TE/Prabhupada 0027 - తదుపరి జన్మ ఉంది అని వారికి తెలియదు



Lecture on CC Adi-lila 7.1 -- Atlanta, March 1, 1975

కావున, భౌతిక ప్రపంచము లో బద్ధ స్తితిలో ఉన్న వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ, బద్ధ జీవుడు, మాయచే లేదా బాహ్య శక్తిచే ప్రభావితుడై తన దేశం, సంఘం, స్నేహం మరియు ప్రేమ అనువాటిచే రక్షించ బడుతున్నాను అని అనుకుంటున్నాడు. కానీ పైన చెప్పినవేవి తనని మరణం నుంచి కాపాడలేవని తెలిసికొనుటలేదు. దీనినే మాయ అని అంటారు. ఐనప్పటికీ అతను దీనిని నమ్మడు. మాయ యొక్క ప్రభావంచే అతడు అసలు "రక్షించబడటం" అనే పదము యొక్క అర్థమును కూడా నమ్మడు. రక్షించబడటం, రక్షించబడటం అనగా, ఈ నిరంతరమైన జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందడం. కానీ వారికి ఈ విషయము అసలు తెలియదు. భౌతిక ప్రకృతి నియమాలు ఎంత కఠినమైనవంటే మన దగ్గరున్నవేవీ !! మనల్ని భయంకరమైన చావు నుండి కాపాడలేవు. ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలుసు, మరియు ఇదే మన అసలైన సమస్య. చావంటే ఎవరికి మాత్రం భయం లేదు?? అందరికీ చావంటే భయం. ఎందుకు? ఎందుకంటే ప్రతీ జీవాత్మ చావడానికి ఉద్దేశించబడలేదు. అది శాశ్వతం. కావున జనన, మరణ, జరా, వ్యాధి మొదలైన విషయాలు అతనికి సమస్యలుగా మారాయి. ఎందుకంటే జీవాత్మ శాశ్వతం, అతను జన్మ తీసుకోడు, న జాయతే, మరియు ఎవరైతే జన్మ తీసుకోడో అతనికి మరణం కూడా ఉండదు, న మృయతే కదాచిత్. ఇదియే మన నిజమైన స్థితి. కావుననే మనకి చావంటే భయం. పరి ఇది మన సహజ ఆసక్తి.

కావున, మనల్ని మనం చావు నుండి కాపాడుకోవడమే మనిషి యొక్క ప్రథమ కర్తవ్యంగా మారింది. కేవలము ఈ కారణం చేతనే మేము ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నాము. అదియే ప్రతి వ్యక్తి యొక్క ప్రధాన ఉద్దేశ్యం కావాలి. అది శాస్త్రము యొక్క సూచన. ఎవరైతే సంరక్షకులుగా ఉన్నారో... ప్రభుత్వం, తండ్రి, గురువు వీరంతా పిల్లల యొక్క సంరక్షకులు. వారికి ప్రపంచములో ఎలా రక్షణ ఇవ్వాలో తెలిసి ఉండాలి. న మోచయద్ యః సముపేతాంమృత్యుం ( SB 5.5.18) కావున, ఇటువంటి తత్వజ్ఞానం ప్రపంచంలో ఎక్కడ కలదు ? ఇటువంటి తత్వజ్ఞానం ఎక్కడా లేదు. కేవలం కృష్ణ చైతన్య ఉద్యమంలో మాత్రమే ఈ తత్వజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాము. కల్పనలతో కాదు, ఇది ప్రామాణికమైన శాస్త్రాలలో నిర్దేశించబడినది మరియు వేద శాస్త్రము, ప్రామాణికులు కావున ఇదే మా విన్నపం మనవ సమాజ శ్రేయస్సుకై మేము ప్రపంచమంతా చాలా కేంద్రాలని స్థాపిస్తున్నాము. ప్రస్తుత మానవ సమాజంలో వారికి జీవితం యొక్క అంతిమ లక్ష్యం మరియు మరణానంతరం మరొక జన్మ ఉంది అని వారికి తెలియదు ఈ విషయాలేవి వారికి తెలియవు. నిస్సందేహంగా మరొక జన్మనేది ఉంది. మరియు తదుపరి జన్మ ఎలా ఉండాలో ఈ జన్మలోనే నిర్దేశించుకోవచ్చు. మీరు మరింత భౌతిక సుఖాలకై ఉన్నతమైన ఊర్థ్వ లోకాలకి వెళ్ళవచ్చు. అక్కడ మీరు సురక్షితమైన జీవితాన్ని గడపవచ్చు. సురక్షిత జీవితమ్ అనగా భౌతిక జీవితం. ఉదాహరణకు

yānti deva-vratā devān
pitṟn yānti pitṛ-vratāḥ
bhūtāni yānti bhūtejyā
mad-yājino 'pi yānti mām
(BG 9.25)

అని చెప్పినట్లుగా

మీరు మీ తదుపరి జనంలో స్వర్గాలోకాల్లో మీ ఉన్నతమైన జీవితముకై ఈ జన్మలోనే వాటికొరకు మీరు ప్రయత్నించవచ్చు. లేదా ఈ లోకం లోని మంచి సమాజం కొరకు లేదా భూత ప్రేత పిశాచాలు నియంత్రించే లోకాలకు లేదా మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉన్న లోకంకి వెళ్ళవచ్చు. ప్రతీదీ మీకు తెరిచి ఉంది. యాన్తి భూతేజ్యా భూతాని మద్యాజినోపి యాన్తి మాం కేవలము మిమ్ములని మీరు సిద్ధము చేసుకోవాలి అంతే!! ఎలాగైతే మీ యవ్వనంలో వారు చదువుకుంటారు కొందరు ఇంజనీర్లు అవుతారు కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు న్యాయవాదులవుతారు, మరియు మరి ఎంతో వృత్తిరీత్యా వ్యక్తులు వారు విద్యనభ్యసించడం ద్వారా సిద్ధమవుతున్నారు, అలాగే మరు జన్మలోని ఉన్నత స్థానానికై ఈ జన్మలోనే మీరు ప్రయత్నిచవచ్చును. ఇదేమంత అర్థంకానీ కఠిన విషయం కాదు, కానీ వారు మరో జన్మ ఉంటుందని నమ్మరు. ఇది లౌకిక జ్ఞానము అయినప్పటికీ వాస్తవానికి మరో జన్మ ఉన్నది ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు మనము ఈ తత్వజ్ఞానాన్ని కొద్దిపాటి తెలివిని ఉపయోగించడము ద్వారా మరు జన్మ ఉన్నదని మనము గ్రహించవచ్చు. కావున మేము ప్రచారము చేస్తున్నది ఏమనగా, నీవు ఒకవేళ మరు జన్మకై సిద్ధ పడటానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు మీరు శ్రమ తీసుకొని దేవాదిదేవుడు శ్రీ కృష్ణుని నివసించే లోకాన్ని చేరుకునేందుకు, తిరిగి భగవత్ ధామము వెళ్ళడానికి ఎందుకు కష్టపడి ప్రయత్నించకూడదు??? ఇదే మేము ప్రచారము చేస్తుంది