TE/Prabhupada 0187 - ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన కాంతిలో ఉండండి

Revision as of 12:52, 22 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0187 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 2.8.7 -- Los Angeles, February 10, 1975

ఈ అజ్ఞానం కోన సాగుతోంది. భవిష్యత్తులో మార్గదర్శకత్వం కోసం, పరిక్షిత్ మహరాజ ఈ ప్రశ్నని ప్రశ్నించారు, "జీవికి ఈ శరీరం, భౌతిక శరీరం ఎలా వచ్చింది? ఏ కారణం లేకుండానా, లేదా కారణంతోనా అది సహజముగా వచ్చిందా " కానీ కారణంతో ... ఇది వివరించబడుతుంది. ఇది కాదు... కారణం ఉన్నప్పుడు ... మీకు ఏదైనా వ్యాధి సోకితే , సహజముగా మీరు వ్యాధి వలన బాధపడతారు. ఇది సహజముగా వస్తుంది. ఇది సహజముగా ఉంటుoది. కానీ మీరు వ్యాధి బారిన పడ్డారు, అది కారణం. మీరు వ్యాధి రాకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉంటే, అప్పుడు తక్కువగా పుట్టడము లేదా బాధ యొక్క కారణమును మీరు నివారించవచ్చు. అందువలన మనం ఈ సమాజం, సమాజమును ప్రారంభించాము. సమాజం అంటే ఇక్కడ ఉన్నత స్థాయికి చేరుకునే కారణం ఉంటుంది. చాలా సమాజాలు, సమాన స్థాయి వ్యక్తులు ఉన్నారు. ఒకే జాతి పక్షులు కలిసి వెళ్ళుతాయి. ఇక్కడ ఒక సమాజం ఉన్నది. ఎవరు ఇక్కడకు కలుస్తారు? ఎవరు ఇక్కడకు వస్తారు? ఎందుకంటే ఈ సమాజం స్వేచ కోసం ఉద్దేశించబడింది ... జీవితం యొక్క భౌతిక పరిస్థితుల కారణంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎవరూ సంతోషంగా లేరు. అది నిజం. కానీ వారు అజ్ఞానంలో ఉన్నారు , వారు సంతోషంగా అసంతృప్తిని అంగీకరించారు. దీన్ని మాయ అని పిలుస్తారు. దీన్ని మాయ అని పిలుస్తారు.


Yan maithunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham (SB 7.9.45). ఈ మాయ సెక్స్ జీవితము ద్వార వ్యక్తమవ్వుతుంది. వారు లైంగిక జీవితం చాలా బాగుంది అని అంగీకరిస్తారు, కానీ ఆ తరువాత, చాలా బాధలు ఉన్నాయి. చట్టపరమైన లేదా అక్రమమైన, అది పట్టింపు లేదు. చట్టపరమైన దుఃఖాలు లేదా అక్రమమైన దుఃఖాలు, కానీ అది బాధ. మాకు ప్రతి ఒక్కరికి తెలుసు. అందువలన, ప్రతిదీ ... ఒక చెడు బేరం యొక్క ఉత్తమమును ఉపయోగించు కోవడానికి. ఈ భౌతిక శరీరం మనకు ఉంది. కారణం అక్కడ ఉంది. కారణము ఉంది ఏమిటంటే మనము ఆనందించాలి మరియు కృష్ణుడికి సేవ చేయాలనీ ఇష్టపడము ఈ కారణం Kṛṣṇa-bahirmukha hañā bhoga vāñchā kare. మనము కృష్ణుడికి సేవ చేస్తున్నాము. ఇది మన స్థితి, స్వరూప స్థానము, కృష్ణుడికి సేవ చేయడము, కానీ కొన్నిసార్లు మనము కోరుకుంటున్నాను: "నేను ఎందుకు కృష్ణుడికి సేవ చేయాలి? నేను ఆధ్యాత్మిక గురువుకు ఎందుకు సేవ చేయాలి? నేను ఆనందిస్తాను, నేను ఆనందిస్తాను." కానీ ఆనందము కృష్ణుడికి సేవ ద్వార వస్తోంది, కానీ మనము ఆనందమును కృష్ణుడు నుండి స్వతంత్రముగ కోరుకొనుచున్నాము. అది పతనానికి కారణం. కృష్ణుడితో, మీరు చాలా చక్కగా ఆనందించవచ్చు. మీరు చిత్రమును చూసారు, కృష్ణుడితో గోపీకలు ఎంత బాగా నృత్యం చేస్తున్నారో, ఆనందిస్తున్నారో; గోప బాలురు ఆడుకొనుచున్నారు, ఆనందిస్తున్నారు. కృష్ణుడితో ఇది మీకు వాస్తవమైన ఆనందం. కానీ కృష్ణుడు లేకుండా, మీరు ఆనందించాలను కొన్నపుడు, అది మాయ. అది మాయ.


మాయ ఎల్లప్పుడూ ఉంది, మనము ... ఎందుకంటే చీకటి ఉండకపోతే, మీరు ప్రకాశ లక్షణమును అభినందిoచరు. అందువల్ల కృష్ణుడు చీకటిని సృష్టించాడు, మాయా కూడా, అందువల్ల మీరు ప్రకాశిస్తున్నది ఏమిటో ప్రశoసించవచ్చు. రెండు విషయాలు అవసరం. ప్రకాశం లేకుండా, చీకటి ప్రశంసించబడదు, చీకటి ... చీకటి లేకుండా, ప్రకాశం ప్రశంసించబడదు. రెండు విషయాలు ఉన్నాయి, పక్కపక్కనే. అక్కడ సూర్యకాంతి ఉంది, ఇక్కడ నీడ, ప్రక్క ప్రక్క. మీరు నీడలోనే ఉండగలరు; మీరు సూర్యరశ్మి లోపల ఉండగలరు. ఇది మీ ఎంపిక. మనము చీకటిలో ఉంటే, అప్పుడు మన జీవితం ఎంతో దుర్భారముగా ఉంటుంది, మనము వెలుగులో ఉంటే, ప్రకాశవంతముగా ఉంటుంది. అందువలన వేదముల సాహిత్యం మనకు ఉపదేశిస్తుంది, tamasi mā:: "చీకటిలో ఉండకండి." Jyotir gama:: "వెలుగులోకి వెళ్ళండి." ఈ ప్రయత్నం, కృష్ణ చైతన్య ఉద్యమం, ప్రజలను చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం. ఈ అవకాశం వదులుకోవద్దు. ఏదో ఒక విధముగా, మీకు ఈ ఉద్యమంతో పరిచయం ఏర్పడినది. సరిగా ఉపయోగించుకోండి. చీకటి లోకి వెళ్లవద్దు. ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన కాంతిలో ఉండండి.


చాలా ధన్యవాదాలు.