TE/Prabhupada 0191 - కృష్ణుడిని నియంత్రించుట. ఇది వృందావన జీవితము

Revision as of 04:53, 23 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0191 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on SB 6.1.52 -- Detroit, August 5, 1975

ప్రభుపాద: కృష్ణుని యొక్క దయ ద్వారా, గురు దయ ద్వారా, ఇద్దరి ... ఒకరి దయను తీసుకోవటానికి ప్రయత్నించవద్దు. Guru kṛṣṇa kṛpāya pāya bhakti-latā-bīja. గురు దయ ద్వారా ఎవరైనా కృష్ణుడిని పొందుతారు. మరియు kṛṣṇa sei tomāra, kṛṣṇa dite pāro. ఒక గురువు వద్దకు వెళ్ళుచున్నాము అంటే ఆయన వద్ద కృష్ణుడిని వేడుకోవడము కొసమే. Kṛṣṇa sei tomāra. ఎందుకంటే కృష్ణుడు, భక్తుడి కృష్ణుడు. కృష్ణుడు యజమాని, కానీ కృష్ణుడిని ఎవరు నియంత్రిస్తారు? అయిన భక్తుడు. కృష్ణుడు మహోన్నతమైన నియంత్రికుడు, కానీ అయినను భక్తుడు నియంత్రిస్తాడు. అనగా, కృష్ణుడు భక్తి-వత్సల. ఒక పెద్ద తండ్రి వలె, హై కోర్ట్ న్యాయమూర్తి ... ప్రధాన మంత్రి గ్లాడ్స్టోన్, ఎవరో అయినని చూడటానికి వచ్చారు అని కథ ఉంది. మిస్టర్ గ్లాడ్స్టోన్ ఇలా అన్నాడు, "వేచి ఉండండి, నేను బిజీగా ఉన్నాను." అందువలన వచ్చిన అయిన గంటలు కొద్ది ఎదురుచూస్తున్నాడు, అప్పుడు వచ్చిన అయినకు తెలుసుకోవాలనే కోరిక కలిగింది ఈ పెద్దమనిషి ఏమి చేస్తున్నాడు? అందువలన అయిన లోపల చూడాలని అనుకున్నాడు, ఆ ... అయిన ఒక గుర్రం అయి, తన పిల్ల వాడిని వీపు మీద పెట్టుకున్నాడు. అయిన చేస్తున్న పని అది. మీరు చూడoడి? ప్రధానమంత్రి, అయిన బ్రిటీష్ సామ్రాజ్యంను నియంత్రిస్తున్నాడు, కానీ అయిన ప్రేమ వలన పిల్ల వాడు అయినని నియంత్రిస్తాడు. దీనిని ప్రేమను అంటారు. అదేవిధంగా, కృష్ణుడు మహోన్నతమైన నియంత్రికుడు.

īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam
(Bs. 5.1)

అయిన మహోన్నతమైన నియంత్రికుడు, కానీ అయిన భక్తులు, శ్రీమతి రాధా రాణిచే నియంత్రించబడుచున్నాడు. అయిన నియంత్రించబడుచున్నాడు. అందువల్ల ఇది సులభముగా అర్ధము కానిది. వారి మధ్య లీలా ఏమిటి? కానీ కృష్ణుడు తనని తన భక్తుడు నియంత్రించటానికి ఇష్టపూర్వకంగా అంగీకరిస్తాడు. అది కృష్ణుని స్వభావం. ఉదాహరణకు యశోదా మాతా లాగానే తల్లి యాశోదా కృష్ణుడిని నియంత్రిస్తూoది, అయినని కట్టివేస్తుంది: "మీరు చాలా కొంటెగా ఉన్నారు, నేను నిన్ను కట్టివేస్తాను." తల్లి యాశోదా దగ్గర ఒక్క కర్ర ఉంది. కృష్ణుడు ఏడుస్తున్నాడు. కృష్ణుడు ఏడుస్తున్నాడు. ఈ విషయాలను మీరు అధ్యయనం చేస్తారు. ఇది శ్రీమద్-భాగావతం లో చెప్పబడింది, కుంతీ యొక్క ప్రార్ధన, ఆమె ఎలా ప్రశoసిస్తుందో "నా ప్రియమైన కృష్ణ, నీవు మహోన్నతడవు. కానీ తల్లి యశోదా యొక్క కర్ర వలన నీవు ఏడుస్తున్నప్పుడు, ఆ దృశ్యం నేను చూడాలనుకుంటున్నాను. " కృష్ణుడు భక్తా-వత్సలుడు. అయిన మహోన్నతమైన నియంత్రికుడు. కానీ తల్లి యశోదా లాంటి భక్తుడు, రాధా రాణి లాంటి భక్తుడు, గోపీకలు లాంటి భక్తులు, గోప బాలురు లాంటి భక్తులు, వారు కృష్ణుడిని నియంత్రిస్తారు. ఇది వృందావన జీవితం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మిమ్మల్ని అక్కడకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖులు, వారు వైదొలగిపోతున్నారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమము యొక్క విలువ ఏమిటో వారికీ తెలియదు. వారు మానవ సమాజాన్ని అత్యుత్తమ ప్రయోజనం, స్థితి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వారు దేవుడితో ఒకరు కావాలని కోరుకోరు, కాని వారు దేవుణ్ణి నియంత్రించటానికి హక్కును కలిగి ఉంటారు ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ!