TE/Prabhupada 0395 - పరమ కరుణకు భాష్యము
Purport to Parama Koruna -- Los Angeles, January 16, 1969
Parama koruṇa, pahū dui jana, nitāi gauracandra. ఇది లోచన దాస ఠాకుర రచించిన గేయము, ఆయన శ్రీచైతన్య మహప్రభు యొక్క గొప్ప భక్తుడు,దాదాపు సమకాలీకుడు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు లీలలను వర్ణించే చైతన్యమంగళ అనే గ్రంథాన్ని రచించాడు. చైతన్యమంగళ చాలా సుప్రసిద్ధ గ్రంథము.మరియు ఆయన చాలా గేయాలను రచించారు. సాధారణంగా, వైష్ణవులు అందరూ దివ్య మైన కవితా శక్తిని కలిగి ఉంటారు. అది వైష్ణవుని యొక్క 26 దివ్య గుణాలలో ఒకటి. అతను ఈవిధంగా అంటున్నాడు "ఈ ఇద్దరు ప్రభువులు," నితాయి గౌరుచంద్ర, శ్రీ నిత్యానందప్రభు, శ్రీ గౌరాంగ లేదా చైతన్య మహప్రభు, వారు చాలా కరుణావతారులు. సబ అవతార-సార శిరోమణి "వారు అన్ని అవతారాల సారము." ఈ అవతారం గురించి భగవద్గీత లో వివరించబడింది. ఎప్పుడైతే ధర్మాచరణలో ఆటంకాలు కలిగినప్పుడు, మరియు పాపకార్యాలు మితిమీరినప్పుడు ఆ సమయంలో భగవంతుడు అవతరిస్తాడు, లేద అతను ఈ భౌతిక జగత్తుకు దిగివస్తాడు, సాధువులను రక్షించుటకు మరియు దుష్టులను శిక్షించుటకు. అది అవతారం యొక్క కార్యం. ప్రతి అవతారం యందు మీరు ఈ రెండు విషయాలను గమణించవచ్చు. శ్రీ కృష్ణుడు చాలా సుందరాకారుడు, చాలా దయామయుడు, కానీ ఆయన రాక్షసుల పాలిటి సింహస్వప్నం. రాక్షసులకు అతను పిడుగులా దర్శనమిస్తాడు, మరియు గోపీకలు అతనిని చాలా సొగసైన మన్మథునిలా చూస్తారు. ఈ విషయం గురించే భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది, యే యథామాం ప్రపద్యన్తే ( BG 4.11) ఆసురిక ప్రవృత్తులు నుండి ఒకరికి కలిగిన విముక్తికి అనుగుణంగా భగవంతుడు వారికి అనుభూతమవుతాడు.
కాబట్టి ఈ యుగంలో...అయితే, చివరిదైన అవతారం, కల్కి అవతారము, కేవలం చంపడమే ఆయన కార్యం. ఇంకా చాలా చాలా కాలం గడిచిన తర్వాత ఆయన అవతరిస్తాడు. కానీ ఇక్కడ శ్రీ చైతన్య మహప్రభు,ఆయన కార్యం చంపడం కాదు, కేవలం మేలుచేయడం . అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఈ యుగములో, వాస్తవానికి, అధర్మం చాలా ప్రబలుతున్నప్పటికీ. కానీ ఒకవేళ చైతన్య మహప్రభు వారిని సంహరించదలిస్తే,అప్పుడు వారికి మోక్షం అనే ప్రశ్నే లేదు. అయితే ... వాస్తవానికి, ఎవరైతే భగవంతుని అవతారం చే సంహరించబడతారో వారికి మోక్షం కూడా లబిస్తుంది. కానీ వారికి ఆధ్యాత్మిక లోకాలలోకి ప్రవేశం దొరకదు ,వారు కేవలం నిరాకార రూపం లో బ్రహ్మ జ్యోతిలో లీనమవుతారు. వేరు మాటల్లో చెప్పాలంటే,వారు నిరాకార వాదుల గమ్యాన్ని చేరుతారు. ఆ నిరాకార వాదుల గమ్యాన్ని కేవలం భగవంతుని చేత సంహరించబడిన వారు కూడా పొందుతారు. అది అంత పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. చైతన్య మహప్రభు కరుణామయుడు, ఎందుకనగా అతను ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమను ప్రసాదించి అక్కున చేర్చుకుంటున్నాడు కాబట్టి. శ్రీల రూపగోస్వామి శ్రీ చైతన్య మహాప్రభుని అన్ని అవతారాలలోకెల్లా పరమ ఔదార్యమూర్తిగా వర్ణించారు. ఎందుకనగా ఆయన అర్హత చూడకుండా ప్రతి ఒక్కరికీ కృష్ణ ప్రేమను ఇస్తున్నాడు కాబట్టి. కాబట్టి లోచన దాస ఠాకూరు ఈవిధంగా చెబుతున్నాడు, పరమ కరుణ, పహు దుయ్ జన, నితాయి గౌరచంద్ర. మరియు వారు అన్ని అవతారాల యొక్క సారం. కేవల ఆనంద-కంద. వారు ఉపదేశించిన పద్ధతి చాలా ఆనందకరమైనది. చైతన్య మహప్రభు ఈ విధంగా సూచిస్తున్నారు "నీవు హరే కృష్ణ మంత్రాన్ని జపం చెయ్యి,చక్కగా నృత్యం చెయ్యి, మరియి నీవు అలసిపోయినప్పుడు, విశ్రాంతి తీసుకుని తర్వాత చక్కగా కృష్ణ ప్రసాదం స్వీకరించు. " ఈ విధంగా, ఆయన చెప్పే సూత్రము చాలా ఆనంద దాయకమైనది. కేవల ఆనంద-కంద. ఆయన జగన్నాథపురిలో ఉండగా, ప్రతిరోజు సాయంత్రం భగవన్నామ సంకీర్తన,నృత్యం, కొనసాగాయి. మరియు నృత్యం ముగిసిన తర్వాత, ఆయన జగన్నాథ ప్రసాదాన్ని అందరికీ వితరణ చేసే వారు. ప్రతిరోజు రాత్రి వేల సంఖ్యలో ప్రజలు సమావేశమయ్యేవారు. కాబట్టి అది దివ్యానందదాయకమైనది. కేవల ఆనంద-కంద.
తర్వాత వారు ఈ విధంగా సూచిస్తున్నారు, భజో భజో భాయి, చైతన్య నితాయి నా ప్రియ సోదరా, ఈ రెండు ప్రభువులు,శ్రీ చైతన్య మరియి నిత్యనందులను ఆరాధించండి. సుధృఢ విశ్వాస కోరి', "వారిపై విశ్వాసము మరియి బరోసా వుంచి." ప్రతి ఒక్కరూ శ్రీ చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. శ్రీ చైతన్య మహప్రభు ఈవిధంగా చెబుతున్నారు, "హరి నామాన్ని జపిస్తూ ఉండండి, కేవలం భగవన్నామ జపం ద్వారా,మీరు మీ జీవితం యొక్క సర్వ పరిపూర్ణత్వము పొందుతుంది." ఇది వాస్తవము. మనం భగవన్నామ జపాన్ని స్వీకరించకపోతే దాన్ని అనుభూత పరచుకోలేము, కాని ఎవరైతే భగవన్నామాన్ని జపిస్తున్నారో వారు చాలా వేగంగా తమ జీవితాలలో సర్వ సంపూర్ణత్వాన్ని పొందినట్లు అనుభవం చెందుతున్నారు. కాబట్టి మనమందరమూ ఈ మంత్రాన్ని అత్యంత శ్రద్ధా భక్తులతో జపించాలి. కానీ ఇందులో మనకు కావలిసిన ఏకైక అర్హత గురించి, వారు ఈ విధంగా చెబుతున్నారు, విషయ చాడియా,సే రసె మజియా,ముఖే బోలో హరిహరి. మనం కృష్ణ నామాన్ని అత్యంత శ్రద్ధా భక్తులతో జపించాలి, అదే సమయంలో మనము కొంత జాగ్రత్త తీసుకోవాలి, మనల్ని మనము ఇంద్రియభోగము నుండి కాపాడుకోవాలి. విషయ చాడియా, విషయ అంటే ఇంద్రియభోగము. మరియి చాఢియా అంటే విడిచిపెట్టడం. ప్రతి ఒక్కరూ ఇంద్రియ భోగాన్ని విడిచి పెట్టాలి. వాస్తవానికి, ఈ భౌతిక జీవనంలో మనం మన ఇంద్రియాలను పొందివున్నాము మరియు వాటిని వాడుకోవడము కూడా మనము అభ్యసించివున్నాము. మనం దానిని ఆపలేము.ఆపడం అనే ప్రశ్నే లేదు, కానీ దానిని నియంత్రించగలం. ఉదాహరణకు వస్తే మనం తినాలని అనుకోవడం. విషయ అంటే తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము రక్షించుకోవటము. కాబట్టి ఈ విషయలను మనం పూర్తిగా నిషేధించలేము. కాని మనం వాటిని మన కృష్ణచైతన్య అభ్యాసానికి అనుకూలంగా మార్చుకోగలం. కాబట్టి మనం అన్నింటిని ఈవిధంగా తీసుకోకూడదు... ఉదాహరణకు తినడం. కేవలం మనం మన నాలికను సంతృప్తి పరచుకోడానికి తినకూడదు. మనం మన కృష్ణచైతన్య అభ్యాసానికి అనువైనంతమాత్రమే తీసుకోవాలి. తినడం నిలిపివేయబడలేదు, కానీ అది అనుకూలముగా నియంత్రించబడింది. అదేవిధముగా, సంభోగము చేయడము. సంభోగము చేయడము కూడా నిలిపివేయబడలేదు. కానీ క్రమబద్ధమైన సూత్రానుగుణముగా మీరు వివాహం చేసుకోవలెను, మరియు కేవలం మీరు కృష్ణ చైతన్య వంతమైన సంతానాన్ని పొందడం కోసమే సంభోగించాలి. అలా కాకుంటే ఆ పని చేయకండి. ఆవిధంగా ప్రతిదీ నియంత్రించబడుతుంది. రక్షణను కూడా,నిలిపివేయడమనే ప్రశ్నే లేదు. కృష్ణుడి అజ్ఞను అనుసరించి అర్జునుడు కూడా పోరాడుతూ, రక్షించుకోవటము చేశాడు. కాబట్టి ప్రతీదీ ఉంది. ఏదీ ఆపబడలేదు. కాకపోతే కేవలం అది కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడానికి సర్దుబాటు చేయబడింది. విషయ చాడియా.మనం ఈ ఇంద్రియ భోగాలను అనుభవించకూడదు. శరీరానికి సంబంధించిన ఈ నాలుగు అవసరాలను, అనగా తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, రక్షించుకోవటము, ఇంద్రియ తృప్తి కోసం చేయకూడదు. రాజకీయ నాయకులు, వారు ఇంద్రియ తృప్తి కోసం పోరాడతారు. వారు ప్రజల బాగోగులను చూడరు. వారి రాజకీయ ఉన్నతి కోసం పోరాడతారు. అది నిషేధించబడింది. అయితే ప్రజలను రక్షించడనికి పోరాటం అవసరమైనప్పుడు, ఆ పోరాటాన్ని స్వీకరించాలి. కాబట్టి మనం ఈ ఇంద్రియభోగ సూత్రాన్ని లేదా ఇంద్రియ భోగ పద్దతిని విడిచిపెట్టాలి.
దేఖో దేఖో భాయి త్రి-భువనే నాయి. తర్వాత ఆయన ఈవిధంగా అంటున్నారు, ఒక్కసారి చూడండి,ఇంత కరుణ గలవారు ఎవ్వరూ లేరు. పసు పాకీ ఝురే, పాశాన విదరే. ఆయన కరుణవల్ల పశుపక్ష్యాదులు కూడా ఉద్ధరించ బడుతున్నాయి. శ్రీ చైతన్య మహప్రభు మధ్య భారతదేశంలోని జారిఖండ అని పిలువబడే ఒక అరణ్యం గుండా వెళ్ళినప్పుడు, వారు ఒంటరిగా ఉన్నారు, ఆయనతో పాటు కేవలం తన వ్యక్తిగత సహాయకుడే ఉన్నాడు. ఆయన ఆ అరణ్యం గుండా వెళుతుండగా,ఒక పులిని తాకాడు. నిద్రిస్తున్న ఆ పులి, గర్జనతో సమాధానం ఇచ్చింది. కూడా ఉన్న మహాప్రభు యొక్క సేవకుడు "ఇక మన పని అయిపోయింది" అనుకున్నాడు. కానీ వాస్తవానికి, చైతన్య మహప్రభు ఆ పులిని అడిగారు, "నీవు ఎందుకు నిద్రిస్తున్నావు? లేచి నిలబడు.హరే కృష్ణ మంత్రం చెప్పు "అన్నారు.వెంటనే ఆ పులి లేచి నృత్యం చేయటం ప్రారంభించింది.వాస్తవానికి అది జరిగింది. చైతన్య మహప్రభు ఈ హరేకృష్ణ ఉద్యమాన్ని ప్రచారము చేసినప్పుడు, పులులు, జింకలు, ... అన్నీ చేరాయి. , కానీ మనము అంత శక్తివంతులం కాదు. కానీ ఇది సాధ్యమే, ఏమంటే ... కనీసం, కుక్కలు సంకీర్తనతో పాటు కలిసి నాట్యం చేయడం మాత్రం మనం చూసాము. అందువల్ల అది కూడ సాధ్యమే ... కానీ మనము అలాంటి గొప్ప ప్రమాదాన్ని కలిగించే సాహసాన్ని చేయలేము. కానీ, శ్రీ చైతన్య మహాప్రభు పులులతో నృత్యం చేయించినప్పుడు, కనీసం మనం మానవుల చేత నృత్యం చేపించడానికి ప్రేరేపించగలం. ఇది అటువంటి మంచి ఉద్యమం.
పశ్యు పాఖి ఝురే,పాశాణ విదరే. పాశాణ అంటే రాయి. అందువల్ల కృష్ణనామ సంకీర్తన వలన చివరకి రాతి-హృదయం కలవారు కూడా ద్రవిస్తారు. మేము దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. పాశాణ విదరే,సుని జార గుణ-గాథ. కేవలం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దివ్యగుణ లీలలను శ్రవణం చేయడం ద్వారానే, చివరకు రాతి హృదయం కలవారు కూడా కరిగిపోతారు. అటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి, ఉదాహరణకు జగాయి మదాయి. అనేక మంది పతితాత్ములు, వారు గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరకున్నారు. తర్వాత లోచన దాస ఠాకుర ఈవిధంగా చెప్తున్నారు, విషయ మజియా, రోహిలి పోరియా. దురదృష్టవశత్తూ నేను ఈ శరీరం లేదా ఇంద్రియాల యొక్క లంపటంలో పూర్తిగా చిక్కుకుని పోయాను, ఎంతగా అంటే నేను శ్రీ చైతన్య మహప్రభుపు యొక్క పాదపద్మాలను మరచిపోయాను. " విషయ మజియా, రోహిలి పోరియా, సే పదే నహిలో ఆశ. నేను చైతన్య మహప్రభు యొక్క పాదపద్మాలను అంటిపెట్టుకుని ఉండాలని కోరుకోవడం లేదు. ఎందుకు అలావున్నాడు? ఎందుకంటే అతను ఇలా చింతిస్తున్నాడు, ఆపన కరమ,భుంజాయె శమన, నా గత దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్నాను, అందుకారణంగా నేను కృష్ణ చైతన్య ఉద్యమం పట్ల ఆకర్షితున్ని అవడం లేదు. ఇది నరకాధిపతి, యమరాజు నాకు విధించిన శిక్ష. వాస్తవానికి, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, సంకీర్తన ఉద్యమం, చాలా రమ్యమైనది ఆకర్షణీయమైనది, ప్రతి సాధారణ వ్యక్తీ ఈ ఉద్యమం పట్ల ఆకర్షింపబడాలి. కానీ ఒకవేళ ఎవరైనా ఆకర్షింపబడకపోతే, అతను యమధర్మరాజు యొక్క చట్టాలచేత శిక్షించ బడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైన, మనము ఈ హరేకృష్ణ నామజపాన్ని అంటి పెట్టుకుని ఉంటే, అప్పుడు యమరాజు కూడా, మరణం పర్యవేక్షకుడు, ఆయన కూడా మనలను శిక్షించలేడు. ఈ విషయాన్ని బ్రహ్మ సంహిత ధృవపరుస్తోంది. బ్రహ్మ సంహిత ఇలా చెబుతోంది, ఎవరైతే భగవద్భక్తిని ఆచరిస్తారో, వెంటనే అతని పూర్వ కర్మల ప్రతిచర్యలు సర్దుబాటు చేయబడతాయి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో భాగము అవ్వాలి , మరియు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంత్రాన్ని జపించాలి.