TE/Prabhupada 0960 - భగవంతుడి ఉనికిని తిరస్కరిస్తున్న వారు ఎవరైనా, అతను ఒక పిచ్చివాడు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0959 - Même Dieu fait cette distinction. Il y a de mauvais éléments|0959|FR/Prabhupada 0961 - Notre situation est d'être soumis et Dieu est celui qui domine|0961}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0959 - భగవంతుడు కూడా ఈ వివక్షను కలిగి ఉన్నాడు. దుష్టులు ఉన్నారు|0959|TE/Prabhupada 0961 - మన పరిస్థితి మనము నియంత్రించబడువారము. భగవంతుడు నియంత్రించువాడు|0961}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Ts9TIqRhgSk|భగవంతుడి ఉనికిని తిరస్కరిస్తున్న వారు ఎవరైనా, అతను ఒక పిచ్చివాడు  <br/>- Prabhupāda 0960}}
{{youtube_right|ep53yHEpJJU|భగవంతుడి ఉనికిని తిరస్కరిస్తున్న వారు ఎవరైనా, అతను ఒక పిచ్చివాడు  <br/>- Prabhupāda 0960}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



750624 - Conversation - Los Angeles


భగవంతుడి ఉనికిని తిరస్కరిస్తున్న వారు ఎవరైనా, అతను ఒక పిచ్చివాడు

ప్రభుపాద: వాస్తవముగా ఆనందించేవాడు మరియు బాధితుడు ఆత్మ, ఈ శరీరం కాదు. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు, శరీరము ఇంక ఆనందించదు లేదా బాధ పడదు; అది ఒక పదార్ధపు ముద్ద. ఆత్మ శరీరములో ఉన్నంత కాలము ఆనందం మరియు బాధ యొక్క భావం ఉంటుంది. అందువలన ఆత్మ ముఖ్యం. మీరు ఆత్మను అధ్యయనం చేస్తే, అప్పుడు మీరు భగవంతుడు ఏమిటి అని అర్థం చేసుకోవచ్చు.

పీటర్: ఆత్మ ఉన్నది అని మీకు ఎలా తెలుసు?

ప్రభుపాద: ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు. మీరు విచారణ చేస్తున్నారు కనుక , నాకు ఆత్మ ఉన్నది అని తెలుసు. మీరు ఆత్మ కనుక , మీరు విచారణ చేస్తున్నారు. ఆత్మ మీ శరీరం నుండి బయటకు వచ్చిన వెంటనే, మీరు అపై విచారణ చేయలేరు. విచారణ ముగిసింది.

డాక్టర్ వోల్ఫ్: ఆత్మ మరియు ప్రాణము ఒకటే అని చెప్పవచ్చా? ఆత్మ మరియు ప్రాణము ఒకటే అని చెప్పవచ్చా?

ప్రభుపాద: అవును. ఒకటే ... ప్రాణము ఆత్మ యొక్క లక్షణం. ఎందుకంటే ఆత్మ ఉంది కనుక, కాబట్టి ప్రాణము ఉంది. ఆత్మ లేని వెంటనే, ఆపై ప్రాణము ఉండదు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కాంతి ఉంది, సూర్యరశ్మి. సూర్యుడు అస్తమించినప్పుడు, ఇంక కాంతి ఉండదు; అది చీకటి.

డాక్టర్ ఓర్ర్: అందువల్ల శరీరాన్ని నిరోధించాలా? శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచాలా, నిరోధించాలా, నిర్లక్ష్యం చేయాలా? మీరు దీనిని సూచిస్తున్నారా?

ప్రభుపాద: విస్మరించబడిందా?

బాహుళాస్వా: శరీరాన్ని ఎలా చూసుకోవాలి?

డాక్టర్ ఓర్ర్: ఎలా మీరు శరీరమును చూసుకోవాలి?

ప్రభుపాద: చెడ్డ బేరం యొక్క ఉత్తమ ఉపయోగం. (నవ్వు) ఇది చెడ్డ బేరం. కానీ మనము దానిని ఉపయోగించుకోవాలి.

డాక్టర్ ఓర్ర్: అంతా భగవంతుడిలో ఒక భాగం అని మీరు చెప్పినప్పుడు , మీరు శరీరమును మినహాయిస్తారు - శరీరము దైవసంబంధమైనది కాదు.

ప్రభుపాద: అవును. భక్తుడు: లేదు, ఆయన చెప్పుతున్నారు, మనము ప్రతిదీ దేవుడిలో భాగం అని చెప్పినప్పుడు, శరీరం మినహాయింపబడినది. ఆయన చెప్పుతున్నాడు అప్పుడు శరీరం మినహాయింపబడినది అని. శరీరం భగవంతుడిలో భాగం కాదా?

ప్రభుపాద: లేదు, ఎందుకు? శరీరం కూడా భాగం. అవును, నేను వివరించాను.

డాక్టర్ జుడా: మాయా - శక్తి.

ప్రభుపాద: అవును, అది మరొక శక్తి.

డాక్టర్ ఓర్: , నేను అర్థము చేసుకున్నాను. డాక్టర్ జుదాహ: కృష్ణుడి యొక్క న్యూన శక్తి.

డాక్టర్ ఓర్ర్: న్యూన శక్తి.

ప్రభుపాద: అంతా భగవంతుడి శక్తి, అందుచేత శరీరము కూడా భగవంతుడి శక్తి. కాబట్టి శరీరం యొక్క ఉత్తమ ఉపయోగం, భగవంతుడి శక్తిని భగవంతుడి కోసం ఉపయోగించాలి. అప్పుడు అది... శరీరం ఆధ్యాత్మికం అవుతుంది. శరీరం కూడా భగవంతుడి శక్తి మరియు అది భగవంతుడి సేవలో వినియోగించినప్పుడు అప్పుడు శరీరం మరింత చెడు బేరం కాదు, అది మంచి బేరం. (విరామం)

ప్రభుపాద: "ఈ అపార్ట్మెంట్ నాది, నేను యజమాని" అని అద్దెకు ఉండే వారు భావిస్తే, అప్పుడు ఆయన తప్పు చేస్తున్నాడు. అది భూస్వామికి చెందుతుంది అని ఆయనకు పరిపూర్ణంగా తెలిస్తే, నేను ఉపయోగించుకోవటము కోసం ఇచ్చారు, అది జ్ఞానం.

డాక్టర్ వోల్ఫ్: శ్రీల ప్రభుపాద, కౌలుదారుడిని సులభంగా ఖాళీ చేయిస్తారు. ప్రభుపాద: అవును. ఖాళీ చేయిస్తారు. ఆ సమయంలో ఆయన యజమానిని తెలుసుకుంటాడు, (నవ్వు) అతన్ని తన్ని బయట పడివేసినప్పుడు. ఇది భగవద్గీతలో కూడా పేర్కొనబడింది: mṛtyuḥ sarva-haraś cāham ( BG 10.34) భగవంతుడిని నమ్మని వారు, వారికి భగవంతుడు ఒక రోజు మరణముగా వస్తాడు, ఇప్పుడు నన్ను నమ్మండి. బయటకి పో! పూర్తి అయ్యింది. మీ గర్వం అంతా పోతుంది. మీ అహంకారం, మీ ఆస్తి, మీ కుటుంబం, మీ బ్యాంకు బ్యాలెన్స్, మీ ఆకాశహర్మ్యాల ఇల్లు- అన్నీ తీసివేసుకోబడతాయి: పూర్తయ్యింది. బయటకి పో. ఇది భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు అంటే అర్థము అయిందా? నమ్మండి లేదా నమ్మకపొండి, భగవంతుడు ఒక రోజు వస్తాడు. ఆయన నిన్ను తీసుకొని పోతాడు, మీ సమస్తాన్ని తీసుకుంటాడు, "బయటకు పొండి!" అది భగవంతుడు. మీరు నమ్మండి లేదా నమ్మకపొండి, అది పట్టింపు లేదు. ఇదే ఉదాహరణ: అద్దెకుండే వాడు భూస్వామిని నమ్మకపోవచ్చు, కానీ భూస్వామి కోర్టు ఉత్తర్వుతో వచ్చినప్పుడు, "బయటకు పొండి," అప్పుడు మీరు బయటకు వెళ్ళాలి. అంతే. ఇది భగవద్గీతలో చెప్పబడింది, "భగవంతుడి మీద నమ్మకం లేనివారు, వారికి నేను మరణముగా వస్తాను మరియు ప్రతిదీ తీసివేసుకుంటాను. పూర్తి అయిపోతుంది. " దానిని మనము నమ్మాలి. "అవును, మరణం వలె తప్పని సరిగా." అప్పుడు భగవంతుడు తప్పని సరిగా ఉన్నాడు. మీరు సవాలు చేస్తూ ఉండవచ్చు కొన్ని సంవత్సరాల పాటు మీరు కొంత కాలం జీవించి ఉన్నంత వరకు , (నవ్వు) కానీ భగవంతుడు వచ్చి మీ ప్రస్తుత గర్వం, ప్రతిష్టాత్మక పరిస్థితి నుండి దూరముగా తీసుకు వెళ్లిపోతాడు, "బయటకు వెళ్ళండి." కాబట్టి ఒక పిచ్చివాడైతే తప్ప అతడు "భగవంతుడు లేడు" అని చెప్పలేడు. భగవంతుని ఉనికిని తిరస్కరించిన వారు ఎవరైనా ఆయన ఒక పిచ్చివాడు.

డాక్టర్ వోల్ఫ్: ప్రభుపాద, ఆయన అంధుడు అని చెప్పడము మెరుగైనది కదా, ఆయన బుద్ధిహీనుడు

ప్రభుపాద: అవును, అదే విషయము. పిచ్చి అనేది అన్నీ బుద్ధిహీనతల యొక్క మొత్తము నేను పిచ్చి అని చెప్పినప్పుడు, ఇది అన్ని రకాల బుద్ధిహీనుతల యొక్క మొత్తము. (ప్రక్కన :) ఇప్పుడు మీరు వారికి ప్రసాదము ఇవ్వవచ్చు . మనము వారి సమయాన్ని వినియోగించుకున్నామని నేను భావిస్తున్నాను