TE/Prabhupada 0951 - మామిడి చెట్టు పైన చాలా బాగా పండి ఉన్న పండు ఉంది: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0950 - Notre voisin peut mourir de faim, mais nous n'en prendre soin|0950|FR/Prabhupada 0952 - Le symptôme de la conscience de Dieu, c'est qu'il est opposé à toutes les activités matérielles|0952}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0950 - మన పొరుగు వారు ఆకలితో అలమటించవచ్చు, కానీ మనము దాని గురించి పట్టించుకోము|0950|TE/Prabhupada 0952 - భగవంతుని చైతన్యము యొక్క లక్షణం ఆయన అన్ని భౌతిక కార్యక్రమాలకు విముఖత కలగి ఉంటాడు|0952}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|tESaN_UN-VQ|మామిడి చెట్టు పైన చాలా బాగా పండి ఉన్న పండు ఉంది  <br/>- Prabhupāda 0951}}
{{youtube_right|4KIqcDiTRBc|మామిడి చెట్టు పైన చాలా బాగా పండి ఉన్న పండు ఉంది  <br/>- Prabhupāda 0951}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



720902 - Lecture Festival Sri Vyasa-puja - New Vrindaban, USA


మామిడి చెట్టు పైన చాలా బాగా పండి ఉన్న పండు ఉంది ప్రభుపాద: కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం చాలా బాగుంది, అది ఒక వ్యక్తిని అన్నిటిలోనూ పరిపూర్ణంగా చేస్తుంది. జ్ఞానములో పరిపూర్ణము, బలములో పరిపూర్ణము, వయస్సులో పరిపూర్ణము, ప్రతిదీ. మనకు చాలా విషయాలు కావాలి. కాబట్టి జీవితం యొక్క ఈ పరిపూర్ణము, జీవితాన్ని సంపూర్ణంగా ఎలా చేయాలనే పద్ధతి, కృష్ణుడి నుండి మన వరకు వస్తుంది. కృష్ణుడు, ఆయన ప్రతి దాని యొక్క మూలం. కాబట్టి పరిపూర్ణ జ్ఞానము కూడా ఆయన నుండి వస్తోంది, క్రమానుగతంగా కాలానుగుణంగా మిలియన్ల మిలియన్ల సంవత్సరాల తర్వాత- కృష్ణుడు వస్తాడు. ఆయన బ్రహ్మ యొక్క రోజులో ఒకసారి వస్తాడు. కాబట్టి బ్రహ్మ యొక్క రోజులు, ఒక రోజు అయినా కూడా, ఒక రోజు వ్యవధి, లెక్కించేందుకు చాలా కష్టము. Sahasra-yuga-paryantam arhad yad brāhmaṇo viduḥ ( BG 8.17) బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే 433 మిలియన్ల సంవత్సరాలు. బ్రహ్మ యొక్క ప్రతి రోజులో, ఒక రోజులో ఒక్క సారి, కృష్ణుడు వస్తాడు,. 433 మిలియన్ల సంవత్సరాల తరువాత ఆయన వస్తాడు. ఎందుకు? జీవితము యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని, మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవడానికి, మానవుడు ఎలా జీవించాలి? అనేది ఇవ్వడము కోసము కాబట్టి ఈ భగవద్గీత అక్కడ ఉంది, ఈ మిలీనియంలో ఈనాడు కృష్ణుడిచే మాట్లాడబడింది. ఇప్పుడు బ్రహ్మ యొక్క ఒక రోజు మనము ఇరవై ఎనిమిదవ సహస్రాబ్ది గుండా వెళుతున్నాము. సంఖ్య, ఇరవై ఎనిమిదవ... బ్రహ్మ యొక్క రోజులో డెబ్భై ఒక్క మనువులు, ఒక మనువు నివసిస్తాడు... అది కూడా లక్షల సంవత్సరాలు, డెబ్బై-రెండు మిలియన్ లు.

కాబట్టి పరిపూర్ణ జ్ఞానాన్ని గణించడం గురించి ఇప్పుడు మనకు ఆసక్తి లేదు. ఈ సంపూర్ణ జ్ఞానం భగవంతుని లేదా కృష్ణుడు నుండి వస్తుంది, ఇది గురు శిష్య పరంపర పద్ధతి ద్వారా ప్రచారము చేయబడుతుంది, గురు శిష్య పరంపర ద్వారా. ఉదాహరణకు, ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు పైన చాలా పండిన పండు ఉంది, ఆ పండును రుచి చూడవలసి ఉంటుంది. నేను పండును పై నుండి విసిరితే, అది పోతుంది. అందువల్ల అది ఒకరి తరువాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వబడుతుంది... అప్పుడు అది క్రిందకు వస్తుంది. కాబట్టి అన్ని వేదముల విజ్ఞాన పద్ధతి, ప్రామాణికం నుండి తీసుకోవడము. అది గురు శిష్య పరంపర ద్వారా వస్తుంది. నేను ఇప్పటికే వివరించినట్లుగా, కృష్ణుడు జ్ఞానమును ఇస్తాడు, సంపూర్ణ జ్ఞానాన్ని, బ్రహ్మకు, బ్రహ్మ నారదునికి జ్ఞానాన్ని ఇచ్చాడు. నారదుడు జ్ఞానాన్ని వ్యాసునికి ఇచ్చాడు. వ్యాసుడు మధ్వాచార్యునికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మధ్వాచార్యుడు తన గురు శిష్య పరంపర ద్వారా జ్ఞానం మాధవేంద్ర పురికి ఇచ్చాడు. మాధేవంద్ర పురి ఆ జ్ఞానాన్ని ఈశ్వర పురికి ఇచ్చాడు ఈశ్వరపురి ఆయన చైతన్య మహా ప్రభువుకు, భగవంతుడు చైతన్య మహాప్రభువుకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన తన తక్షణ శిష్యులకు ఆ జ్ఞానాన్ని అందించాడు, ఆరుగురు గోస్వాములకు. ఆరుగురు గోస్వాములు శ్రీనివాస ఆచార్య, జీవ గోస్వామికి జ్ఞానమును ఇచ్చారు తరువాత కవి రాజు గోస్వామి, తరువాత విశ్వనాథ చక్రవర్తికి, తరువాత జగన్నాథ దాస బాబాజీ, తరువాత భక్తి వినోద ఠాకురాకు తరువాత గౌర కిషోర దాస బాబాజీ మహారాజుకు తరువాత నా ఆధ్యాత్మిక గురువు, భక్తిసిద్ధాంత సరస్వతికి. ఇప్పుడు మనము అదే జ్ఞానాన్ని ప్రచారము చేస్తున్నాము.

భక్తులు: జయ ప్రభుపాద! హరి బోల్!

ప్రభుపాద: మనము తయారు చేయము, ఎందుకంటే మనము ఎలా తయారు చేయగలము? పరిపూర్ణ జ్ఞానం అంటే నేను పరిపూర్ణంగా ఉండాలి. కానీ నేను సంపూర్ణంగా లేను. మనలో ప్రతి ఒక్కరు, నేను మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే... మనము పరిపూర్ణముగా లేము ఎందుకంటే మన బద్ధ జీవితంలో మనకు నాలుగు లోపాలు ఉన్నాయి కాబట్టి మనము పరిపూర్ణము కాదు. మొదటి లోపం మనము పొరపాటు చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరూ అయినా, జీవితంలో ఎటువంటి తప్పు చేయలేదని ఎవ్వరూ చెప్పలేరు. లేదు, అది సహజమైనది. "తప్పు చేయడము మనుషుల లక్షణము."