TE/Prabhupada 0283 - మన కార్యక్రమము ప్రేమించడము
Lecture -- Seattle, September 30, 1968
ప్రభుపాద: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. భక్తులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. ప్రభుపాద:మనకార్యక్రమము ప్రేమతో భక్తితో గోవిందుడిని ఆరాధించడం, అసలైన వ్యక్తిని. Govindam ādi-puruṣaṁ. ఇది కృష్ణ చైతన్యము. మనము కృష్ణుడిని ప్రేమించమని ప్రజలకు ప్రచారము చేస్తున్నాము, అంతే. మా కార్యకార్యక్రమము ప్రేమించడము, సరైన పరిస్థితిలో మీ ప్రేమను ఉంచడము, .మన కార్యక్రమము. ప్రతిఒక్కరూ ప్రేమించాలని కోరుకుంటారు, కానీ అయిన ప్రేమను తప్పుగా ఉండటం వలన అతడు విసుగు చెందుతాడు. ప్రజలు దానిని అర్థం చేసుకోలేరు. వారికి నేర్పించారు, "మొదట, మీరు మీ శరీరాన్ని ప్రేమించండి." తరువాత కొద్దిగా విస్తరించండి, "మీరు మీ తండ్రిని తల్లిని ప్రేమించండి." అప్పుడు "నీ సహోదరిని సహోదరుణ్ణి ప్రేమించoడి." తరువాత "మీ సమాజాన్ని ప్రేమిoచoడి, మీ దేశాన్ని ప్రేమిoచoడి, మానవ సమాజాన్ని, మానవజాతిని ప్రేమిoచoడి." కానీ ఈ ప్రేమ, అని పిలవబడే ఈ ప్రేమ, మీకు సంతృప్తిని ఇవ్వదు మీరు కృష్ణుడిని ప్రేమిoచే స్థాయికి చేరుకోకపోతే. అది మీకు సంతృప్తిని ఇవ్వదు. నీటి సరస్సులో నీవు ఒక రాయిని విసిరినట్లయితే, అక్కడ వెంటనే ఒక వృత్తం ప్రారంభమవుతుంది. వృత్తం విస్తరిస్తుంది విస్తరిస్తుంది,విస్తరిస్తుంది, విస్తరిస్తోంది, వృత్తం తీరాన్ని తాకినప్పుడు, అది ఆగిపోతుoది. వృత్తం ఒడ్డు లేదా నీటి రిజర్వాయర్ యొక్క ఒడ్డుకు చేరుకోకపోతే, అది పెరుగుతుపోతుoది. మనము పెంచుకోవాలి. పెంచుకోవాలి. పెరుగుదల అంటే రెండు మార్గాలున్నాయి. మీరు ఆచరించినట్లయితే, "నేను నా సమాజాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశంను ప్రేమిస్తున్నాను, నేను నా మానవ దేశంను ప్రేమిస్తున్నాను, తరువాత" జీవులను, " ఇ విధముగా ... కానీ మీరు నేరుగా కృష్ణుడిని తాకితే, అప్పుడు ప్రతిదీ ఉంటుoది. ఇది చాలా బాగుంది. ఎందుకంటే కృష్ణుడు అందరి కంటే ఆకర్షణీయమైవాడు, ప్రతిదీ కలిగి ఉన్నాడు. ఎందుకు ప్రతిదీ? ఎందుకంటే కృష్ణుడు కేంద్రం. ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు, మీరు మీ తండ్రిని ప్రేమిస్తే, మీ సోదరులను, సోదరీమణులను, మీ తండ్రి సేవకులను ప్రేమిస్తారు, మీ తండ్రి యొక్క ఇంటిలో, మీ తండ్రి భార్యను, అనగా, మీ తల్లి, ప్రతి ఒక్కరూ. కేంద్ర బిందువు తండ్రి. ఇది ముడి ఉదాహరణ. అదేవిధంగా, మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, మీ ప్రేమ ప్రతిచోటా విస్తరించబడుతుంది. మరొక ఉదాహరణ, మీరు ఒక చెట్టును ప్రేమిస్తే, ఆకులు, పువ్వులు, కొమ్మలు, ప్రతిదీ మీరు వేరు మీద నీరు పోయాలి, అప్పుడు చెట్టు మీద, మీ ప్రేమ సహజముగా అన్నిటికి సేవలను అందిస్తుంది. మీరు మీ దేశస్థులను ప్రేమిస్తే, మీ దేశస్థుడు విద్యావంతులు అవ్వాలని మీరు చూడాలనుకుంటే, ఆర్థికంగా, మానసికంగా, శారీరికంగా అభివృద్ధి చెందాటానికి అప్పుడు, మీరు ఏమి చేస్తారు? మీరు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. మీరు మీ ఆదాయం పన్నును దాచరు. మీరు కేంద్ర ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు, ఆది విద్యా విభాగానికి పంపిణీ చేయబడుతుంది, రక్షణ శాఖకు, పరిశుభ్రత శాఖకు, ప్రతి ఒక్క శాఖకు. అందువలన ... ఇవి ముడి ఉదాహరణలు, కానీ వాస్తవానికి, మీరు ప్రతిదానిని ప్రేమించాలని కోరుకుంటే, అప్పుడు మీరు కృష్ణుడిని ప్రేమిస్తారు. ఆది సంపూర్ణము కనుక, మీరు నిరాశ చెందరు. మీ ప్రేమ సంపూర్ణమయినప్పుడు, మీరు నిరుత్సాహపడరు. ఉదాహరణకు మీరు పూర్తి ఆహారం తీసుకొని ఉంటే. మీరు ఆహారాముతో సంతృప్తిపడినట్లయితే, "నేను సంతృప్తి చెందిన్నాను, నాకు ఇక ఏమాత్రం అవసరము లేదు." అని చెప్పుతారు