TE/Prabhupada 0194 - ఇక్కడ ఆదర్శవంతమైన వ్యక్తులు ఉన్నారు

Revision as of 09:29, 23 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0194 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.6.4 -- Toronto, June 20, 1976


మనం śāstra-vidiని తీసుకోవాలి, అనగా ఇది నాగరికత యొక్క వాస్తవమైన పురోగతి. జన్మ జన్మలనుoడి దేవుడుతో మనకున్న సంబంధాన్ని గురించి మరచిపోయాము, ఇది ఏకైక అవకాశం, మానవ రూపం, మనము దేవుడుతో మన సంబంధాన్ని పునరుద్ధరించగలము. Caitanya-caritāmṛta లో చెప్పబడింది: anādi bahir-mukha jīva kṛṣṇa bhuli' gelā ataeva kṛṣṇa veda-purāṇa karilā. ఎందుకు ఈ వేదములు, పురాణాలు ఉన్నాయి? ముఖ్యంగా భారతదేశంలో, మనకు చాలా వేద సాహిత్యములు ఉన్నాయి. మొదట, నాలుగు వేదాలు - సామా, యజూర్, రుగ్, అధర్వ. తరువాత వాటి సారాంశ తత్వశాస్త్రం, వేదాంత-సూత్రా. తరువాత వేదాంత వివరణ, పురాణములు. పురాణము అంటే అనుబంధము. సాధారణ వ్యక్తి, వారు వేదముల భాషను అర్థం చేసుకోలేరు. అందువలన చారిత్రాత్మక ఉదహరణల నుండి ఈ వేద సూత్రాలు బోధించబడినవి. దీనిని పురాణము అని పిలుస్తారు. శ్రీమద్-భాగావతమును మహా-పురాణ అని పిలుస్తారు. ఇది మచ్చలేని పురాణము, శ్రీమద్-భాగావతం, ఎందుకంటే ఇతరపురాణములలో భౌతిక కర్మలు ఉన్నాయి, కానీ ఈ మహా-పురాణములో, శ్రీమద్-భాగావతంలో, కేవలం ఆధ్యాత్మిక కర్మలు. అది కావలసినది. అందువల్ల ఈ శ్రీమద్-భాగావతము నారదుని ఉపదేశము ప్రకారం వ్యాసాదేవునిచే వ్రాయబడింది. మహా-పురాణములో. మనము ఈ ప్రయోజనాన్ని తీసుకోవాలి. చాలా విలువైన సాహిత్యాలు. మానవ జీవితం వీటి కోసం ఉద్దేశించబడింది. ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? మన ప్రయత్నం, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వేదాల పురాణముల యొక్క ఈ జ్ఞానాన్ని ఎలా విస్తరించాలో, అందువల్ల మానవుడు ప్రయోజనం పొంది అయిన జీవితాన్ని విజయవంతం చేసుకుంటాడు లేకపోతే, అయిన కేవలం కష్టపడతాడు, పగలు రాత్రి, పంది వలె ... పంది పగలు రాత్రి "మలము ఎక్కడ ఉంది? మలము ఎక్కడ ఉంది?" మలము తినడం తరువాత, వెంటనే అది కొoత కొవ్వు పొందుతుంది ... పందులు కొవ్వుగా ఉంటాయి, ఎందుకంటే మలం ఆహారంలో అన్ని సారాంశాలను కలిగి ఉంటుంది. మెడికల్ సైన్స్ ప్రకారం, మలము హైడ్రోఫాస్ఫేట్లతో నిండి ఉంది. హైడ్రోఫాస్ఫేట్ మంచి మందు. ఎవరికైనా నచ్చినట్లయితే వారు ప్రయత్నించవచ్చు. (నవ్వు) వాస్తవానికి ఇది వాస్తవం. పంది చాలా కొవ్వుగా తయారు అవుతుంది ఎందుకంటే ఆది మలం తింటుంది .


ఈ జీవితం పంది కావాటానికి కాదు. వ్యక్తి సాధువు కావాలి. అది మానవ నాగరికత. వేద నాగరికతలో - బ్రాహ్మణ, మొదటి శ్రేణి వ్యక్తులు. ఈ సమాజంలో ఇప్పుడు ఫస్ట్-క్లాస్ వ్యక్తులు లేరు. అందరూ మూడవ తరగతి, నాల్గవ తరగతి, ఐదవ తరగతి. Satya-śama-dama-titkṣa ārjava jñānaṁ-vijñānam āstikyaṁ brahma-karma svabhāva-jam (BG 18.42). ఇది మొదటి శ్రేణి వ్యక్తులు అంటే నిజాయితీగా, చాలా శాంతియుతముగా, పరిజ్ఞానంతో నిండిన, చాలా నిరాడంబరముగా, ఓర్పుతో శాస్త్రముల పై నమ్మకం. ఇవి మొదటి శ్రేణి వ్యక్తుల యొక్క లక్షణాలు. మొత్తం ప్రపంచమంతా ఆ మొదటి-తరగతి మనిషి ఎక్కడ ఉన్నాడు? (విరామం) కృష్ణ చైతన్య ఉద్యమం కనీసం ఒక్క విభాగం, ఫస్ట్-క్లాస్ వ్యక్తులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది, అందువల్ల ప్రజలు ", ఇక్కడ ఆదర్శవంతమైన వ్యక్తులను" చూడవచ్చు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరిన వ్యక్తులకు నా అభ్యర్థన ఏమిటంటే, వారు చాలా జాగ్రత్తగా ఫస్ట్-క్లాస్ వ్యక్తులుగా ఉండాలి. ప్రజలు అభినందిస్తారు వారు అనుసరించడానికి ప్రయత్నిస్తారు Yad yad ācarati śreṣṭhas tat tad evetaro janaḥ (BG 3.21). మొదటి శ్రేణి వ్యక్తులు ఉంటే అప్పుడు ప్రజలు అభినందిస్తారు. కనీసం, వారు (వారు) మొదటి తరగతి కాలేకపోయినప్పటికీ, వారు అనుసరించడానికి ప్రయత్నిస్తారు. వారు అనుసరించడానికి ప్రయత్నిస్తారు. Tat tad eva, sa yat pramāṇaṁ kurute lokas tad anuvartate. కావున మొదటి తరగతి మనిషి అవసరం. అయిన ఆచరిస్తే, ఇతరులు అనుసరిస్తారు. ఒక ఉపాధ్యాయుడు పొగ త్రాగకపోతే, విద్యార్ధులు సహజంగా ధూమపానం మానివేస్తారు. ఉపాధ్యాయుడు ధూమపానం చేస్తే, ఎలా విద్యార్థులు ...? వారు కూడా తరగతి లో ధూమపానం చేస్తారు. న్యూయార్క్లో నేను చూసాను. భారతదేశంలో కనీసం ఇది ప్రారంభించబడలేదు. ఇది ప్రారంభం అవుతుంది. ఎందుకంటే వారు కూడా పురోగతిని సాదిస్తున్నారు ఈ ముర్ఖులు పురోగతి సాధిస్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. (నవ్వు)


ప్రహ్లాదా మహరాజ సూచించారు, ఆర్ధిక అభివృద్ధి అర్ధంలేని కర్మలలో మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. ముకుందుని భక్తుడిగా మారడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది.