TE/Prabhupada 0028 - బుద్ధుడు భగవంతుడు

Revision as of 20:51, 15 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Turkish Pages with Videos Category:Prabhupada 0028 - in all Languages Category:TR-Quotes - 1970 Category:TR-Quotes - L...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970

గర్గముని:(చదువుతూ:) " కేవలం శాకాహారి అయినంత మాత్రాన ఇలా అనుకోవడం ప్రకృతి నియమాలను ఉల్లంగించి వారు వాళ్ళను రక్షించుకోగలరు అని అనుకోవడం తప్పు. కూరగాయలకు కూడా జీవితం ఉంటుంది. ఒకరి జీవితం ఇంకొకరికి ఆహారన్ని ఇవ్వడానికే. అది ప్రకృతి ధర్మం. నిభదుడ్డైన శాకాహారి అని ఒకరు గర్వ పడకూడదు. మహోనత్తమైన భగవంతుడిని గుర్తించడం ఇక్కడ ఉన్న విషయం. జంతువులకు భగవంతుడిని గుర్తించ గల మనస్సు అభివృద్ధి చెందలేదు. కానీ మనిషికి ఆ మనస్సు ఉంది.

ప్రభుపాద: అది ముఖ్యమైన విషయం. బుద్ధులు వలె, వారు కూడా శాకాహారులు. బుద్ధ సూత్రం ప్రకారం.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి క్షీణించాయి, కానీ బుద్ధ భగవంతుడి ప్రచారము ఈ వెధవలను కనీసం జంతు హత్యలను చేయడం నివారించడానికి. అహింస పరమో ధర్మ. శ్రీమద్ -భాగవతం లో మరియు చాలా వేదముల సాహిత్యాలలో బుద్ధ భగవానుడి అవతారం వివరించబడింది. సుర-ద్విసం . ఆయన రాక్షసులను మోసం చేయడానికి వచ్చాడు . ఆ రాక్షసులను మోసం చేసే విధంగా ఆయన ఒక విధానాన్ని తయారు చేశాడు ఆయన ఎలా మోసం చేసాడు? రాక్షసులు, దేవునికి వ్యతిరేకము కదా. వారు భగవంతుడిని విశ్వసించరు. కావున బుద్ధ భగవానుడు ఈ విధముగా ప్రచారం చేసాడు, "అవును భగవంతుడు లేడు . కానీ నేను చెప్పేది పాటించండి. "అవును, అయ్యా" కాని ఆయన భగవంతుడు. ఇది మోసము . అవును. వారు భగవంతుడుని నమ్మరు, కానీ బుద్ధుడిని విశ్వసిస్తున్నారు, మరియు బుద్ధుడు దేవుడు . కేశవ-ద్రుత-బుద్ధ-సరిర జయ జగదిస హరె. కావున అది రాక్షసుడికి మరియు భక్తుడికి తేడా. ఒక భక్తుడు కృష్ణ, కేశవ ఆ వెధవలను మోసం చేయడం భక్తుడు చూస్తాడు . భక్తుడు అర్థం చేసుకోగలడు . కానీ రాక్షసులు అనుకుంటారు, " ఓహ్, మనకు గొప్ప నాయకుడు వచ్చాడు . ఆయన భగవంతుడిని నమ్మరు. (నవ్వులు) మీరు చుడండి? సంమోహాయ సుర-ద్విసం (SB 1.3.24). శ్రీమద్ భాగవతం లో సరైన సంస్కృత పదం ఉంది. మీరు చూసారు, ఎవరైతే సంమోహాయ చదివారో, చిరాకు కలిగించే సురా-ద్విసం. వైష్ణవులను ద్వేషించే వ్యక్తులను సుర-ద్విసం అంటారు. భగవంతుడిని నమ్మని వారు, రాక్షసులు, వారు ఎల్లప్పుడూ భక్తులు పై ద్వేషంతో ఉంటారు. అది ప్రకృతి ధర్మము. మీరు ఈ తండ్రి ని చుడండి. తండ్రికి తన అయిదు సంవత్సరాల కొడుకు విరోధి అయ్యాడు. అతను తప్పు ఏంటి? అతను కేవలం భక్తుడు. అంతే. అమాయకపు బాలుడు. నేను చెప్పేది ఏమిటంటే , అతను హరే కృష్ణ మంత్రము జపిస్తూ ఆకర్షిస్తున్నాడు. అతని తండ్రి తనే అతనికి పరమ విరోధి అయ్యాడు: "ఈ బాలుడిని చంపండి." కావున తండ్రే శత్రువు అయితే, మిగితా వారి గురించి ఏమి మాట్లాడాలి. కావున మీరు ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి మీరు భక్తుడు అయిన వెంటనే సమస్త ప్రపంచం మీ శత్రువు అవుతుంది. అంతే. కానీ మీరు వాటిని అన్నిటిని ఎదుర్కొని పరిష్కరించుకోవాలి, ఎందుకంటే మీరు భగవంతుడి సేవకులుగా నియమించబడ్డారు. అందరికి జ్ఞానం కలిగించడం మీ పని. కావున మీరు కేవలం భగవంతుడు నిత్యానంద లాగా ఉండలేరు. ఆయన గాయ పడ్డారు, కానీ ఆయన జగై-మధై బాగు చేసారు. అది మీ నియమం అయ్యి ఉండాలి. కొన్నిసార్లు మనము మోసం చెయ్యాలి, కొన్నిసార్లు మనము గాయపడాలి - ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలను కృష్ణ చైతన్యము ఎలా చెయ్యాలి అనేది ఉపాయము. అది మన లక్ష్యము. ఏదోవిధంగా ఈ వెధవులను కృష్ణ చైతన్యులను చెయ్యాలి, ఈ విధంగానో లేదా ఆ విధంగానో .