TE/Prabhupada 0353 - రాయండి చదవండి మాట్లాడండి ఆలోచించండి వంట చేయండి తినండి కృష్ణుడి కోసము. కృష్ణ కీర్తన
Lecture on SB 2.1.2 -- Vrndavana, March 17, 1974
ప్రభుపాద: మనము ప్రామాణికము కాని గోస్వాముల నుండి వేరు వేరుగా ఉండాలి. వృందావనాములో ఎల్లప్పుడూ ఉండేవారు ... ప్రతి చోటా. అన్నిచోట్లా వృందావనము ఉన్నాది. కృష్ణుడి దేవాలయం , కృష్ణుడి సంకీర్తన ఎక్కడున్నా, అది వృందావనము. చైతన్య మహాప్రభు చెప్పుతారు, "నా మనస్సు ఎల్లప్పుడూ వృందావనములో ఉంటుంది." ఎందుకంటే అయిన ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు - అయినే కృష్ణుడు - మనకు ప్రచారము చేయటానికి అదేవిధంగా, మీరు ఎక్కడ నివస్తున్నా, మీరు కృష్ణుడి ఉపదేశములను వాస్తవముగా అనుసరిస్తుంటే, కృష్ణుడు చెప్పినట్లుగా, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) అప్పుడు ఇది వృందావనము. మీరు ఎక్కడ నివసిస్తున్నా. మీరు అనుకోవద్దు మెల్బోర్న్లో మనకు ఆలయం ఉన్నoదువలన, మెల్బోర్న్ అర్చాముర్తులు ఇక్కడ ఉన్నాయి, ఇది వృందావనము కాదు అని. "ఇది కూడా వృందావనము. మీరు అర్చముర్తిని చాలా నియమములతో చక్కగా పూజిస్తే, నియమాలు నిబంధనలను అనుసరిస్తు, మీరు ఎక్కడ చేసుకుంటున్నా, ఆది వృందావననాము. ప్రత్యేకించి ఈ వృందావన ధామాము, కృష్ణుడు నిజానికి జన్మించినది ఇది వృందావనమునము, గోలకా వృందావనము. ఇక్కడ, ఈ సంస్థ నిర్వహించే వారు, వారు మొదటి-తరగతి గోస్వాములుగా ఉండాలి. ఇది నా ప్రతిపాదన. గృహమేధి . గృహమేధి కాకూడదు. Gosvāmī.
ఎందుకంటే ... ఈ ధామమును గోస్వాములు, ṣaḍ-gosvāmī అన్వేషించారు కనుక. సనాతన గోస్వామి ఇక్కడకు వచ్చారు, రుప గోస్వామి ఇక్కడకు వచ్చారు. ఆ తరువాత ఇతర గోస్వాములు, జీవా గోస్వామి, గోపాల భట్టా గోస్వామి, రఘునాథా దాస్ గోస్వామి, అందరు కలిసారు శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశాన్ని అమలు చేయడానికి - కృష్ణుడి గురించి, అయిన లీలలను వ్రాయుటకు, చాలా, నేను చెప్పేది, వారు వ్రాసినవి అత్యంత ఆధ్యాత్మిక అవగాహన కలిపించే పుస్తకాలు. Nānā-śāstra-vicāraṇaika-nipuṇau sad-dharma-saṁsthāpakau. ఇది గోస్వాముల యొక్క లక్షణం, లక్షణాలు. మొట్టమొదటి లక్షణం, kṛṣṇotokkrtana-gāna-nartana-parau. వారు ఎల్లప్పుడూ సేవలో ఉండేవారు- కృష్ణుడి కీర్తన చేస్తూ. కృష్ణ -కీర్తన అంటే ... మనము మృదంగము, కర్తాలములతో కీర్తిన నిర్వహించము వలె, ఇది కూడా కృష్ణుడి -కీర్తన. మరియు పుస్తకాలు రాయడము, అది కూడా కృష్ణుడి-కీర్తన. పుస్తకాలు చదవడము, అది కూడా కృష్ణుడు-కీర్తన. కేవలం ఈ కీర్తన మాత్రమే కీర్తన అని కాదు. మీరు కృష్ణుడి గురించి పుస్తకాలను వ్రాసినా, మీరు కృష్ణుడి గురించి పుస్తకాలు చదివినా, మీరు కృష్ణుడి గురించి మాట్లాడినట్లయితే, మీరు కృష్ణుడి గురించి ఆలోచిoచినా, మీరు కృష్ణుడిని పూజిoచినా, మీరు కృష్ణుడి కోసం వంట చేసినా, మీరు కృష్ణుడి కోసము తిన్నా కూడ- అది కృష్ణుడి-కీర్తన.
అందువల్ల గోస్వామి అంటే ఇరవై నాలుగు గంటలు కృష్ణుడి-కీర్తనలో ఈ విధంగా లేదా ఆ విధంగా ఉన్నావారు. Kṛṣṇotkīrtana-gāna-nartana-parau. ఎలా? Premāmṛtāmbho-nidhī. ఎందుకనగా వారు కృష్ణ ప్రేమ అనే మహాసముద్రంలో విలీనం చేయబడ్డారు. మనకు కృష్ణ ప్రేమ లేకపోతే , కృష్ణుడి మీద ప్రేమ, మనం కృష్ణుడి సేవలో ఎలా సంతృప్తి చెందుతున్నాము? అది సాధ్యం కాదు. కృష్ణుడి మీద ప్రేమను అభివృద్ధి చేసుకోని వారు, వారు కృష్ణుడి సేవలో ఇరవై నాలుగు గంటల నిమగ్నమై ఉండలేరు. మనము దానిని పరిగణలోకి తీసుకోవాలి ... కృష్ణుడి సేవలో నిమగ్నమావ్వటానికి, ఎల్లప్పుడూ సమయాన్ని ఆదా చేసుకోవాలి. మనము నిద్రపోతున్న కాలం, అది వృధా అవుతుంది. అది వ్యర్థమైంది. మనము సమయం ఆదా చేయటానికి ప్రయత్నిస్తాము. Kīrtanīyaḥ sadā hariḥ ( CC Adi 17.31) కృష్ణుడు యొక్క మరొక నామము హరి. సదా, ఇరవై నాలుగు గంటలు. వాస్తవమునకు, గోస్వాములు చేసేవారు. వారు మనకు ఉదాహరణలు. వారు రెండు గంటల కంటే ఎక్కువ లేదా అత్యధికముగా మూడు గంటలు నిద్రిoచేవారు కావునా nidrāhāra-vihārakādi-vijitau. వారు జయించారు . ఇది గోస్వామి. వారు ఈ విషయాలను జయించారు. అవి ఏమిటి? Nidrāhāra, nidrā, āhāra, vihāra. విహార అంటే అర్ధం ఇంద్రియ తృప్తి, అహరా అంటే తినడం లేదా సేకరించడము సాధారణంగా, తినడం, āhāra. నిద్ర. Nidrāhāra-vihārakādi-vijitau. జయించారు. అది వైష్ణవుడు అంటే. అంటే ఇరవై నాలుగు గంటలలో, ముప్పై ఆరు గంటల నిద్ర పోవటము కాదు. (నవ్వు) అదే సమయంలో, గోస్వాములుగా పిలువబడటము. ఇ గోదాసా అంటే ఏమిటి? గో-దాసా. వారు గో-దాసాలు. గో అంటే అర్థం ఇంద్రియాలు, దాసా అంటే అర్థం సేవకులు.
మనవిధానం, ఇంద్రియాలకు సేవకులు అయ్యే బదులుగా మనము కృష్ణుడి యొక్క సేవకునిగా ఉండాలి. ఇది గోస్వామి. ఎందుకంటే మీరు జయిస్తే తప్ప, ఇంద్రియాలు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాయి , దయచేసి తినండి, దయచేసి నిద్రించండి, దయచేసి లైంగిక సంబంధాలు పెట్టుకోండి. దయచేసి దీన్ని కలిగి ఉండండి, దయచేసి దీన్ని కలిగి ఉండండి. ఇది భౌతిక జీవితం. ఇది భౌతిక జీవితం, ఇది ఇంద్రియాల యొక్క నిర్దేసములకు సేవకునిగా ఉండటము. అది భౌతిక జీవితం. వ్యక్తులు మారాలి ... గోస్వామి అంటే, మనస్సు నిర్దేశిస్తుందని అర్థం, "దయచేసి మరింత తినండి, దయచేసి మరింత నిద్ర పొండి మరింత లైంగిక సంభoదము కలిగి ఉండండి, దయచేసి మరింత రక్షణ కోసము డబ్బుని కలిగి ఉండండి ... " ఇది భౌతికవాదం. రక్షణ నిధి అంటే డబ్బును కలిగి ఉండటము. ఇది రక్షణ కోసము డబ్బుని కలిగి ఉండటము ... ఇది భౌతికవాదం. ఆధ్యాత్మికం అంటే అర్థం, "లేదు, అది కాదు." Nidrāhāra. ఇంద్రియాలు చెప్పుతున్నాయి, "దీన్ని చేయండి, అలా చేయండి", మీరు చాల బలంగా మారాలి, మీరు సరిగ్గా తిరిగి సమాధానము ఇస్తారు, "లేదు, ఇది కాదు." అప్పుడు మీరు గోస్వామి. ఇది గోస్వామి. ఆ గృహమేధి, గృహస్త- ఒకే విధంగా ఉంటారు. కానీ గృహస్థ అంటే ఇంద్రియాల యొక్క నిర్దేసము లేదు అప్పుడు మీరు గోస్వామి అవుతారు. అప్పుడు, Narutoama dāsa Ṭhākura చెప్పినట్లు gṛhe vā banete thāke hā gaurāṅga bole ḍāke. Hā gaurāṅga, "నితాయ్-గౌరాను ఎల్లప్పుడూ కీర్తన చేస్తూ, నీతాయ్-గౌరా గురించి ఆలోచన చేస్తూ" అలాంటి వ్యక్తి, నరోత్తమా దాసా ఠాకురా చెప్తాడు ... Gṛhe vā... ... అయిన ఒక సన్యాసి అయి ఉండవచ్చు, లేదా అయిన ఒక గృహస్తుడు కావచ్చు. ఇది పట్టింపు లేదు. అయిన నితాయ్-గౌరా ఆలోచనలో నిమగ్నమై ఉన్నందున. " కావున narottama māge tāṅra saṅga: నరోత్మా ఎల్లప్పుడూ అలాంటి వ్యక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు. Gṛhe vā banete thāke, hā gaurāṅga bole ḍāke, narottama māge tāṅra saṅga. నరోత్మా ఎల్లప్పుడూ అలాంటి వ్యక్తుల యొక్క సమాజమును కోరుకుంటున్నారు. Kṛṣṇotkīrtana-gāna-nartana-parau premāmṛtāmbho-nidhī dhīrādhīra-jana-priyau.
గోస్వామి అన్ని తరగతుల వారికి ప్రియమైనవాడు అవ్వాలి. వ్యక్తులు రెండు వర్గాలు ఉన్నారు: dhīra మరియు adhīra. dhīra అంటే ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకున్నవాడు, adhīra అంటే లేని వాడు అని అర్థం. గోస్వాములు అన్ని తరగతుల వ్యక్తులకు చాలా దయ కలిగి ఉంటారు. Dhīradhīra-jana-priyau. ఎలా మీరు ...? గోస్వామి ఎలా ఉండగలుగుతారు ...? ఆరుగురు గోస్వాములు ఇక్కడ వృందావనములో ఉన్నప్పుడు, వారు ప్రజలoదరిలో బాగా ప్రాచుర్యం పొందారు. ఈ వృందావన ధామములో, గ్రామ ప్రజలు, భర్త భార్యతో కొందరు తగాదాలను కలిగి ఉంటే, వారు సనాతన గోస్వామి దగ్గరకు వెళ్లేవారు, సర్, మా మధ్య కొoత అసమ్మతి ఉంది. మీరు సరీ చేయండి. Sanātana Gosvāmī తన తీర్పు ఇచ్చేవాడు, "మీరు తప్పు చేశారు." అంతే. వారు అంగీకరిoచే వారు. వారు ఎoత జనాదరణ పొందారో చూడండి. Sanātana Gosvāmī కూడా వారి కుటుంబ తగాదాలను తీర్చే వాడు. కావునా dhīrādhīra-jana-priyau. ఈ సాధారణ వ్యక్తులు, వారు భక్తులు కాదు, కానీ వారు సనాతన గోస్వామికి అంకితం అయ్యారు. అందువలన వారి జీవితం విజయవంతమయింది. ఎందుకంటే వారు సనాతన గోస్వామి ఆదేశాలను అనుసరించారు కనుక, అందుచే వారు కూడా విముక్తి పొందారు. వారు వ్యక్తిగతంగా తప్పులు చేస్తుండ వచ్చు, కానీ వారు సనాతన గోస్వామిని అనుసరించారు. సనాతన గోస్వామి వారికి దయ చూపించాడు. ఇది గోస్వామి. మీరు వారిని పిలువ వచ్చు, వారికి ప్రసాదమును ఇవ్వండి , వారిని చాలా చక్కగా చుడండి: కేవలం హరే కృష్ణ మంత్రమును వినండి. మీరు ఇక్కడకి రండి. జపము చేయండి హరే కృష్ణ మంత్రమును. ప్రసాదము తీసుకోండి. వారు మీ నియంత్రణలో ఉంటారు. వారు మీ నియంత్రణలో ఉంటారు. మీ నియంత్రణలో ఉన్న వెంటనే, వారు క్రమముగా పవిత్రము అవ్వుతారు. తక్షణమే. ఎందుకంటే వైష్ణవుని కింద, అయిన నిర్దేసత్వమునకు అంగీకరిస్తే, వారు అవుతారు ... దీనిని ajñāta-sukṛti అని పిలుస్తారు. అయిన మీకు అందిస్తున్న కారణంగా ... మనము నడిస్తునప్పుడు, వారు "హరే కృష్ణ జయ రాధే" అని చెప్తారు. అది గౌరవం ఇచ్చే పద్ధతి. ఈ సామాన్య ప్రజలు వైష్ష్ణవుడికి గౌరవం ఇస్తే, వారు క్రమముగా ఉన్నత స్థానమునకు వస్తారు. మీరు వైష్ణవునిగా ఉండాలి. లేకపోతే వారు మీకు ఎందుకు గౌరవం ఇస్తారు? గౌరవం దబాయించడము కాదు. అది వారికీ వారే ఇవ్వాలి మిమ్మల్ని చూసినప్పుడు, వారు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు dhīrādhīra-jana-priyau. ఇది గోస్వామి.
ధన్యవాదాలు.
భక్తులు: జయ శ్రీల ప్రభుపాద.