యాస సమాధిలో కృష్ణ చైతన్యము అత్యధిక దశ. కేవలము ఈ అవగాహన మాత్రమే, కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉన్నాడు, యోగిని పవిత్రము చేస్తుంది. వేదాలు భగవంతుని యొక్క ఈ అనూహ్యమైన శక్తిని క్రింది విధముగా నిర్ధారిస్తుంది : విష్ణువు ఒకరే కానీ ఆయన ఖచ్చితముగా అన్ని చోట్లా వ్యాప్తి చెందుతున్నాడు ఆయన అనూహ్యమైన శక్తి ద్వారా, ఆయనకు ఒకే రూపము ఉన్నప్పటికీ, ఆయన ప్రతిచోటా ఉన్నారు. సూర్యుని వలె, ఆయన కనిపిస్తాడు... సూర్యుని వలె, ఆయన ఒకేసారి అనేక ప్రదేశాల్లో కనిపిస్తాడు. '"
ప్రభుపాద: అవును, ఆ ఉదాహరణను నేను ఇప్పటికే ఇచ్చాను. సూర్యుడు అనేక ప్రదేశాలలో ఏకకాలంలో ఉండగలడు, అదే విధముగా, విష్ణువు రూపము లేదా కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయములో ఉంటారు. ఆయన నిజానికి ఉన్నారు: īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna ( BG 18.61) ఆయన కూర్చొని ఉన్నారు. స్థానికీకరణ కూడా పేర్కొనబడినది. Hṛd-deśe. Hṛd-deśe అంటే హృదయములో ఉంటాడు. యోగా యొక్క ఏకాగ్రత అంటే విష్ణువు హృదయములో ఎక్కడ కూర్చొని ఉన్నారో అని తెలుసుకోవడం. అక్కడ ఉన్నారు. కొనసాగించు