TE/Prabhupada 0290 - మీ కామము నెరవేరనప్పుడు, మీకు కోపం వస్తుంది

Revision as of 10:30, 19 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0290 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, September 30, 1968


ఉపేంద్ర: ప్రభుపాద, కోపము యొక్క స్వభావం ఏమిటి? కోపం ఎలా ఉంటుoది ... ప్రభుపాద: కోపం అంటే కామం. మీరు కామమునకు గురైనప్పుడు మీ కామము నెరవేరనప్పుడు, మీకు కోపం వస్తుంది. అంతే. ఇది కామము ​​యొక్క మరొక లక్షణం. Kāma eṣa krodha eṣa rajo-guṇa-samudbhavaḥ. మీరు రజో గుణము చేత ప్రభావితం అయినప్పుడు, మీకు కామము వస్తుంది. మీ కామము నెరవేరనప్పుడు, మీకు కోపము వస్తుంది, తరువాతి దశ. తరువాతి దశ గందరగోళముగా ఉంటుంది. ఆ తరువాత దశలోpraṇaśyati ఉంటుoది, అప్పుడు మీరు కోల్పోతారు. అందువలన ఈ కామమును, ​​ కోపమును నియంత్రించు కోవాలి. ఈ నియంత్రణ అంటే మీరు సత్వ గుణములో ఉండాలి, రజో గుణములో కాదు. భౌతిక ప్రకృతి యొక్క మూడు గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజో గుణము. సత్వ గుణము. ఎవరైనా దేవుడు శాస్త్రాన్ని తెలుసుకోవాలని కోరుకుంటే, అతడు సత్వ గుణములో ఉండాలి లేకపోతే అయిన వల్ల కాదు. అందువలన మేము మా విద్యార్థులకు బోధిస్తున్నాం, "మీరు దీన్ని చేయవద్దు, మీరు దీన్ని చేయవద్దు, మీరు దీన్ని చేయవద్దు, మీరు దీన్ని చేయవద్దు" ఎందుకనగా అయిన సత్వ గుణములో ఉండాలి. లేకపోతే అతడు అర్థం చేసుకోలేడు. తమో గుణము మరియు రజో గుణము యొక్క స్థితిలో కృష్ణ చైతన్యము అర్థం కాదు. మొత్తం ప్రపంచము తమో గుణము మరియు రజో గుణము ప్రభావంలో ఉంది. కానీ ఈ పద్ధతి చాలా సరళంగా ఉంది, మీరు ఉదాహరణకు నాలుగు నియమాలు నిబంధనలను పాటించటం హరే కృష్ణ కీర్తన చేసినట్లయితే, మీరు వెంటనే బౌతిక ప్రకృతి యొక్క అన్ని గుణాలను అధిగమిస్తారు. కోపం రజో గుణములో ఉంది.