TE/Prabhupada 0394 - నితాయి పదకమలకు భాష్యము

Revision as of 19:21, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Nitai-Pada-Kamala -- Los Angeles, January 31, 1969


నితాయి పదకమల కోటిచంద్ర సుశీతల జేచాయాయి జగత జురాయ్. ఇది నరోత్తమ దాస ఠాకూరుల వారిచే రచించబడిన గేయము. ఆయన గౌడీయ సాంప్రదాయానికి చెందిన గొప్ప ఆచార్యులు. ఆయన వైష్ణవ తత్వానికి చెందిన అనేక గేయాలను రచించారు. మరియు అవన్నీ పూర్తిగా వైదిక సూత్రాల చే ఆమోదించబడినవి. నరోత్తమదాసఠాకురులు, ఈవిధంగా పాడుతున్నారు, ఈ జగత్తు మొత్తం భౌతిక అస్తిత్వం అనే దావాగ్ని చేత బాధకు గురవుతోంది. , కాబట్టి ఎవరైతే శ్రీ నిత్యానంద ప్రభు పాదపద్మాల ఆశ్రయాన్ని తీసుకుంటారో... " నేడు 31వ తేది, జనవరి, 1969 శ్రీ నిత్యానంద ప్రభువుల ఆవిర్భవ దినోత్సవం కాబట్టి మనము నరోత్తమదాసఠాకురుల యొక్క ఈ సూచనను ఆస్వాదించాలి. ఈ భౌతిక జీవితపు జ్వలించే దావాగ్ని యొక్క వేదనల నుండి ఉపశమనం పొందడానికి, ప్రతి ఒక్కరూ శ్రీనిత్యానందప్రభు యొక్క పాదపద్మాల ఆశ్రయం తీసుకోవాలి, ఎందుకంటే అవి కోటి చంద్రుల కిరణాల చల్లదనాన్ని కలిగి ఉంటాయి. అంటే తక్షణమే ఎవరైనా శాంతియుత వాతావరణాన్ని పొందగలరు. ఎలాగైతే ఒక వ్యక్తి రోజంతా పని చేసి ,చంద్రకాంతి కిందకు వస్తే, అతను పూర్తిగా ఉపశమనం పొందుతాడు.

అదేవిధంగా,ఏ భౌతిక వ్యక్తైనా, శ్రీ నిత్యానందుని ఆశ్రయాన్ని తీసుకుంటే వెంటనే అతడు ఉపశమనాన్ని పొందుతాడు. ఇంకా అతను ఈ విధంగా అంటున్నాడు,

నితాయి పదకమల కోటిచంద్ర సుశీతల
జేచాయాయి జగత జురాయ్,
హేనో నితాయి బినే భాయి, రాధ-కృష్ణ పాయితే నాయి,
ధరో నితాయి-చరణ దుఃఖాని.

అతను ఈ విధంగా చెబుతున్నాడు, "మీరు భగవధ్దామానికి వెళ్ళాలని ఆతృత కలిగి ఉంటే, మరియు,రాధా కృష్ణుల దివ్య సహచర్యాన్ని పొందదలిస్తే శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ఆశ్రయం తీసుకోవడమే అత్యుత్తమ విధానం. " మళ్లీ ఈవిధంగా అంటున్నాడు, సే సంబంధ నాహి జార్, బృథా జన్మ గెలో తార్: ఎవరైతే శ్రీ నిత్యానంద ప్రభు దరిచేరరో, తన విలువైన జీవితాన్ని వూరికే వృధా చేసుకున్నట్లుగా భావించాలి." భ్రృతా జన్మ గెలో, బ్రృతా అనగా ఏమీ లేదు, జన్మ అంటే జీవితం. గెలోతార్, చెడగొట్టుకున్నాడు. ఎందుకంటే అతను శ్రీ నిత్యానందప్రభువు తో సంబoధము పెట్టుకోలేదు కాబట్టి నిత్యానంద అనే నామ అర్థాన్ని గమనిస్తే,ఈ విధంగా సూచిస్తుంది... నిత్య అంటే శాశ్వతమైనది.ఆనంద అంటే ఆనందం. భౌతిక ఆనందం శాశ్వతమైనది కాదు.అదే వ్యత్యాసం. కాబట్టి తెలివైన వారు ఈ భౌతిక జగత్తు యొక్క ఈ మినుకుమినుకుమనే ఆనందం పట్ల ఆసక్తి చూపరు. జీవులుగా, మనలో ప్రతి ఒక్కరూ, ఆనందం కోసం అన్వేషిస్తుంటాము. కానీ మనం కోరుకునే ఆనందం తాత్కాలికమైనది. అది ఆనందం కాదు. వాస్తవమైన ఆనందం నిత్యానంద, శాశ్వతమైన ఆనందం. ఎవరైతే నిత్యానంద ప్రభు తో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా ఉంటారో, అతని జీవితం వ్యర్తమైందని అర్థం చేసుకోవలి.

సే సంబంధ నాహి జార్, బృథ జన్మ గెలో తార్,
సెయి పశు బోరో దురాచార్.

నరోత్తమ దాసఠాకురుల వారు ఇక్కడ చాలా కఠినమైన పదాన్ని ఉపయోగిస్తున్నారు. అటువంటి మానవుడు ఒక జంతువు,అంటే ఒక నియంత్రనలేని జంతువు అని ఆయన అన్నారు. ఎలాగైతే కొన్ని మచ్చిక కాని జంతువులు, ఉంటాయో, నిత్యానంద ప్రభు సంప్రదించని వ్యక్తి అతను అనాగరిక జంతువుగా పరిగణించబడతాడు. సెయి పశు బొరో దురాచార్. ఎందుకు? ఎందుకంటే నితాయి నా బోలిలో ముఖే: "నిత్యనందప్రభు యొక్క పవిత్ర నామాన్ని అతను ఎన్నడూ ఉచ్ఛరించలేదు " కాబట్టి. మజిలో సంసార-సుఖే, " ఈ భౌతిక ఆనందం లో లీనమయ్యాడు." విద్యా-కులే కి కోరిబె తార్. "అటువంటి వ్యక్తి అజ్ఞాని, తన విద్య, కుటుంబం, సంప్రదాయం ,జాతీయత అతనికి ఏమి సహాయం చేస్తాయి? " ఈ విషయలు అతనికి సహాయం చేయలేవు. ఇవన్నీ తాత్కాలికమైనవి. నిజంగా మనకు శాశ్వతమైన ఆనందం కావాలంటే నిత్యానంద ప్రభును ఆశ్రయించాలి. విద్య-కులే కి కోరిబె తార్. విద్య అంటే విద్య, కుల అంటే కుటుంబం, జాతీయత. మనం చాలా మంచి కుటుంబం లో జన్మ తీసుకుని వుండవచ్చును, లేదా మనం చాలా మంచి జాతీయ గౌరవన్ని కలిగి ఉండవచ్చును, కానీ ఈ శరీరం ముగిసిన తర్వాత, ఈ విషయలు మనకు సహాయం చేయలేవు. నేను నా కర్మలను నా వెంట తీసుకుని వెళ్తాను, ఆ కర్మానుసారంగా, బలవంతంగా ఒక శరీరాన్ని స్వీకరించవలసి వస్తుంది. అది మానవ శరీరం కాకుండా ఇతర ఏదైన శరీరం కావచ్చు. కాబట్టి,ఈ విషయాలు మనల్ని కాపాడలేవు లేదా మనకు వాస్తవమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అందువల్ల శ్రీ నరోత్తమ దాస ఠాకూరు ఈ విధంగా సలహా ఇస్తున్నారు. విద్య-కులే కి కోరిబె తార్. ఆయన తర్వాత ఈ విధంగా చెబుతున్నారు,అహంకార మత్త హోయా, "తప్పుడు గౌరవం మరియు గుర్తింపు వలన వ్యామోహం చెంది..." తనను తాను దేహంతో గుర్తించుకోవడము, దేహ సంబంధీకులను తనవాళ్ళు గా భావించడం, దీనినే అహంకారె మత్త హోయియా అంటారు. ఎవరైతే ఇటువంటి తప్పుడు భావన తో పిచ్చెక్కి ఉంటారో, అహంకారె మత్త హొయియా,నితాయి పద పాసరియా. ఈ తప్పుడు భావన కారణంగా మనం ఈ విధంగా ఆలోచిస్తున్నాం,"ఎవరు ఈ నిత్యనంద? నా కోసం అతను ఏమి చెయ్యగలడు?నేను లెక్క చెయ్యను ." ఇవి తప్పుడు ప్రభావ సూచనలు. అహంకారె మత్త హొయియా,నితాయి పద పాసరియా.... అసత్యేర సత్య కోరి మాని. దీని ఫలితంగా నేను అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నాను. ఉదాహరణకు, నేను ఈ శరీరాన్ని స్వీకరించాను. ఈ శరీరం, కానీ నేను ఈ శరీరం కాదు. అందువలన, తప్పుడు గుర్తింపుతో నేను మరింత మరింత చిక్కుకొని పోతున్నాను. కాబట్టి ఎవరైతే ఈ అసత్య అవగాహన వల్ల మదమెక్కిన ఆ వ్యక్తి, అహంకారె మత్త హొయియా,నితాయి పద పాసరియా.... అసత్యేర సత్య కోరి మాని, అతను అసత్యాన్ని సత్యంగా భావిస్తాడు. తర్వాత వారు ఈ విధంగా అంటున్నారు, నితాయేర్ కరుణా హబే, బ్రజే రాధా-కృష్ణ పాబె. ఒకవేళ మీకు నిజంగా భగవధ్ధామానికి తిరిగి వెళ్లాలని తీవ్రమైన కోరిక ఉంటే, దయచేసి నిత్యనందప్రభు యొక్క దయను కోరండి.

నితాయేర్ కోరుణా హబె, బ్రజ రాధా-కృష్ణ పాబె,
ధరో నితాయి,చరణ ధుః'ఖాని

దయచేసి నిత్యనందప్రభు యొక్క పాదపద్మాలను గట్టిగా పట్టుకోండి.తర్వాత వారు ఏ విధంగా అంటున్నారు,నితయేర్ చరణ సత్య. కానీ ఎవరైనా నేను చాలా ఆశ్రయాలను స్వీకరించి వున్నాను కదా అని భావించవచ్చును, కానీ తర్వాత అవన్నీ ఈ భౌతిక జగత్తులో అసత్యాలుగా నిరూపించబడతాయి., అదేవిధంగా ,ఒక వేళ మనం నిత్యానంద ప్రభు పాదపద్మాలను పట్టుకున్నట్లయితే, అవికూడా అసత్యంగా నిరూపించబడతాయి అనుకోవచ్చును. కానీ నరోత్తమ్ దాసఠాకూరు మనకు భరోసా ఇస్తున్నారు :నితయేర్ చరణ సత్య. అది అసత్యం కాదు. ఎందుకంటే నిత్యనంద శాశ్వతుడు,ఆయన పాద పద్మాలు కూడా శాశ్వతమైనవి. తాన్హార సేవక నిత్య. ఎవరైతే నిత్యానంద ప్రభు దాసత్వాన్ని స్వీకరిస్తారో వారు కూడా శాశ్వతులు అవుతారు. శాశ్వతులు కాకుండా ఎవరూ శాశ్వతున్ని సేవించలేరు. అది వైదిక నిర్వచనము. బ్రహ్మానుభవం పొందకుండా, ఎవరూ పరబ్రహ్మాన్ని చేరుకోలేరు. ఎలాగైతే ఎవరైనా నిప్పుగా మారకుండా, అగ్నిలోకి ప్రవేశించలేరు. నీటి గా మార కుండా ఎవరూ నీటిలో ప్రవేశించలేరు. అదేవిధంగా, పూర్తిగా ఆధ్యాత్మికత్వం చెందకుండా, ఎవరూ ఆధ్యాత్మికరాజ్యంలోకి ప్రవేశించలేరు. నితయేర్ చరణ సత్య. ఒకవేల మీరు నిత్యానంద ప్రభు పాదపద్మాలను పట్టుకున్నట్లయితే , అప్పుడు మీరు వెంటనే పూర్తిగా ఆధ్యాత్మికత్వం చెందుతారు ఎలాగైతే మీరు విద్యుత్తును తాకినట్లయితే వెంటనే విద్యుత్తు మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది సహజమైనది. అదేవిధంగా,నిత్యానంద అంటే శాశ్వతమైన ఆనందం, ఏదో విధంగా, ఒకవేళ మీరు నిత్యానంద ప్రభు పాదపద్మాలను తాకినట్లయితే, అప్పుడు మీరు కూడా నిత్యానందాన్ని పొందుతారు. తాన్హర సేవక నిత్య. అందువల్ల ఎవరైతే నిత్యనందప్రభు తో సంబంధంలో ఉన్న వారు,వారు కూడా శాశ్వతులు అవుతారు.

నితయేర్ చరణ సత్య, తాన్హర సేవక నిత్య,
దృఢ కొరీ ధరో నితాయిర్ పాయి

కాబట్టి,ఆయన్ని చాలా గట్టిగా పట్టుకోండి. నరోత్తమ బోరో దుఃఖీ నితాయి మోరొ కోరో సుకీ. చివరిగా,ఈ పద్యం యొక్క స్వరకర్త నరోత్తమ దాస ఠాకూర, ఆయన నిత్యానందున్ని ఈ విధంగా నివేదిస్తున్నారు, నా ప్రియమైన ప్రభూ, నేను చాలా ధుఃఖం లో వున్నాను.దయచేసి మీరు నన్ను సంతోషపరచండి. మరియు మీరు దయచేసి నన్ను మీ పాదపద్మములను అంచున ఉంచుకోండి. " అది ఈ పాట మొత్తం యొక్క సారాంశం