TE/Prabhupada 0027 - తదుపరి జన్మ ఉంది అని వారికి తెలియదు

Revision as of 14:49, 15 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0027 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on CC Adi-lila 7.1 -- Atlanta, March 1, 1975

కావున , ఆందోళనలచే నిండిన ఈ భౌతిక ప్రపంచం నందు మనిషి ప్రకృతి నియమాలైన జన్మ, మృత్యు, జరా, వ్యాదులచే బంధించబడినవాడై ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కాని, బద్ధ జీవుడు, మాయచే ప్రభావితుడై తన దేశం, సంఘం, స్నేహం మరియు ప్రేమ అనువాటిచే సురక్షితంగా ఉన్నానని అనుకుంటున్నాడు. కాని పైన చెప్పినవేవి తనని మరణం నుంచి కాపాడలేవని తెలిసికొనుటలేదు. దీనినే మాయ అని అంటారు. ఐనప్పటికీ బద్ధ జీవుడు దీనిని నమ్మడు. మాయ యొక్క ప్రభావంచే అతడు అసలు "రక్షించబడటం" అనే విషయాన్ని కూడా నమ్మడు. "రక్షించబడటం" అనగా , ఈ నిరంతరమైన జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందడం. కాని వారికి ఈ విషయము అసలు తెలియదు. భౌతిక ప్రక్రుతి నియమాలు ఎంత కఠినమైనవంటే !! మన దగ్గరున్నవేవీ మనల్ని భయంకరమైన చావు నుండి కాపాడలేవు. ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలుసు, మరియు ఇదే మన అసలైన సమస్య. చావంటే ఎవరికి మాత్రం భయం లేదు?? అందరికీ చావంటే భయం. ఎందుకు? ఎందుకంటే ప్రతీ జీవాత్మకి చావు లేదు. అది శాశ్వతం. కావున జనన, మరణ, జరా, వ్యాధి మొదలైన విషయాలు దానికి సమస్యలుగా మారాయి. ఎందుకంటే జీవాత్మ శాశ్వతం, దానికి పుట్టుక లేదు, న జాయతే , మరియు దేనికైతే పుట్టుక ఉండదో దానికి మరణం కూడా ఉండదు, న మృయతే కదాచిత్. ఇదియే మన నిజమైన స్థితి. కావుననే మనకి చావంటే భయం. ఇది మన సహజ సిద్ధ స్వభావం. కావున , మనల్ని మనం చావునుండి కాపాడుకోవడమే మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం గా మారింది. కేవలము ఈ కారణం చేతనే మేము ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నాము. అదియే ప్రతి వ్యక్తి యొక్క ప్రధాన ఉద్దేశ్యం కావాలి. అది శాస్త్ర సమ్మతం. ఎవరైతే సంరక్షకులుగా అంటే ... ప్రభుత్వం, తండ్రి, గురువు వీరంతా పిల్లల యొక్క సంరక్షకులు. వారికి ప్రపంచాన్ని రక్షించడం తెలిసి ఉండాలి. న మోచయద్ యః సముపేతాంమృత్యుం కావున, ఇటువంటి తత్వజ్ఞానం ప్రపంచంలో ఎక్కడ కలదు ? ఇటువంటి తత్వజ్ఞానం ఎక్కడా లేదు. కేవలం కృష్ణ చైతన్య ఉద్యమం లో మాత్రమే ఈ తత్వజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాము. ఈ జ్ఞానము నియమము లేనిది కాదు, ఇది శాస్త్రాలలో నిర్దేశించబడినది మరియు వేదం శాస్త్ర సమ్మతం. కావున ఇదే మా విన్నపం మనవ సమాజ శ్రేయస్సుకై మేము ప్రపంచమంతా చాలా కేంద్రాలని స్థాపిస్తున్నాము. ప్రస్తుత మానవ సమాజంలో వారికి జీవిత యొక్క అంతిమ లక్ష్యం మరియు మరణానంతరం మరొక జన్మ ఉంటుందన్నఈ విషయాలేవి వారికి తెలియవు. నిస్సందేహంగా మరొక జన్మనేది ఉంటుంది.మరియు తదుపరి జన్మ ఎలా ఉండాలో ఈ జన్మలోనే నిర్దేశించుకోవచ్చు. మీరు మరింత బౌతిక సుఖాలకై ఉన్నతమైన ఊర్థ్వ లోకాలకి వెళ్ళవచ్చు. అక్కడ మీరు సురక్షితమైన జీవితాన్ని గడపవచ్చు. సురక్షిత జీవితమ్ అనగా భౌతిక జీవితం. యాంతి దేవవ్రతా దేవాన్పితౄ న్యాన్తి పితృవ్రతాః భూతాని యాన్తి భూతేజ్య యాన్తి మద్యాజినోపిమాం, అని చెప్పినట్లుగా మీరు మీ తదుపరి జనంలో స్వర్గాలోకాల్లో మీ ఉన్నత సౌఖ్యాలకై ఈజన్మలోనే వాటికొరకు ప్రయత్నించవచ్చు. లేక ఈ లోకం లోని మంచి సమాజం కొరకు లేక భూత ప్రేత పిశాచాలు నివసించే లోకాలకు లేక మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉన్న లోకంకి వెళ్ళవచ్చు. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. యాన్తి భూతేజ్యా భూతాని మద్యాజినోపి యాన్తి మాం కేవలము మిమ్ములని మీరు నిర్దేశించుకోవాలి అంతే!! ఎలాగైతే మీ యవ్వనంలో చదువుకునే కొందరు ఇంజనీర్లు అవుతారు మరికొందరు డాక్టర్లు అవుతారు, న్యాయవాదులవుతారు, మరియు ఏదైనా వృత్తిలో స్థిరపడతారు. ఇవ్వన్ని వారు విద్యనభ్యసించడం ద్వారా పొందగలరు, అలాగే మరు జన్మలోని ఊన్నత స్థానానికై ఈ జన్మలోనే మీరు ప్రయత్నిచవచ్చును. ఇదేమంత అర్థంకాని కఠిన విషయం కాదు, కాని వీరు మరు జన్మ ఉంటుందని నమ్మరు. శ్రీకృష్ణ పరమాత్మ మరు జన్మ ఉన్నది అని చెప్పాడు కనుక మరు జన్మ ఉన్నది. మనము ఈ తత్వజ్ఞానాన్ని కొద్దిపాటి తెలివిని ఉపయోగించి మరుజన్మ ఉన్నాడని గ్రహించవచ్చు. కావున మా ప్రశ్న ఏమనగా , నీవు ఒకవేళ ఉత్తమమైన మరుజన్మకై ప్రయత్నిస్తుంటే మరి నీవు దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ నివసించే లోకాన్ని చేరుకునేందుకు ఎందుకు కష్టపడి ప్రయత్నించకూడదు ??? ఇదే మా ప్రశ్న!!