TE/Prabhupada 0188 - జీవితములోని అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారము
Lecture on SB 2.3.17 -- Los Angeles, July 12, 1969
విష్ణుజన: ప్రభుపాద, మీరు వివరించారు దేవుడు కారణం, అసలు కారణం, ఎవరికి భగవంతుడు తెలియడు కనుక ఎలా సాధ్యపడుతుంది, ప్రజలు వారు ఎలా నియంత్రించబడుతున్నారు అని ఎలా తెలుసుకుంటారు వారు ఎలా తెలుసుకుంటారు. వారు నియంత్రించబడ్డారు అని. ఎందుకంటే ఎవరికి కృష్ణుడు తెలియదు. ఎవరికీ తెలియదు కృష్ణుడు అసలు కారణం? . కృష్ణుడి కారణాముగా అవి జరుగుచున్నాయని వారు ఎలా తెలుసుకుంటారు?
ప్రభుపాద: మీరు రాష్ట్ర నియంత్రణలో ఉన్నారని ఎలా తెలుసుకుంటారు? మీకు ఎలా తెలుస్తుంది?
విష్ణుజన: రాష్ట్రములో ఒక న్యాయపుస్తకము ఉంటుoది.
ప్రభుపాద: అందువల్ల మాకు న్యాయ పుస్తకాలు ఉన్నాయి Anādi bahirmukha jīva kṛṣṇa bhuli gelā, ataeva kṛṣṇa veda-purāṇe karilā. మీరు కృష్ణుడిని మర్చిపోయారు , కృష్ణుడు మీకు అనేక పుస్తకాలు, వేదముల సాహిత్యం ఇచ్చారు. అందువల్ల నేను నొక్కి చెప్పుతున్నాను, అర్ధంలేని సాహిత్యాన్ని చదువుతు మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఈ వేదముల సాహిత్యంలో మీ మనస్సును నిమగ్నము చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ పుస్తకాలు ఉన్నాయి? మీరు చట్టబద్ధంగా మారడానికి గుర్తుచేసుకోవాటానికి. మీరు ప్రయోజనం పొందకపోతే, మీరు మీ జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రచారము పని, పుస్తకాల ప్రచురణ, సాహిత్యం, పత్రికలు, కృష్ణ చైతన్య ఉద్యమం, ప్రతిదీ మీకు గుర్తు చేస్తుంది. మనము ఎలా నియంత్రించబడుతున్నమో అని , ఎవరు మహోన్నతమైన నియంత్రికుడు అని, మీ జీవితం ఎలా విజయవంతం కాగలదు, ఈ నియంత్రణలో ఉన్న జీవితం నుండి మీరు ఎలా ఉపశమనం పొందగలరు, మీరు స్వాతంత్ర్య జీవితమును ఎలా పొందగలరు. ఇది ఉద్యమం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆ ప్రయోజనం కోసం ఉంది; లేకపోతే, ఈ ఉద్యమo యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది కొన్ని తాత్కాలిక ఉపశమానమును చేయడానికి "ism" కాదు. ఇది జీవితం యొక్క అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం. ఈ కీర్తన మీరు హృదయములో ఈ సందేశం అందుకునెందుకు దారి. Ceto-darpaṇa-mārjanam (CC Antya 20.12) హృదయమును శుభ్రపరుస్తుంది. అప్పుడు మీరు ఈ సందేశాన్ని స్వీకరించగలరు. మన పద్ధతి చాలా శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది, ఎవరైనా దానిని తీసుకుంటే అతడు క్రమముగా అర్ధము చేసుకుంటాడు. అతడు ఉన్నత స్థితికి ఎదుగుతాడు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు.