TE/Prabhupada 0795 - ఈ ఆధునిక ప్రపంచంలో, వారు చాలా చురుకుగా ఉన్నారు, కానీ వారు వెర్రిగా చురుకుగా ఉన్నారు
Lecture on SB 1.2.24 -- Los Angeles, August 27, 1972
ఉదాహరణ: మీ పని పూర్తి అవ్వాలనుకుంటే, అప్పుడు అగ్ని అవసరం. చెక్క కూడా అగ్ని యొక్క మరొక దశ; పొగ కూడా అగ్ని మరొక దశ. కానీ అగ్ని అవసరం, అదేవిధముగా, సత్వ గుణము యొక్క స్థితికి రావడానికి, అది అవసరం, ముఖ్యంగా ఈ మానవ రూపంలో. ఇతర రూపాల్లో, వారు ఎక్కువగా తమో గుణములో ఉంటారు. ఉదాహరణకు భూమి. కలప, వృక్షాలు ,మొక్కలను ఉత్పత్తి చేయడానికి భూమి శక్తిని కలిగి ఉంది, కానీ భూమి లో కొంత భాగము ఉంది, ఎడారి, ఏమీ ఉత్పత్తి చేయదు. ఇది శక్తిని కలిగి ఉంది. మీరు నీరు పోస్తే అది చెక్కను ఉత్పత్తి చేయగలిగిన శక్తిని కలిగి ఉంది, కానీ, దానిలో... అదేవిధముగా, తమో గుణములో, ఆ జీవులు, తమో గుణములో ఉన్నవారు, వారు సంపూర్ణ సత్యం గురించి ఎటువంటి అవగాహన కలిగిలేరు. అది సాధ్యం కాదు. తమో గుణము నుండి రజో గుణము వరకు క్రమంగా పరిణామం చెందటము. రజో గుణము, కొంత పని ఉంటుంది. ఉదాహరణకు జంతువులాగానే, అవి వాటి కార్యక్రమాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ఒక కుక్క వలె, మనము చూసినాము, బీచ్ లో మరియు ఇతర ప్రదేశాల్లో, చాలా వేగంగా ఇక్కడకి మరియు అక్కడకి పరిగెడుతుంది, కానీ అక్కడ అర్థం లేదు. ఒక కోతి చాలా చురుకుగా ఉంది. మీరు మీ దేశంలో మీరు కోతిని చూడలేదా. మా దేశంలో కోతులు ఉన్నాయి. అనవసరంగా కలత సృష్టిస్తున్నాయి. కానీ అవి చాలా చురుకుగా ఉన్నాయి. కానీ మనిషి, వారు చాలా చురుకుగా ఉండరు, కానీ వారు మనస్సును కలిగి ఉన్నారు, వారు మనస్సుతో పని చేస్తున్నారు.
కాబట్టి బుద్ధిహీన పనికి అర్థం లేదు. మనస్సు లేకుండా, కేవలం చురుకుగా ఉండటము, అది ప్రమాదకరమైనది. తెలివితో చేసే పని అవసరం. ఉదాహరణకు ఒక ఉన్నత-న్యాయస్థాన న్యాయమూర్తి వలె. ఆయనకు చాలా మొత్తము మొత్తాన్ని చెల్లించ బడతాడు, డబ్బును, కానీ ఆయన తన కుర్చీపై కూర్చుని కేవలం ఆలోచిస్తాడు. ఇతరులు అనుకోవచ్చు "మనము చాలా కష్టపడుతున్నాము, మనము గొప్ప జీతం పొందడము లేదు, ఈ మనిషి చాలా గొప్ప జీతం పొందుతున్నాడు. ఆయన కూర్చోవడం మాత్రమే చేస్తున్నాడు." బుద్ధిహీన పనులకు విలువ లేని కారణంగా. ఇది ప్రమాదకరమైనది. ఈ ఆధునిక ప్రపంచంలో, వారు చాలా చురుకుగా ఉన్నారు, కానీ వారు వెర్రిగా చురుకుగా ఉన్నారు, అజ్ఞానము మరియు రజో గుణములో, రజస్ తమస్. అందువలన గందరగోళం కర్మ ఉంది. మూర్ఖమైన పని, ప్రమాదము ఉంది. తెలివిగల పని అవసరం. ఎందుకంటే, ఉదాహరణకు మీరు అగ్ని యొక్క వేదికకు రాకపోతే తప్ప, మీరు భౌతిక వస్తువులను ఉపయోగించలేరు. అగ్ని అవసరం. అదేవిధముగా, మీ జీవితం విజయవంతం చేయడానికి, నీటిలో నివసించే జీవుల నుండి చెట్లకు, చెట్ల నుండి పురుగులకు, పురుగుల నుండి సరీసృపాలకు క్రమముగా పరిణామ విధానము ఉంది సరీసృపాల నుండి పక్షులకు, తరువాత పశువులకు, తరువాత మానవులకు, తరువాత నాగరిక జీవితమునకు. ఈ విధముగా, క్రమంగా, పరిణామం, మనము మానవ జీవిత స్థాయికి వస్తాము . వైదిక జ్ఞానము ఈ ఇతర జంతువుల కోసము కాదు, మానవులకు ఉద్దేశించబడింది