TE/Prabhupada 1007 - కృష్ణ చైతన్యమునకు సంబంధించినంత వరకు మేము సమానంగా పంచుతున్నాము



750713 - Conversation B - Philadelphia


కృష్ణ చైతన్యమునకు సంబంధించినంత వరకు మేము సమానంగా పంచుతున్నాము

శాండీ నిక్సన్: ఇక్కడ మరొక లైన్ ఉంది. ఇక్కడ ఆ రకమైన మరొక రకమైన లైన్ ఉంది. మహిళల లిబ్ గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ? (నవ్వుతూ)

జయతీర్థ: మహిళల విముక్తి గురించి ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. మహిళల విముక్తి గురించి మన భావన ఏమిటి?

ప్రభుపాద: నేను చర్చించకూడదనుకుంటున్నాను ఎందుకంటే... (నవ్వు) వారు... మీరు అడిగారు కనుక, నేను వివరించవచ్చు, బుద్ధిహీనులైన స్త్రీలు తెలివైన పురషులచే ఎలా మోసగింపబడుతున్నారు. మీరు చూడండి?

స్త్రీ భక్తురాలు: శ్రీల ప్రభుపాద హరే కృష్ణ కీర్తన చేస్తున్న ప్రతి ఒక్కరినీ విముక్తి చేస్తున్నారు.

ప్రభుపాద: వారు ఇచ్చారు... మీ దేశంలో, వారు మీకు స్వేచ్ఛ ఇచ్చారు. లిబర్టీ అంటే సమాన హక్కులు అవునా కాదా? పురుషునికి మరియు స్త్రీకి సమాన హక్కులు ఉన్నాయి.

శాండీ నిక్సన్: వారు ఈ దేశంలో ప్రయత్నిస్తున్నారు.

ప్రభుపాద: అది సరే, ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు మహిళలు, మీరు చూడలేరు, ఈ సమాన హక్కు అని పిలువబడేది మహిళలను మోసము చేయడము అని అర్థం. ఇప్పుడు ఒక స్త్రీ మరియు పురుషుడు కలుస్తారు నేను మరింత స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు వారు ప్రేమికులుగా ఉంటారు. అప్పుడు వారు మైథునము చేస్తారు, ఆ స్త్రీ గర్భవతి అవుతుంది, ఆ పురుషుడు వెళ్లిపోతాడు. సాధారణ మహిళ, ఆమె పిల్లల బాధ్యతలు తీసుకోవలసి ఉంటుంది, ప్రభుత్వము నుండి బిచ్చం అడుక్కోవలసి ఉంటుంది, "నాకు డబ్బు ఇవ్వండి." ఇది మీ స్వాతంత్రం. ఇది స్వాతంత్రం అని మీరు ఒప్పుకుంటారా? ఆ స్త్రీ, స్త్రీ గర్భవతి అవుతుంది అతను ఏ బాధ్యత లేకుండా వెళ్ళిపోతాడు, ఆ బిడ్దను స్త్రీ వదలుకోలేదు; ఆమె ప్రభుత్వము నుండి భిచ్చము అడుక్కోవలసి ఉంటుంది లేదా ఆమె బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తుంది? ఇది చాలా మంచి స్వాతంత్రం అని మీరు అనుకుంటున్నారా? మీ సమాధానం ఏమిటి?

అన్నే జాక్సన్: ... పిల్లలను చంపడము మంచిదా కాదా? అదా మీ ప్రశ్న?

ప్రభుపాద: అవును, వారు ఇప్పుడు చంపుతున్నారు గర్భస్రావం చేస్తున్నారు.

రవీంద్ర-స్వరూప: ఆయన ఆ రకమైన స్వతంత్రతను తెలుసుకోవాలనుకుంటున్నాడు.

అన్నే జాక్సన్: పిల్లల కోసం?

రవీంద్ర-స్వరూప: స్త్రీకి. ప్రభుపాద: స్త్రీకి.

రవీంద్ర -స్వరూప: ఇది విముక్తి. ఆమెకు పురుషునితో సంబంధం ఉంది, ఆమె గర్భవతి అవుతుంది. పురుషుడు వదలి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె బిడ్దను పెంచడానికి మద్దతుగా ప్రభుత్వము దగ్గర భిక్ష అడుక్కోవలసి ఉంటుంది...

ప్రభుపాద: లేదా చంపాలి.

రవీంద్ర -స్వరూప: లేదా ఆమె పిల్లవానిని చంపుతుంది. కాబట్టి అది మంచిదా లేదా చెడ్డదా?

అన్నే జాక్సన్: సరే, ఆమె ఎంపిక చేసుకుంది ఆ విధముగా...

ప్రభుపాద: అంటే, అది ముప్పై నాలుగు ఔన్స్. మీరు మీ స్వంత బిడ్దను చంపడానికి మీరు ఎంపిక చేసుకున్నారు. అది చాలా మంచి ఎంపికనా?

శాండీ నిక్సన్: ఇది మీరు చేయగల అతి భయంకరమైన నేరము ఇది.

జయతీర్థ: ఆమె బుద్ధి పెద్దది అవుతుంది (నవ్వు)

ప్రభుపాద: ఇది మంచి పని మీరు అనుకుంటున్నారు? అహ్?

అన్నే జాక్సన్: ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న.

ప్రభుపాద: అందువల్ల వారు స్వతంత్రం అనే పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోలేరు. అందువలన ముప్పై నాలుగు ఔన్స్. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు స్వతంత్రంగా ఉన్నారని మీరు ఆలోచిస్తున్నారు.

శాండీ నిక్సన్: వారు స్వేచ్ఛతో వచ్చే బాధ్యతను మరచిపోతున్నారు.

ప్రభుపాద: అవును, వారు బాధ్యత తీసుకోరు. వారు వెళ్ళిపోతారు. వారు ఆనందించి దూరముగా వెళ్ళిపోతారు. మహిళ బాధ్యత తీసుకోవలసి ఉంటుంది చంపవలసి ఉంటుంది లేదా బిచ్చము అడుక్కోవలసి ఉంటుంది పోషించడానికి. మీరు బిచ్చము అడుక్కోవడం చాలా బాగుంటుందని భావిస్తున్నారా? భారతదేశంలో, వారు పేదరికములో ఉన్నప్పటికీ, ఇప్పటికీ, వారు స్వతంత్రంగా ఉండరు. వారు భర్త కింద ఉంటారు, భర్త బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి ఆమె బిడ్డను చంపదు లేదా బిడ్డను పోషించుకోవడానికి అడుక్కోదు . కావున ఏది స్వాతంత్ర్యం? భర్తతో ఉండటమా లేదా స్వేచ్ఛగా ఉండి ప్రతి ఒక్కరిచే ఆనందింపబడటమును స్వాతంత్రము అంటారా?

శాండీ నిక్సన్: ఏమైనా అక్కడ స్వేచ్ఛ లేదు. అక్కడ స్వేచ్ఛ లేదు.

ప్రభుపాద: కాబట్టి స్వేచ్ఛ లేదు; ఇప్పటికీ, వారు స్వేచ్ఛ ఉందని వారు భావిస్తున్నారు. అంటే ఏదో ఒక కారణము వలన, పురుషులు మహిళలను మోసం చేస్తున్నారు, అంతే. స్వాతంత్ర్యం పేరుతో, వారు మరొక తరగతిచే మోసం చేయబడటానికి అంగీకరించారు.ఇది పరిస్థితి.

శాండీ నిక్సన్: అయినప్పటికీ, మహిళలు కృష్ణుడిని తెలుసుకోవచ్చా...

ప్రభుపాద: మాకు ఇటువంటి వ్యత్యాసాలు లేవు.

శాండీ నిక్సన్: వ్యత్యాసం లేదా...

ప్రభుపాద: స్త్రీకి పురుషునికి సమానంగా కృష్ణ చైతన్యమును మేము ఇస్తాము. మేము అలాంటి వ్యత్యాసాన్ని చేయము. కానీ పురుషుని ఈ దోపిడీ నుండి వారిని కాపాడటానికి, మనము కొంత బోధిస్తాము, "మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి. మీరు వివాహం చేసుకోండి. స్థిరపడండి. స్వతంత్రంగా తిరగ వద్దు. "ఆ విధముగా వారికి మనము బోధిస్తాము. అయితే కృష్ణ చైతన్యమునకు సంబంధించినంత వరకు, మనము సమానంగా పంచుతాము. ఓ, నీవు స్త్రీవి, తక్కువ జ్ఞానము కలిగిన వారు లేదా తెలివైనవారు, అందువల్ల నీవు రాలేవు అని అటువంటి విషయము లేదు. మనము చెప్పము ఆ విధముగా. మహిళలను, పురుషులను, పేదవారిని, ధనవంతులను, ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తాము, ఎందుకంటే ఆ స్థితిలోనే సమానత్వం ఉంటుంది. Vidyā-vinaya-sampanne brāhmaṇe gavi hastini śuni caiva śvapāke ca paṇḍitāḥ sama-darśinaḥ ( BG 5.18) మనము ఎవరినీ తిరస్కరించము. అది సమానత్వం అంటే