TE/Prabhupada 0343 - మేము ఈ మూర్ఖులకు నేర్పాటానికి ప్రయత్నిస్తున్నాము

Revision as of 07:17, 28 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0343 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 3.27 -- Madras, January 1, 1976


కృష్ణుడు, అయిన ఈ లోకములో ఉన్నప్పుడు, అయిన ఆచరణాత్మకంగా ప్రదర్శించాడు, అయిన ప్రతి ఒక్కరినీ నియంత్రించగా, ఎవరూ అయినను నియంత్రించలేదు. అయిన īśvara. అయిన పరమేశ్వర అని పిలువబడ్డారు. īśvara ప్రతి ఒక్కరూ కావచ్చు. దేవుడు ప్రతి ఒక్కరూ కావచ్చు. కానీ భగవంతుడు కృష్ణుడు. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13) . మనం చాలా చక్కగా అర్ధం చేసుకోవాలి, ఇది ఎంతో కష్టముగా కాదు. అదే నియంత్రికుడు మనలో ఒకరిగా మన ముందుగా వస్తున్నాడు, మానవుడిగా. కాని మనము అయినను అంగీకరించడములేదు. ఇదే కష్టం. Avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam ( BG 9.11) ఇది చాలా విచారించవలసినది. కృష్ణుడు ఇలా అన్నాడు, "దేవాదిదేవుడు, నియంత్రికుడు ఎవరు అనేది చెప్పటానికి నేను వస్తున్నాను? ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవటానికి నేను మానవునిగా లీలలు చేస్తున్నాను. నేను భగవద్గీతలో ఉపదేశము ఇస్తున్నాను. అయినప్పటికీ, ఈ ముర్ఖులు, దుష్టులు, వారు అర్థం చేసుకోలేరు. " దేవుడు అక్కడ ఉన్నాడు. మనము దేవుడు పేరు ఇస్తున్నాము, కృష్ణుడు దేవుడి చిరునామా కూడా, వృందావనము, దేవుడి తండ్రి పేరు, తల్లి పేరు. ఎందుకు ... దేవుడిని తెలుసుకోవడానికి కష్టం ఎక్కడ ఉంది? కానీ వారు అంగీకరించరు. వారు అంగీకరించరు. Mūḍha. వారిని ముర్ఖుడు అని వర్ణించారు.

ఈ రోజు ఉదయం ఈ పత్రికా విలేఖరులు నన్ను అడుగుతూన్నారు, "మీ ఉద్యమం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?" నేను అన్నాను, "దుష్టులకు అవగాహన, భోధన చేయటానికి, అది అంతే." ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క మొత్తము సారంశము, మేము ఈ మూర్ఖులకు నేర్పాటానికి ప్రయత్నిస్తున్నాము. ముర్ఖుడు ఎవరు? ఇది కృష్ణుడిచే వివరించబడింది. Na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ ( BG 7.15) ఎందుకు? Māyayāpahṛta-jñānāḥ. ఎందుకు మాయచే ఆతని జ్ఞానమును తీసివేయబడినది? Āsuraṁ bhāvam āśritāḥ. మా దగ్గర చాల సులభమైన పరీక్షా ఉన్నాది. ఉదాహరణకు ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో, రసాయన శాస్త్రవేత్త ఏ విధముగా విశ్లేషిస్తారో ద్రవమును ఏమిటి అని మేము చాలా తెలివైన వారము కాదు. మేము కూడా చాలా మంది మూర్ఖులల్లో ఒకరిమి, కానీ మా దగ్గర టెస్ట్ ట్యూబ్ ఉన్నాది. కృష్ణుడు చెపుతాడు ... మనము మూర్ఖునిగా ఉండటానికి మరియు, కృష్ణుడినుండి విద్యను అభ్యసిoచడానికి ఇష్టపడతాము. ఇది కృష్ణ చైతన్యము. మనము బాగా జ్ఞానము కలిగిన పండితుడిగా చాలా ఉన్నతమైన విద్వాంసునిగా ఉన్నట్లు చుప్పెట్టు కొము - "మనకు ప్రతిదీ తెలుసు." లేదు.

మనము ... చైతన్య మహాప్రభు, అయిన ఒక మూర్ఖునిగా ఉండటానికి ప్రయత్నించారు. అయిన, అయిన ప్రకాశనంద సరస్వతితో మాట్లాడినప్పుడు ... అయిన ఒక్క మాయావాది సన్యాసి. చైతన్య మహాప్రభు నృత్యం మరియు కీర్తన చేస్తున్నారు. ఈ మాయావాది సన్యాసలు అయినును విమర్శిస్తున్నారు, "అయిన ఒక సన్యాసి, అయిన కేవలం కొoదరు మూడ విశ్వసము కలిగిన వ్యక్తులతో కీర్తన మరియు నృత్యం చేస్తున్నాడు. ఇది ఏమిటి? " ప్రకాశనంద సరస్వతి చైతన్య మహాప్రభు మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేయటము జరిగింది. ఆ సమావేశంలో చైతన్య మహాప్రభు ఒక వినయము కలిగిన సన్యాసిగా హాజరయ్యారు. ప్రకాశ నంద సరస్వతి అయినను ప్రశ్నించారు, "సర్, నీవు ఒక్క సన్యాసివి. మీ కర్తవ్యము ఎల్లప్పుడూ వేదాంత అధ్యయనం చేయడము. మీరు ఎలా కీర్తన, మరియు నృత్యం చేస్తున్నారు? మీరు వేదాంత చదవటములేదు. " చైతన్య మహాప్రభు "అవును, సర్, అది వాస్తవం. నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా గురు మహరాజు నన్ను ఒక మూర్ఖునిగా చూశారు. " అలా ఎందుకు అన్నారు? "అయిన చెప్పారు guru more mūrkha dekhi' karila śāsana ( CC Adi 7.71) నా గురువు మహారాజు నన్ను అవివేకులలో మొదటి వాడిగా చూసారు . తరువాత అయిన నన్ను శిక్షించారు " ఎలా మీమల్ని అయిన శిక్షించారు? ఇప్పుడు, "వేదాంత చదువేoదుకు మీకు అర్హత లేదు, ఇది నీకు సాధ్యము కాదు. నీవు ఒక ముర్ఖుడివి. హరే కృష్ణ కీర్తన చేయడము నీకు మంచిది. "

అయిన ఉద్దేశమేమిటి? ఉద్దేశము, ప్రస్తుతం సమయంలో, ఈ మూర్ఖులు, వారు వేదాoతను ఎలా అర్థం చేసుకుంటారు? హరే కృష్ణ మంత్రమును కీర్తన చేయడము మంచిది. అప్పుడు మీరు మొత్తము జ్ఞానమును పొందుతారు.

harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

ఈ యుగములో ప్రజలు వేదాంతను ఎలా అర్థం చేసుకుoటారు వేదాంత చదివేoదుకు సమయాము ఎవరికీ ఉన్నాది? కృష్ణుడు చెప్పినట్లుగా, వేదాంత విద్యను నేరుగా తీసుకోవటము మంచిది vedaiś ca sarvair aham eva vedyaḥ ( BG 15.15) వేదాంత జ్ఞానం śabdād anāvṛtti.

Śabda- brahma ను కీర్తన చేయుట ద్వార ఎవరైనా వ్యక్తులు స్వేచ్ఛను పొందుతారు. , ఇది శాస్త్రములలో సిఫార్సు చేయబడింది:

harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

ఈ బౌతిక బoధనము నుంచి విముక్తి పొందాలనే ఆసక్తి వాస్తవంగా ఉంటే, janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) - ఈ సమస్యలు - అప్పుడు, శాస్త్రము ప్రకారము మహాజనుల ప్రకారం, హరే కృష్ణ మహా మంత్ర కీర్తనను తప్పక తీసుకోవాలి. ఇది మన ఉద్దేశ్యం.