TE/Prabhupada 0739 - శ్రీ చైతన్య మహా ప్రభు కోసం చాలా చక్కని ఆలయాన్ని నిర్మించాలని మనము ప్రయత్నిస్తున్నాము

Revision as of 04:19, 6 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0739 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on CC Adi-lila 1.6 -- Mayapur, March 30, 1975


ఈ విధంగా చైతన్య-చరితామృతం రచయిత, కృష్ణ దాస కవిరాజ గోస్వామి, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ కారణమును వివరిస్తున్నారు. కారణం ఏమిటంటే కృష్ణుడు తెలుసుకోవాలనుకున్నాడు, "రాధారాణిలో ఏమి ఉంది?" ఆయన మదన-మోహన. కృష్ణుడికి మరో నామము... ఆయన ఆకర్షణీయమైనవాడు. అందరికీ కృష్ణుడు ఆకర్షణీయమైనవాడు; ఆయన మన్మధుడికి కూడా, ఆకర్షణీయంగా ఉంటాడు. మదన భౌతిక ప్రపంచంలో ఆకర్షణీయంగా ఉంటాడు, ఆయన మదన-మోహన. రాధారాణి మదన-మోహన-మోహిని, అంటే ఆమె మదన-మోహనను కూడా ఆకర్షిస్తుంది. అందుచేత కృష్ణుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, రాధారాణి లో ఏమి ఉంది ఆమె ఆకర్షించడానికి? నేను మొత్తం విశ్వాన్ని ఆకర్షిస్తాను, ఆమె నన్ను ఆకర్షిస్తుంది.

" ఈ భావనతో, శ్రీ చైతన్య మహా ప్రభు, tad-bhāvāḍhyaḥ lobhāt. ఇవి అన్ని ఆధ్యాత్మిక ప్రేమ వ్యవహారాలు : అర్థం చేసుకోవడానికి దురాశ కావాలి. Tad-bhāvādhyaḥ samajani: "ఆయన తల్లి శచి గర్భంలో ఆవిర్భవించారు." Samajani śacī-garbha-sindhau harīnduḥ. హరి, భగవంతుడు ,చంద్రుని వంటి వాడు. కాబట్టి మాయపూర్-చంద్రోదయ ఆలయాన్ని మనము స్థాపించాము. కాబట్టి ఈ ఆలోచన, శ్రీ చైతన్య మహా ప్రభు కేవలం చంద్రుని వంటి వాడు. శ్రీ చైతన్య మహా ప్రభు, ఆయన మాయాపూర్ లో ఆవిర్భవించారు; అందువల్ల ఆయనను "చంద్రుడు" అని అంటారు. అందుచే మనము చంద్ర, మాయపూర్-చంద్ర అని అంటాము ఇప్పుడు, శ్రీ మాయాపూర్-చంద్రునిగా ఉదయిస్తున్నాడు... ఉదయిస్తున్నాడు. ఉదయిస్తున్నాడు అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా చంద్ర కాంతిని ప్రసరిస్తున్నాడు. ఇది ఆలోచన, చంద్రుని కాంతి. Śreyaḥ-kairava candrikā-vitaraṇam. Śreyaḥ-kairava. చైతన్య మహా ప్రభు వ్యక్తిగతంగా చెప్పారు. మీ గదిలో శ్రీ చైతన్య మహా ప్రభుని దాచి ఉంచవద్దు, కొన్ని ద్రవ్య లాభాలను పొందకండి. ఇది అవసరం లేదు. ఇది అవసరం లేదు.

మీరు శ్రీ చైతన్య మహా ప్రభువు కీర్తి మరింత పెరగడానికి తోడ్పడాలి కాబట్టి ఈ సూర్యుడు, చంద్రుని కాంతి, ప్రపంచ వ్యాప్తంగా ప్రచారము చేయబడవచ్చు. అది కావలసినది. అందువలన ఈ ఆలయం ఉంది. అయితే, శ్రీ చైతన్య మహా ప్రభు కోసం చాలా చక్కని ఆలయాన్ని నిర్మించాలని మనము ప్రయత్నిస్తున్నాము. ఈ రోజు ఉదయం మనం ఆలోచిస్తున్నాం. ఈ ధామము నుండి, ఈ చంద్రుడు, శ్రీ కృష్ణ చైతన్య మహా ప్రభు, పంపిణి చేస్తారు. Śriya-kairava-candrikā-vitaraṇa vidyā-vadhū-jīvanam. శ్రీ చైతన్య మహా ప్రభు యొక్క హరే కృష్ణ ఉద్యమం... Paraṁ vijāyate śrī-kṛṣṇa-saṅkīrtanam. ఇది శ్రీ చైతన్య మహా ప్రభుచే మాట్లాడ బడింది. Ceto-darpaṇa-mārjanam bhava-mahā-dāvāgni-nirvāpaṇaṁ śreyaḥ-kairava-candrikā-vitaraṇaṁ vidyā-vadhū-jīvanam ( CC Antya 20.12) Vidyā-vadhū-jīvanam. ఇది వాస్తవమైన జ్ఞానము. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, వారు చీకటిలో ఉన్నారు. చంద్రుని కాంతి వారికి జ్ఞానాన్ని ఇస్తుంది. వారు అందరు మూర్ఖులు, మూఢ. ఇది భగవద్గీతలో కూడా వివరించబడింది:

na māṁ duṣkṛtino mūḍhāḥ
prapadyante narādhamāḥ
māyayāpahṛta-jñānā
āsuri-bhāvam āśritaḥ
(BG 7.15)

ప్రస్తుతం ఈ మూర్ఖులు... ఇది చాలా చాలా బాధపడవలసినది వారు చెప్పుకుంటున్నారు చాలా జ్ఞానము ఉన్న తత్వవేత్త, రాజకీయవేత్త, ఆర్ధికవేత్త అని. కానీ భగవద్గీతలో కృష్ణుడి ప్రకటన ప్రకారం, వారు అందరూ మూర్ఖులు మరియు దుష్టులు.ఎందుకు? Na māṁ duṣkṛtino mūḍhāḥ pra... వారు కృష్ణుడికి శరణాగతి పొందటము లేదు. కృష్ణుడు వచ్చాడు. ఈ విశ్వంలో ఈ లోకము మీద ఆవిర్భవించారు మీరు శరణాగతి పొందండి అని ప్రచారం చేయడానికి. Sarva-dharmān parityajya mām ekam ( BG 18.66) కానీ వారు చేయలేదు. అందువలన శ్రీ చైతన్య మహా ప్రభు, కృష్ణుని భక్తునిగా... ఆయన కృష్ణుడు.

namo mahā-vadānyāya
kṛṣṇa-prema-pradāya te
kṛṣṇāya kṛṣṇa-caitanya-
nāmne...
(CC Madhya 19.53)

ఆయనే కృష్ణుడు. కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు. మొదట ఆయన భగవంతునిగా వచ్చినారు భగవంతునిగా, ఆజ్ఞగా ఆయన డిమాండ్ చేసాడు, "మీరు శరణాగతి పొందండి." కానీ ప్రజలు దీనిని చేయలేదు. కావున కృష్ణుడు మళ్ళీ భక్తునిగా, కృష్ణ-చైతన్య-నామినే రూపంలో వచ్చారు, ఇప్పుడు ఆయన మీకు కృష్ణుని మాత్రమే కాదు, కృష్ణుడి యొక్క ప్రేమను విరివిగా ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు. దాన్ని తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారము చేయండి. అది కావలసినది. చాలా ధన్యవాదాలు. భక్తులు: జయ శ్రీల ప్రభుపాద. (ముగింపు)