TE/Prabhupada 0767 - Tato niṣṭhā tataḥ rucis అప్పుడు రుచి మీరు ఈ శిబిరానికి బయట నివసించలేరు. రుచి మారినది

Revision as of 08:51, 20 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0767 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.39 -- Los Angeles, June 5, 1976


ప్రభుపాద: మీరు ఒక క్షణములో భగవంతుని మీద ప్రేమను పెంచుకోలేరు. మీరు చేయగలరు, మీరు నిజాయితీగల వారైతే, భగవంతుడు మీ మీద ఎంతో సంతోషిస్తాడు. ఆయన మీకు ఇస్తాడు. ఆయన వెంటనే మీకు ఇస్తాడు. అది సాధ్యమే. కానీ అది కొన్ని అరుదైన సందర్భాలు కావచ్చు. సాధారణంగా, ఈ పద్ధతి: Ādau śraddhā tataḥ sādhu-saṅgo. ఉదాహరణకు మీరు ఈ దేవాలయమునకు ఇక్కడకు వచ్చారు. మీకు సొంత విశ్వాసము ఉంది, మన అందరికి. దీనిని శ్రద్ధ , ādau śraddhā అని పిలుస్తారు. ఈ త్రైమాసికంలో అనేక వందల వేల మంది వచ్చారు. ఎందుకు వారు రావడము లేదు? ఇది ప్రారంభం. మీకు కొంత విశ్వాసము ఉంది, శ్రద్ధ. మీరు వచ్చారు. Ādau śraddhā tataḥ sādhu-saṅgo. మీరు కొనసాగితే... మనము ఏమి చేస్తున్నాము? ఈ వేదముల సాహిత్యాల నుండి పాఠాలు నేర్చుకోవటానికి మనము సాంగత్యమును ఇస్తున్నాము. దీనిని సాధు-సంఘ అని అంటారు. మద్యపాన దుకాణంలో మనము ఒక విధమైన సాంగత్యమును ఏర్పరుచుకుంటాము, రెస్టారెంట్లో మనము ఒక సాంగత్యమును కలిగి ఉంటాము, క్లబ్బుల లో మనము ఏదో సాంగత్యమును తయారు చేసుకుంటాము, వివిధ ప్రదేశాలలో చూస్తాము. ఇక్కడ ఒక ప్రదేశములో, ఇక్కడ కూడా సాంగత్యము ఉంది. దీనిని సాధు సంఘ అని అంటారు, భక్తులతో సాంగత్యము. Ādau śraddhā tataḥ sādhu-saṅgo ( CC Madhya 23.14-15) ఒకవేళ ఒకరు పరిపక్వ స్థితికి వచ్చినట్లయితే, ఆయన భక్తియుక్త సేవ, భజన-క్రియని అమలు చేయాలని కోరుకుంటాడు. భజన-క్రియ ఉన్న వెంటనే, అనవసరమైన అర్థంలేని విషయాలు వెళ్ళి పోతాయి. ఇంక అక్రమ లైంగికము వద్దు, ఇంక మత్తు వద్దు, ఇంక మద్యపానం వద్దు, ఇంక ఏ మాత్రము జూదం వద్దు. పూర్తయ్యింది. anartha-nivṛttiḥ syāt అయినప్పుడు, ఈ చెత్త అలవాట్లు అన్నీ పోతాయి, అప్పుడు నిష్ట, ఆ ధృడమైన విశ్వాసముతో, ఆందోళన చెందకుండా. Tato niṣṭhā tataḥ rucis. అప్పుడు రుచి. మీరు ఈ శిబిరానికి బయట నివసించలేరు. రుచి మారినది. Tato niṣṭhā tataḥ rucis, tathāśaktis, తరువాత ఆకర్షణ తరువాత భావ. భావ అంటే పారవశ్యం అని అర్థం: "ఓ, కృష్ణా." అప్పుడు ప్రేమ ఉంది. వివిధ దశలు ఉన్నాయి.

ఈ... వాస్తవ ధర్మము అంటే ప్రేమ, భగవంతుని ఎలా ప్రేమించాలి. అది వాస్తవమైన ధర్మము. ధర్మము అంటే ఏమిటి? Yato bhaktir... Sa vai puṁsāṁ paro dharmo ( SB 1.2.6) వివిధ రకాల ధర్మాలు ఉన్నాయి, మతపరమైన పద్ధతులు ఉన్నాయి. కానీ భగవంతుని పట్ల ప్రేమను ఎలా నేర్చుకోవాలి అనేది వాస్తవమైన మత పద్ధతి. అంతే. అంతకన్నా ఎక్కువ లేదు. సంప్రదాయ వేడుక లేదా సూత్రం లేదు, ఏమీ లేదు. నీ హృదయము ఎల్లప్పుడు భగవంతుని కొరకు ఏడుస్తుంటే , అది పరిపూర్ణమైన ధర్మము. అది పరిపూర్ణమైన ధర్మము. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పినారు, śūnyāyitaṁ jagat sarvam: ఓ, కృష్ణుడు లేకుండా, నేను మొత్తం ప్రపంచ ఖాళీగా ఉన్నట్లు భావిస్తున్నాను. ఖాళీగా, అవును. కాబట్టి మనము ఆ దశకు వచ్చాము. అయితే, మన అందరికి అది సాధ్యం కాదు, కానీ చైతన్య మహాప్రభు మనకు అత్యున్నత ధర్మమును పాటించే వ్యక్తిగా ఎలా మారాలి అనేది మనకు చూపించారు. ఇది ఎల్లప్పుడూ అనుభూతి చెందడము, "ఓ, కృష్ణుడు లేకుండా, ప్రతిదీ ఖాళీగా ఉంది." Śūnyāyitaṁ jagat sarvaṁ govinda viraheṇa me.అది ధర్మము. అది ధర్మము. అందువల్ల విష్ణుదూతలు ఈ యమదూతలను పరీక్షిస్తున్నారు, ధర్మమునకు అర్థమేమిటో అతడు అర్థం చేసుకున్నాడా? ధర్మం, మనము సృష్టించలేము. ధర్మం అనేది హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ఈ ధర్మము, ఆ ధర్మము కాదు. వారికి కొంత మతపరమైన అవగాహన ఉండవచ్చు, కానీ వాస్తవమైన ధర్మము అంటే, మనము భగవంతుడిని ప్రేమించుట నేర్చుకుంటాము.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద