TE/Prabhupada 0709 - భగవన్ యొక్క నిర్వచనం

Revision as of 09:44, 7 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0709 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Bombay, January 13, 1973


భగవాన్. భగవన్ నిర్వచనం ఉంది. ఏ దుష్టుడు తాను భగవన్ అని ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఆయన భగవన్ అవుతాడు అని కాదు వ్యాసదేవుని యొక్క తండ్రి పరాశరముని, మనకు భగవన్ యొక్క అర్థం ఇచ్చారు. భగ అనగా ఐశ్వర్యము, వాన్ అంటే కలిగిన వ్యక్తి అని అర్థం. ఉదాహరణకు మనము ఆచరణాత్మక అనుభావన్ని కలిగి ఉన్నట్లుగానే. ఎవరైనా చాలా ధనవంతుడైన వ్యక్తి ఆయన చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఆయన ఆకర్షణీయంగా మారతాడు. చాలామంది వ్యక్తులు ఆయన దగ్గరకు కొంత సహాయం కోసం వెళతారు. చాలా ప్రభావవంతమైన వ్యక్తి, ఆయన చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. చాలా ప్రసిద్ది చెందిన వ్యక్తి, ఆయన ఆకర్షణీయంగా ఉంటాడు. చాలా జ్ఞానము కలిగిన వారు ఎవరైనా, తెలివైన, ఆయన ఆకర్షణీయంగా ఉంటాడు. చాలా తెలివైనవాడు, ఆయన ఆకర్షణీయంగా ఉంటాడు. సన్యాస ఆశ్రమము లో ఉన్నవారు... సన్యాస ఆశ్రమము అంటే ఎవరైతే ప్రతిదీ కలిగి ఉన్నవాడు కానీ త్యజించిన వాడు, తన వ్యక్తిగత ప్రయోజనము కోసం దానిని ఉపయోగించరు. ఉదాహరణకు చాలా దానములు చేసే ఒక వ్యక్తి వలె, ఆయన ప్రజలకు ప్రతీది ఇస్తాడు. ఆయన చాలా ఆకర్షణీయమైనవాడు.

కాబట్టి ఈ ఆరు రకాల ఆకర్షణలు ఉన్నాయి. కాబట్టి భగవన్ అనగా ఈ ఆకర్షణీయమైన లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు, అతడు భగవాన్. రహదారిలో పని లేకుండా తిరిగే మూర్ఖుడు దుష్టుడు భగవాన్ అవ్వటము కాదు. ఇది తప్పుదోవ పట్టిస్తుంది. భగవాన్ పదం అంటే అర్థం ఏమిటో మనకు తెలియదు; అందువల్ల భగవాన్ గా ఏ దుష్టుడిని అయినా మనము అంగీకరిస్తాము. Aiśvaryasya samagrasya (Viṣṇu Purāṇa 6.5.47). ఐశ్వర్యములు. బొంబాయి నగరంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ "ఎవరూ నా దగ్గర ధనము అంతా ఉందని చెప్పరు. బ్యాంకు లో ఉన్న డబ్బు అంతా లేదా బొంబాయిలో ఉన్న డబ్బు అంతా నా డబ్బు. " ఎవరూ చెప్పలేరు. కానీ కృష్ణుడు చెప్పగలడు. ఐశ్వర్యస్య సమగ్రస్య . సమగ్ర అంటే సంపద , దానిలో కొంత భాగం కాదు. Samagra. Aiśvaryasya samagrasya vīryasya. శక్తి, ప్రభావం, వీర్యస్య. యశస్సు, కీర్తి, పేరు అయిదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఈ భగవద్-గీతను చెప్పినారు కానీ ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా పూజిస్తారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా. భగవద్గీత ధర్మము లేదా విశ్వాసముతో సంబంధం లేకుండా ఏ దేశంలోనైనా అందరికీ తెలుసును . అందరు, ఏ మేధస్సు కలిగిన మనిషి, ఏ పండితుడైనా, ఏ తత్వవేత్త అయినా భగవద్-గీతను చదువుతారు. దీని అర్థం కృష్ణుడు చాలా ప్రసిద్ది చెందిన వాడు. అందరికి తెలుసు.

కావున ఐశ్వర్యస్య. ఆయన ఉన్నప్పుడు, ఆయన తన ధనమును చూపించాడు. కృష్ణుడు తన పదహారు వేల భార్యలను, 16,108 భార్యలను ఎలా చూసుకుంటున్నాడో చూద్దామని నారద ముని కోరుకున్నాడు. కాబట్టి నారద ముని వచ్చినప్పుడు, ఆయన ప్రతి రాజభవనంలోకి ప్రవేశించాడు. 16,108 రాజభవనాలు, అన్ని పాలరాతి రాజభవనాలు, ఆభరణాలతో నిండినవి. రాత్రి పూట విద్యుత్ లేదా కాంతి అవసరం లేదు, అన్ని రాజభవనాలు ఆభరణాలతో పొదిగి ఉన్నాయి. ఇంటిలోని సామగ్రి అంతా దంతాలు మరియు బంగారముతో తయారు చేశారు. ఐశ్వర్యములు. తోటలు పారిజాత చెట్లతో నిండి ఉన్నాయి. అంతేకాదు, నారద ముని చూశారు కృష్ణుడు అక్కడ ఉండటము ప్రతి ఒక్క భార్యతో, ఆయన వివిధ రకాల పనులను కూడా చేస్తున్నాడు. ఒక చోట ఆయన తన భార్య, పిల్లలతో కూర్చొని ఉన్నాడు. మరొక చోట, అక్కడ ఆయన పిల్లల వివాహం వేడుక జరుగుతోంది. కొంత మంది... చాలా మంది, అందరూ. ఒకే రకమైన పనిలో కాదు. కాబట్టి ఇది ఐశ్వర్యం, ధనము అంటారు. కొన్ని బంగారు తులాలను కలిగి ఉండటము వలన, అతడు భగవంతుడు అవుతాడు. కాదు Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29) suhṛdam... నేను మహోన్నతముగా ఆనందించే వాడిని అని కృష్ణుడు ప్రకటించాడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram. నేను అన్ని లోకములకు యజమానిని. ఇది సంపద అంటే. శక్తి, మనము బలం మరియు శక్తి గురించి అలోచిస్తే, కృష్ణుడు, ఆయన మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు, ఆయన తల్లి యొక్క ఒడిలో, ఆయన చాలా రాక్షసులను చంపాడు