TE/Prabhupada 0479 - మీరు మీ వాస్తవస్థితిని గ్రహిస్తే అప్పుడు వాస్తవంగా మీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి

Revision as of 11:58, 25 August 2019 by Anurag (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 7, 1968


ఇక్కడ కృష్ణుడు యోగ పద్ధతి గురించి భగవద్గీతలో ఇలా చెబుతున్నాడు, mayy āsakta-manāḥ, ఆయన ఇప్పటికే ఆరవ అధ్యాయంలో యోగపద్దతి గురించి వివరించాడు. మొదటి ఆరు అధ్యాయల్లో, ఏమని వివరించబడినది అనగా, జీవుని యొక్క స్వరూప స్థితి ఏమిటి. భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. మొదటి ఆరు అధ్యాయలు జీవుల స్వరూప స్థితిని మాత్రమే వివరిస్తాయి. అది అర్థం చేసుకున్నప్పుడు ... మీరు మీ వాస్తవిక స్థితిని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు మీ కార్యక్రమాలు మొదలవుతాయి. మీ వాస్తవ స్థితి ఏమిటో మీకు తెలియకపోతే ... ఉదాహరణకు కార్యాలయంలో మీ పదవి గురించి కచ్చితత్వం లేకుంటే, మీరు అమలు చేయవలసిన పని గురించి కచ్చితత్వం లేకుంటే, అప్పుడు మీరు ఏదీ చక్కగా చెయ్యలేరు. ఇక్కడ ఒక టైపిస్టు ఉన్నాడు, ఇక్కడ గుమస్తా వున్నాడు, ఇక్కడ ఒక పనివాడు ఉన్నాడు, అలా ఆయా పనులలో ఆయా వ్యక్తులు వున్నారు. కాబట్టి వారివారి పనులను వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ జీవుని యొక్క స్వరూప స్థితి ఏమిటో గ్రహించవలెను. ఆ విషయం గురించి మొదటి ఆరు అధ్యాయాలలో వివరించబడింది. Adyena śastena upāsakasya jivasya svarūpa-prāpti-sādhanaṁ ca pradhānaṁ niṁ proktam. బలదేవ విద్యాభూషణుడు, భగవద్గీత యొక్క చాలా చక్కని ప్రామాణిక వ్యాఖ్యాత, ఆయన చెబుతున్నారు మొదటి ఆరు అధ్యాయాల్లో, జీవుని యొక్క స్వరూపస్థితి చాలా చక్కగా వివరించబడింది. మరియు ఎవరైనా తమ స్వరూప స్థితిని ఎలా గ్రహించగలరో అది కూడా వివరించబడింది. కాబట్టి యోగ పద్ధతి అంటే తన స్వరూప స్థితిని అర్ధం చేసుకోవడం అని అర్ధం. Yoga indriya-saṁyamaḥ. మనము ఇంద్రియ కార్యక్రమాలలో మునిగి ఉన్నాము. భౌతిక జీవితం అంటే ఇంద్రియకార్యక్రమాల సమాహారము. మొత్తం ప్రపంచ కార్యక్రమాలన్నీ, మీరు వీధిలో కెళ్ళి గమనించినట్లయితే, మీరు అందరూ చాలా బిజీగా వుండడం గమనిస్తారు. దుకాణాదారుడు బిజీగా ఉంటాడు, మోటారు-డ్రైవర్ బిజీగా ఉంటాడు. అందరూ చాలా బిజీగా ఉన్నారు - ఎంత బిజీగా వున్నారంటే వారి కార్యక్రమాల్లో చాలా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇప్పుడు, ఎందుకు వారు బిజీగా ఉన్నారు? అనే విషయానికి వస్తే, మీరు వారి పనులను సూక్ష్మంగా అధ్యయనం చేస్తే, వారి ఏకైక కార్యక్రమం ఇంద్రియ తృప్తి. అంతే. అందరూ ఇంద్రియలను ఎలా సoతృప్తి పరచాలి అని బిజీగా ఉన్నారు. ఇది భౌతికము. మరి యోగ అంటే ఇంద్రియాలను నియంత్రించడము అని అర్థం, నా ఆధ్యాత్మిక స్థితిని , నా స్వరూపస్థితిని అర్థం చేసుకోవడం. ఎలాగంటే కేవలం ఆడడానికి అలవాటుపడిన ఒక పిల్లవాడు, అతను తన చదువు పట్ల శ్రధ్ధ పెట్టలేడు, తన భవిష్యత్తు జీవితాన్ని అర్ధం చేసుకోవడం గురించి, లేదా తనకు తనుగా ఉన్నత స్థానాన్ని పెంచుకోవడం గురించి ఆలోచించలేడు. అదేవిధముగా, మనము జీవితం యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోకుండా పిల్లల వలె వర్తించినట్లయితే, కేవలం ఇంద్రియ కలాపాల్లో నిమగ్నం అయితే,దానిని భౌతిక జీవనం అంటారు భౌతిక జీవనం మరియు ఆధ్యాత్మిక జీవనం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమంటే, ఎవరైనా కేవలం ఇంద్రియ తృప్తి కార్యక్రమాలలో నిమగ్నమైనప్పుడుతే, అది భౌతిక జీవనం అని పిలువబడుతుంది. అటువంటి అనేక వేలమంది భౌతిక వ్యక్తులలో, ఎవరైనా "నేను ఎవరు? నేను ఇక్కడ ఎందుకు వచ్చాను?" అని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూవుంటే, " నేను ఎందుకు జీవితం యొక్క అనేక బాధాకరమైన పరిస్థితులలో ఎందుకు ఉంచబడ్డాను?దీనికి ఏదైన పరిహారం ఉందా ...?" ఇటువంటి ప్రశ్నలు, అతనికి ఉదయించినప్పుడు,ఆచరణాత్మకంగా, అతని ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. మరియు మానవజీవితం అందుకోసమే ఉద్దేశించబడింది.