TE/Prabhupada 0865 - మీరు దేశముగా తీసుకుంటున్నారు, కానీ శాస్త్రం దేశముగా కాదు, లోకములగా తీసుకొంటున్నది
750520 - Morning Walk - Melbourne
మీరు దేశముగా తీసుకుంటున్నారు, కానీ శాస్త్రం దేశం గురించి కాదు, లోకములను గురించి తీసుకొంటున్నది
పరమహంస: చాలా పుష్పించే రకాలు కాదా. ప్రభుపాద: కాదు, పుష్పించే వాటి గురించి మాట్లాడడము లేదు. నేను చెప్పేది ఏమిటంటే రకాలు, మొక్కలు, లతలు రెండు మిలియన్లని చెప్పాను. లక్ష - వింసతి. పది లక్షలు ఒక మిలియన్ కు సమానం. వింసతి, ఇరవై లక్షలకు.
హరి-సౌరి: నేను చదివే ఒక వార్తాపత్రికలో ఒక వ్యాసం ఉంది. వారు మనిషి పరిణామము గురించి ఒక కొత్త పుస్తకము ప్రకటనలు ప్రచారం చేస్తున్నారు. ఈ లోకములో సుమారు రెండు మిలియన్ల రకాలు ప్రాణులు ఉంటాయని వారు చెప్తున్నారు.ఇది శాస్త్రవేత్తల లెక్కింపు.
ప్రభుపాద: రెండు మిలియన్లా? లేదు. ఎనిమిది మిలియన్ల నాలుగు లక్షలు (84,00,000).
శృతకీర్తి: పద్మ-పురాణములో అన్ని జాతుల ప్రాణుల గురించి ప్రస్తావించారు అని మీరు మొన్నటి రోజున చెప్పారు.
ప్రభుపాద: అవును.
శృతికారి: వారు అందరి గురించి ఇచ్చారు.
ప్రభుపాద: వారు ప్రతి ఒక్క దాని గురించి ఇచ్చారా లేదా మొత్తం మాత్రమే ఇచ్చారా?
హరి-సౌరి: కేవలం ఉజ్జాయింపు.
శృతికారి: ఒక అంచనా.
హరి-సౌరి: (విరామము)... కోతి నుండి మనిషి పరిణామం అని పిలవబడే దాని యొక్క ఈ అగుపడని సంబంధము యొక్క చిత్రం. వారు ఒక వ్యక్తి వలె కనిపించే జాతి, ఒక చిత్రం ఇచ్చారు, కానీ ఒక గూని ఉన్న కోతి వలె ఉంది.వారు ఇది చెప్తున్నారు...
ప్రభుపాద: వారు అది ఎక్కడ నుండి పొందారు?
హరి-సౌరి: ... ఈ రకమైన వ్యక్తి మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్నాడని. (విరామం)
అమోఘ: 4,00,000 మానవ జాతులలో, ఒక దాని నుండి వేరొకటి వేరు చేసే ఉన్న లక్షణం ఏమిటి?మనము వారిని ఎలా గుర్తించగలం? లేదా మనం చేయగలమా?
ప్రభుపాద: మీరు వ్యక్తుల రకాలు చూడలేదా?
అమోఘ: అవును.
ప్రభుపాద: అప్పుడు, ఏమిటి...
అమోఘ: ఇది దేశంచే విభజించబడింది లేదా ఒక దేశంలో అనేక జాతులు ఉన్నాయి?
ప్రభుపాద: మీరు దేశాన్ని తీసుకుంటున్నారు, కానీ మన శాస్త్రం దేశాన్ని కాకుండా, విశ్వమంతా తీసుకుంటుంది. మీ ఆలోచన చాలా బలహీనమైనది: "దేశం," "జాతీయ." కానీ శాస్త్రంలో లేదు... జాతీయత అలాంటి విషయం లేదు. మొత్తం విశ్వమంతా మొత్తముగా వారు తీసుకుంటారు. వారు ఆ దృష్టి కోణం నుండి చూస్తారు. ఈ బలహీనమైన ఆలోచనలు, "రాష్ట్రం," "జాతీయం," తర్వాత వచ్చినవి. అక్కడ ఇంతకుముందు అటువంటి విషయం లేదు. ఒకే లోకము లేదా విశ్వం అలాంటిది. ఉదాహరణకు గత రాత్రి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయినది అది ఈ విశ్వాన్ని ఒక రాజు ఎలా పర్యవేక్షిస్తారు? ఇది వాస్తవానికి జరిగింది. మొత్తం విశ్వమంతా బ్రహ్మచే నిర్వహించబడుతుంది, ఒక వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకోవాలి.
భక్తుడు (1): మనం చూడగలము శ్రీల ప్రభుపాద, ప్రతి లోకంలో సంపద మరియు ఖనిజాల పంచడము ద్వారా, ప్రతి లోకము లో, అది ఒక పాలకుడిచే పాలించబడటానికి ఉంది. ఒక స్థలంలో అక్కడ బంగారం, ఒక స్థలంలో ధాన్యం పెరగడం. ఇది నిజామా?
ప్రభుపాద: లేదు ప్రతిచోటా ప్రతిదీ ఉంది, అయితే వేర్వేరు పరిమాణాల్లో ఉండవచ్చు.
హరి-సౌరి: ఈ విశ్వం లో బ్రహ్మ చేస్తున్న పరిపాలన, ఆయన అందరు ఇతర దేవతలతో సంబంధం ద్వారా చేస్తున్నాడా, వారు విభాగపు నాయకులు వలె? అందువలన ఆయన వ్యక్తిగతంగా ప్రతి విషయమును మార్గదర్శకత్వం చేయడము లేదు.
ప్రభుపాద: అవును, ఆయనకి అధిపతి బాధ్యత ఇవ్వబడింది. ఉదాహరణకు వేర్వేరు పనుల కోసం మనము వివిధ GBC లను కలిగి ఉన్నాము. అదేవిధముగా, వారు చక్కగా వారి కర్తవ్యము చేస్తున్నారు. ఈ గ్రహాలన్నీ వేర్వేరు దేవతల యొక్క వివిధ నివాస స్థానాలు. వారు మొత్తం విశ్వము యొక్క వ్యవహారాలను నియంత్రిస్తున్నారు. వారితో పోలిస్తే, ఈ మానవుడు దేనికీ పనికి రాడు. మనము నియంత్రించబడతాము; మనము నియంత్రికులము కాదు. అది వారు గ్రహించలేరు. ఆధునిక నాగరికత, వారు గ్రహించలేరు. వారు నియంత్రించబడుతున్నప్పటికీ వారు దానిని గుర్తించరు. అది లోపము