TE/Prabhupada 0028 - బుద్ధుడు భగవంతుడు
Lecture on Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970
గర్గముని:(చదువుతూన్నాడు:) " కేవలం శాకాహారి అయినంత మాత్రాన ఇలా అనుకోవడం తప్పు ప్రకృతి నియమాల నుంచి వారు వాళ్ళను రక్షించుకోగలరు అని అనుకోవడం తప్పు. కూరగాయలకు కూడా జీవితం ఉంటుంది. ఒకరి జీవితం ఇంకొకరికి ఆహారాన్ని ఇవ్వడానికే ఉద్దేశించబడినది అది ప్రకృతి ధర్మం. నిబద్ధుడైన శాకాహారి అని ఒకరు గర్వ పడకూడదు. మహోన్నతమైన భగవంతుడిని గుర్తించడం ఇక్కడ ఉన్న విషయం. జంతువులకు భగవంతుడిని గుర్తించ గల మనస్సు అభివృద్ధి చెందలేదు. కానీ మనిషికి ఆ మనస్సు ఉంది..
ప్రభుపాద: అది ముఖ్యమైన విషయం. ఉదాహరణకు భౌద్ధుల వలె, వారు కూడా శాకాహారులు. బుద్ధ సూత్రం ప్రకారం.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటీ క్షీణించాయి, కానీ బుద్ధ భగవంతుని ప్రచారము ఈ మూర్ఖులను కనీసం జంతు హత్యలను చేయడం నివారించడానికి. అహింస పరమో ధర్మ. శ్రీమద్ -భాగవతం లో మరియు చాలా వేదముల సాహిత్యాలలో బుద్ధ భగవానుని అవతారం వివరించబడింది. సుర-ద్విసం. ఆయన రాక్షసులను మోసం చేయడానికి వచ్చాడు. ఆ రాక్షసులను మోసం చేసే విధంగా ఆయన ఒక విధానాన్ని తయారు చేశాడు ఆయన ఎలా మోసం చేసాడు? రాక్షసులు, భగవంతునికి వ్యతిరేకము. వారు భగవంతుని విశ్వసించరు. కావున బుద్ధ భగవానుడు ప్రతిపాదించినారు ఈ విధముగా ప్రచారం చేసాడు, "అవును భగవంతుడు లేడు. కానీ నేను చెప్పేది పాటించండి. అవును, అయ్యా కానీ ఆయన భగవంతుడు. ఇది మోసము. అవును. వారు భగవంతుని నమ్మరు, కానీ బుద్ధుడిని విశ్వసిస్తున్నారు, మరియు బుద్ధుడు భగవంతుడు. కేశవ-ధృత-బుద్ధ-శరీర జయ జగదీశ హరే. కావున అది రాక్షసుడికి మరియు భక్తుడికి తేడా. ఒక భక్తుడు కృష్ణ, కేశవ ఆ మూర్ఖులను మోసం చేయడం భక్తుడు చూస్తాడు. భక్తుడు అర్థం చేసుకోగలడు. కానీ రాక్షసులు అనుకుంటారు, "ఓహ్, మనకు గొప్ప నాయకుడు వచ్చాడు. వారు భగవంతుడిని నమ్మరు. (నవ్వులు) మీరు చుడండి? సమ్మోహాయ సుర-ద్విసం ( SB 1. 3.24) శ్రీమద్ భాగవతం లో సరైన సంస్కృత పదం ఉంది. మీరు చూసారు, ఎవరైతే చదివారో, సమ్మోహాయ సుర-ద్విసమును చిరాకు కలిగించేందుకు. వైష్ణవులను ద్వేషించే వ్యక్తులను సుర-ద్విసం అంటారు. భగవంతుడిని నమ్మని వారు, రాక్షసులు, వారు ఎల్లప్పుడూ భక్తులపై ద్వేషంతో ఉంటారు. అది ప్రకృతి ధర్మము. మీరు ఈ తండ్రిని చూడండి. తండ్రి తన అయిదు సంవత్సరాల కొడుకుకు విరోధి అయ్యాడు. అతని తప్పు ఏంటి? అతను కేవలం భక్తుడు. అంతే. అమాయకపు బాలుడు. చాలా సరళమైన వాడు నేను చెప్పేది ఏమిటంటే, అతను హరే కృష్ణ మంత్ర జపమునకు ఆకర్షితుడు అయినాడు. అతని తండ్రి తనే అతనికి పరమ విరోధి అయ్యాడు: "ఈ బాలుడిని చంపండి." కావున తండ్రే శత్రువు అయితే, మిగితా వారి గురించి ఏమి మాట్లాడాలి. కావున మీరు ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి మీరు భక్తుడు అయిన వెంటనే సమస్త ప్రపంచం మీ శత్రువు అవుతుంది. అంతే. కానీ మీరు వాటిని అన్నిటిని ఎదుర్కొని పరిష్కరించుకోవాలి, ఎందుకంటే మీరు భగవంతుని సేవకులుగా నియమించబడ్డారు. అందరికీ జ్ఞానం కలిగించడం మీ పని. కావున మీరు ఉండలేరు . ఉదాహరణకు నిత్యానంద ప్రభు. ఆయన గాయ పడ్డాడు, కానీ ఆయన జగాయ్-మాధాయ్ ని విముక్తులను చేసినాడు. అది మీ నియమం అయ్యి ఉండాలి. కొన్నిసార్లు మనము మోసం చెయ్యాలి, కొన్నిసార్లు మనము గాయపడాలి - ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలకు కృష్ణ చైతన్యము ఎలా ఇవ్వాలి అనేది సాధన చేయాలి. అది మన లక్ష్యము. ఏదోవిధంగా ఈ మూర్ఖులను కృష్ణ చైతన్యులను చెయ్యాలి, ఈ విధంగానో లేదా ఆ విధంగానో.