TE/Prabhupada 1008 - నా గురు మహారాజా నన్ను ఆదేశించారు పాశ్చాత్య దేశాలలో ఈ సంప్రదాయాన్ని ప్రచారము చేయండి
750713 - Conversation B - Philadelphia
నా గురు మహారాజా నన్ను ఆదేశించారు 'పాశ్చాత్య దేశాలలో ఈ సంప్రదాయాన్ని ప్రచారము చేయండి' అని శాండీ నిక్సాన్: మీరు ప్రతికూలతలతో ఎలా వ్యవహరిస్తారు? వెలుపల ప్రపంచంలో ... భక్తులు ప్రతి రోజు ప్రతికూలతను ఎదుర్కొంటారు, ఆసక్తి లేని వ్యక్తులును కలుస్తారు. ఎలా, కేవలం వెలుపల ప్రపంచంలో మాత్రమే కాదు, కాని ఆ లోపల ఉన్న దానితో కూడా ఎలా వ్యవహరిoచాలి? అలాంటి ప్రతికూలత నుండి ఎలా మనము ఉపశమనం పొందాలి?
ప్రభుపాద: ప్రతికూలత అంటే... ఉదాహరణకు మనము చెప్పినట్లుగా, "అక్రమ లైంగిక సంబంధం లేదు." మేము చెప్పుతాము మా విద్యార్థులకు బోధిస్తాము, "ఏ అక్రమ లైంగికం వద్దు అని." మీరు ఇది ప్రతికూలత అని అనుకుంటారా (ప్రక్కన: ) ఆమె అడుగుతున్న దానికి అర్థము ఏమిటి?
జయతీర్థ: పరిస్థితి ఏమిటంటే వేరే వారు అది ప్రతికూలమైనదని భావిస్తారు, అందువల్ల వారు మన పట్ల ప్రతికూలముగా భావిస్తారు. కాబట్టి మనము ఎలా దానికి స్పందించాలి, ఆమె చెప్తుంది శాండీ నిక్సాన్: సరే, మీరు ఎలా..., మీరు మీలో ఉన్న దానితో మీరు ఎలా వ్యవహరిస్తారు, మీకు తెలుసా?
రవీంద్ర- స్వరూప : ప్రతికూలత అంటే మీ అర్థము ఏమిటి?
శాండీ నిక్సన్: లేదు, లేదు, కేవలం విమర్శ కాదు, కాని ... మీ దగ్గరకు చాలా మంది వచ్చి వారు ఎల్లప్పుడు మీకు వ్యతిరేకంగా పని చేస్తుంటే... ఇక్కడ సానుకూలముగా ఉన్నవారు మీ చుట్టు ఉన్నవారు. వారు బలపరుస్తున్నారు. కాని బయట ప్రపంచంలోకి వెళ్ళితే అక్కడ ప్రజలు మీ శక్తిని తోడేస్తూ ఉంటే, ఆ స్థితిలో మీ శక్తిని తీసేసుకుంటూవుంటే, ఆ శక్తిని ఎలా తిరిగి పొందుతారు? ఎలా చేస్తారు ...
రవీంద్ర-స్వరూప: మనకు వ్యతిరేకంగా ఎంతో మంది ప్రజలు ఉన్నప్పుడు మనమెలా స్థిరముగా ఉంటాము?
ప్రభుపాద: హుహ్?
రవీంద్ర-స్వరుప: ఆమె మనకు వ్యతిరేకంగా ఎంతో మంది ఉన్నప్పుడు మనమెలా స్థిరముగా ఉంటాము అని తెలుసుకోవాలనుకుంటుంది.
ప్రభుపాద: కాబట్టి ఎవరూ మీకు వ్యతిరేకంగా లేరా? మీకు ఎవరూ వ్యతిరేకముగా లేరని అనుకుంటున్నారా? నేను నిన్ను అడుగుతున్నాను. శాండీ నిక్సాన్: ఎవరూ నాకు వ్యతిరేకంగా లేరని నేను భావిస్తున్నానా?, అవును, నా గురించి పట్టించుకోని, నాకు వ్యతిరేకంగా, ఉన్నవారు ఉన్నారు
ప్రభుపాద: వ్యతిరేకంగా ఉన్నవారు, సానుకులముగా ఉన్నవారు ఉన్నారు. ఎందుకు మీరు వ్యతిరేకంగా ఉన్న వారి గురించి ఆలోచిస్తారు మనకు వ్యతిరేకంగా కొంత మంది ఉన్నట్లు, మనకు సానుకులముగా చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యాచరణలో అదే స్థితి. కొంత మంది మనకు వ్యతిరేకంగా ఉంటే, ఎందుకు మనము దాని గురించి ఆలోచించాలి? మనకు సానుకూలముగా ఉన్న వారితో మనం కొనసాగుదాము. శాండీ నిక్సాన్: ఉదాహరణకు, రోజు పూర్తి అయిన తరువాత, భక్తుడు తనకు వ్యతిరేకముగా ఉన్న వారితోనే కలిస్తే ఆయన చెడు పరిచయాలను చేస్తాడు, ఆయన నిరుత్సాహము చెందుతాడు. ఆయన ఎలా....?
ప్రభుపాద: మా భక్తుడు అంత చంచలమైన వాడు కాదు. (నవ్వు) వారు మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఒక పుస్తకాన్ని కొనుగోలు చేయమని ఆయనను ప్రేరేపిస్తారు. మనము రోజువారీ పెద్ద మొత్తములో పుస్తకాలను విక్రయిస్తున్నాం. కాబట్టి మనకు వ్యతిరేకత అన్న ప్రశ్న లేదు. మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా కూడా, ఆయన ఒక పుస్తకం కొనుగోలు చేసేందుకు ఒప్పిస్తాము కాబట్టి ఆయన మనకు వ్యతిరేకంగా ఎలా ఉన్నాడు? ఆయన మన పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నాడు. (పక్కన :) రోజువారీ అమ్మకాలు మొత్తం ఎన్ని, మన పుస్తకాలు?
జయతీర్థ: మనము ఒక రోజు దాదాపు ఇరవై ఐదు వేల పుస్తకాలు మరియు పత్రికలు అమ్ముతాము.
ప్రభుపాద: ధర ఎంత?
జయతీర్థ: ఈ సేకరణ బహుశా ముప్పై అయిదు నుండి నలభై వేల డాలర్ల వరకు ప్రతి రోజు ఉంటుంది.
ప్రభుపాద: పుస్తకాలను విక్రయించడం ద్వారా రోజుకు నలభై వేల డాలర్లు వసూలు చేస్తున్నాం. వారు మనకు వ్యతిరేకంగా ఉన్నారని ఎలా చెప్పగలను?
శాండీ నిక్సన్: మీరు చాలా సానుకూలంగా ఉన్నారు. నేను దానిని ఇష్టపడుతున్నాను.
ప్రభుపాద: ఒక రోజులో నలభై వేల డాలర్లు విక్రయించగల ఇతర సంస్థ ఎక్కడ ఉంది? కాబట్టి వారు మనకు వ్యతిరేకంగా ఉన్నారని ఎలా చెప్తారు?
శాండీ నిక్సన్: నా చివరి ప్రశ్న. హరే కృష్ణ మంత్రం గురించి నాకు చెప్పగలరా, ఎందుకంటే ఇది కృష్ణ చైతన్యములో చాలా ముఖ్యమైనది, నేను మీ మాటల్లో వినాలనుకుంటున్నాను ...
ప్రభుపాద: ఇది చాలా సులభం. హరే అంటే "ఓ భగవంతుని యొక్క శక్తి", కృష్ణ అంటే "ఓ ప్రభు" అని అర్థము . మీ ఇద్దరు నన్ను మీ సేవలో నిమగ్నము చేయండి. అంతే. మీ ఇద్దరు, కృష్ణుడు మరియు ఆయన శక్తి ... ఉదాహరణకు ఇక్కడ మనకు పురుషుడు మరియు స్త్రీ అనే భావన ఉన్నది, అదేవిధముగా, మొదట, దేవుడు మరియు ఆయన శక్తి, దేవుడు మగవారు మరియు శక్తి స్త్రీ, ప్రకృతి మరియు పురుష. పురుషుడు, మరియు స్త్రీ, అనే ఈ ఆలోచన ఎక్కడ నుండి వస్తుంది? దేవుడు చాలా పురుషులను మరియు స్త్రీలను తయారు చేస్తున్నాడు. కాబట్టి పురుషుడు మరియు స్త్రీ అనే ఆలోచన, అది ఎక్కడ నుండి వస్తుంది? ఇది దేవుడు నుండి వస్తుంది. ఆయన ప్రతి దాని యొక్క మూలం. కాబట్టి స్త్రీ, లేదా ప్రకృతి, లేదా దేవుడి శక్తి, దేవుడిని... అయనను పురుష అని పిలుస్తారు. కాబట్టి మనము దేవుడికి మరియు ఆయన శక్తికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇద్దరు కలిపి, వారి సేవలో మనల్ని నిమగ్నము చేయండి. ఇది హరే కృష్ణ. ఓ హరే అంటే "దేవుడు యొక్క శక్తి," ఓ కృష్ణ, "ఓ ప్రభు, మీరు ఇద్దరు నా పై శ్రద్ధ వహించి, మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి. " అంతే. ఇది అర్థం. శాండీ నిక్సాన్: సరే, ధన్యవాదాలు. నాకు మధ్యలో కొంత అర్థము కాలేదు, నేను ఊహిస్తున్నాను.
ప్రభుపాద: ధన్యవాదాలు. శాండీ నిక్సాన్: నేను ఈ ఇంటిలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నాయి ... అప్పుడే భూమి నుండి బయటకు వచ్చాయి, అవి చూడటానికి చాలా అందముగా ఉన్నాయి.
ప్రభుపాద: మీ ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వబడిందా?
అన్నే జాక్సన్: నేను కొన్ని ప్రశ్నలను అడగవచ్చా? దయచేసి మీరు నాకు కొద్దిగా చెప్పండి మీ జీవితాన్ని గురించి , మీరు కృష్ణ చైతన్య ఉద్యమానికి ఆధ్యాత్మిక గురువు అని మీకు ఎలా తెలుసు?
ప్రభుపాద: నా జీవితం సరళంగా ఉంది. నేను ఒక్కప్పుడు గృహస్థుడిని. నాకు ఇప్పటికీ నా భార్య, నా పిల్లలు, నా మనవళ్లు ఉన్నారు. కాబట్టి నా గురు మహారాజా నన్ను ఆదేశించారు "పాశ్చాత్య దేశాలలో ఈ సంప్రదాయాన్ని ప్రచారము చేయండి." నేను గురు మహారాజ యొక్క అజ్ఞతో ప్రతిదీ వదిలివేసాను, నేను ఆజ్ఞను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే.
అన్నే జాక్సన్: ఈ చిత్రములో ఇక్కడ ఉన్న వ్యక్తేనా?
ప్రభుపాద: అవును, ఆయన నా గురు మహారాజు.
అన్నే జాక్సన్: ఆయన ఇప్పుడు జీవించిలేరా.
ప్రభుపాద: లేదు.
అన్నే జాక్సన్: ఆయన మీతో ఆధ్యాత్మికంగా మాట్లాడారా?
ప్రభుపాద: కాబట్టి ఇది నా లక్ష్యము (అస్పష్టముగా ఉన్నది). అంతే.
అన్నే జాక్సన్: ఏ సమయంలో ఆయన దీన్ని చేయమని చెప్పారు? మీ జీవితంలో ఇది చాలా ఆలస్యం అయింది. అయితే మీరు...?
ప్రభుపాద: అవును. నాకు ఇరవై అయిదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నేను మొదట ఆయనని కలిసాను. మొదటి సమావేశంలో ఆయన నాకు ఈ ఉత్తర్వు ఇచ్చారు. ఆ సమయంలో నేను వివాహం చేసుకొని ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాబట్టి నేను అనుకున్నాను "నేను తరువాత చేస్తాను" . కాని నేను కుటుంబ జీవితం నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను. కొంత సమయం పట్టింది. కాని నేను తన ఆజ్ఞ పాటించేందుకు నా ఉత్తమ ప్రయత్నము చేస్తున్నాను. 1944 లో నేను గృహస్తుడిగా ఉన్నప్పుడు, బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికను ప్రారంభించాను నేను 1958 లేదా '59 లో పుస్తకాలను రాయడం మొదలుపెట్టాను. ఈ విధముగా, 1965లో నేను మీ దేశానికి వచ్చాను.