TE/Prabhupada 0947 - మనము అపరిమితమైన స్వాతంత్య్రం కలిగి ఉన్నాము మనము ఈ శరీరముచే నియంత్రించ బడుతున్నాము: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0946 - Nous transmigrons pour cette soi-disant bonheur illusoire d'un corps à un autre|0946|FR/Prabhupada 0948 - Cet Âge s'appelé Kali, il n'est pas une très bon moment. Il est pleine de désaccord et les bagarres|0948}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0946 - మనము ఈ శరీరము నుంచి మరొక దానికి వెళ్ళుతున్నాము మాయా ఆనందం అని పిలవబడే దాని కోసం|0946|TE/Prabhupada 0948 - ఈ యుగము కలియుగముఇది చాలా మంచి సమయం కాదు అసమ్మతి మరియు పోరాటం, కలహాలు|0948}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|BfCNj9BLIKE|మనము అపరిమితమైన స్వాతంత్య్రం కలిగి ఉన్నాము మనము ఈ శరీరముచే నియంత్రించ బడుతున్నాము  <br/>- Prabhupāda 0947}}
{{youtube_right|8-VAAIX1-rY|మనము అపరిమితమైన స్వాతంత్య్రం కలిగి ఉన్నాము మనము ఈ శరీరముచే నియంత్రించ బడుతున్నాము  <br/>- Prabhupāda 0947}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



720831 - Lecture - New Vrindaban, USA


మనము అపరిమితమైన స్వాతంత్య్రం కలిగి ఉన్నాము, కానీ మనము ఇప్పుడు ఈ శరీరముచే నియంత్రించ బడుతున్నాము ఉదాహరణకు ఆధునిక శాస్త్రవేత్తల వలె వారు ఇతర లోకములు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారు నియంత్రించ బడ్డారు, వారు వెళ్లలేరు. మనం చూడగలం. మన ముందు లక్షల ట్రిలియన్ల లోకములు ఉన్నాయి - సూర్య లోకము, చంద్ర లోకము, వీనస్, మార్స్. కొన్ని సార్లు మనము కోరుకుంటాము, "నేను అక్కడకి ఎలా వెళ్ళాలి." కానీ నేను నియంత్రించబడి ఉన్నాను కనుక, నేను స్వతంత్రంగా లేను, నేను వెళ్ళలేను. కానీ వాస్తవానికి, మీరు ఆత్మ కనుక, వాస్తవానికి మీరు స్వేచ్చగా తిరగవచ్చు. ఉదాహరణకు నారద ముని లాగానే. నారద ముని ఎక్కడికైనా వెళ్ళగలడు; ఆయనకు నచ్చిన ఏ లోకమునకు అయినా ఆయన వెళ్లగలడు. అయినప్పటికీ, ఈ విశ్వంలో ఒక లోకము సిద్ధ లోకము అని పిలువబడేది ఉంది. ఆ సిద్ధ లోకము, సిద్ధ లోక నివాసులు, వారు ఏ విమానం లేకుండా ఒక లోకము నుండి మరొక లోకమునకు గాలిలో ఎగురుతూ వెళ్ళగలరు. యోగులు కూడా, యోగులు, హఠ-యోగులు, అభ్యాసము చేసిన వారు, వారు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. యోగులు, వారు ఒకే ప్రదేశములో కూర్చుని వెంటనే మరొక ప్రదేశమునకు వెళ్ళగలరు. వారు ఇక్కడ సమీపంలోని ఏదైనా నదిలో మునిగి, వారు భారతదేశములో వేరే ఏదైనా నదిలో తేలగలరు. వారు ఇక్కడ మునిగి వారు వేరే చోట తేలగలరు. ఇవి యోగా శక్తులు.

కాబట్టి మనము అపారమైన స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇప్పుడు మనము ఈ శరీరము వలన నియంత్రించ బడుతున్నాము అందువలన మానవ రూపంలో ఇది ఒక అవకాశం మన వాస్తవ స్వాతంత్ర్యం తిరిగి పొందడానికి. దీనిని కృష్ణ చైతన్యము అని పిలుస్తారు. స్వేచ్ఛ. మనము మన ఆధ్యాత్మిక శరీరాన్ని పొందినప్పుడు, ఈ భౌతిక శరీరముచే కప్ప బడకుండా... ఈ భౌతిక శరీరం లోపల మనము ఆధ్యాత్మిక శరీరమును కలిగి ఉన్నాము. చాలా చిన్నది. నా వాస్తవమైన గుర్తింపు. ఇప్పుడు నేను రెండు రకాల భౌతిక శరీరములచే కప్ప బడి ఉన్నాను ఒక దానిని సూక్ష్మ శరీరము అని పిలుస్తారు మరొక దానిని స్థూల శరీరము అని పిలుస్తారు. సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి అహం, అహంకారము చే తయారు చేయబడినది, స్థూల శరీరము భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అన్నిటిని కలిపినది, ఈ శరీరం. రెండు రకాల శరీరం మనము కలిగి ఉన్నాము. మనము మారుస్తున్నాము. సాధారణంగా మనము స్థూల శరీరమును చూడగలము; మనము సూక్ష్మ శరీరాన్ని చూడలేము. ఉదాహరణకు అందరికి తెలిసినట్లుగానే... మీరు మనస్సును కలిగి ఉన్నారని నాకు తెలుసు. మీరు తెలివితేటలు కలిగి ఉన్నారు అని నాకు తెలుసు. నేను మనసును కలిగి ఉన్నాను అని మీకు తెలుసు, నాకు తెలివి ఉంది. కానీ నేను మీ మనసును చూడలేను, మీ బుద్ధిని చూడలేను. నేను మీ పట్టుదలను చూడలేను. నేను చూడలేను మీ భావనలను , ఆలోచనలను, అనుభూతులను మరియు సంకల్పమును. అదేవిధముగా, మీరు చూడలేరు. మీరు నా స్థూల శరీరమును ఈ భూమి, నీరు, గాలి, అగ్ని చేత తయారు చేయబడినదిగా చూస్తారు, నేను మీ స్థూల శరీరం చూడగలను. అందువలన, ఈ స్థూల శరీరం మార్చినప్పుడు, మీరు తీసుకు వెళ్ళబడతారు మీరు సుక్ష్మ శరీరముతో వెళ్ళిపోతారు. దానిని మరణము అని పిలుస్తారు మనము చెప్తాము, "ఓ, నా తండ్రి వెళ్ళిపొయినాడు." మీ తండ్రి వెళ్ళిపొయినాడు అని మీరు ఎలా చూస్తారు? శరీరం ఇక్కడే ఉంది. కానీ వాస్తవానికి ఆయన తండ్రి సూక్ష్మ శరీరముతో వెళ్ళిపోయాడు