TE/Prabhupada 0401 - శిక్షాష్టకము శ్లోకములకు భాష్యము

Revision as of 12:06, 12 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0401 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport Excerpt to Sri Sri Siksastakam -- Los Angeles, December 28, 1968


కృష్ణ చైతన్యము యొక్క విజ్ఞాన శాస్త్రంపై పుస్తకాలను రచించమని శ్రీ చైతన్య మహప్రభు ఆయన శిష్యులను ఆదేశించారు. ఆయన సూచించిన ఆ కార్యాన్ని నిర్వర్తించే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చైతన్య మహప్రభు భోదించిన తత్వముపై విశదీకరణ ,వివరణలు ఇప్పటికి జరుగుతూ వున్నాయి. వాస్తవానికి అవి చాలా భారీ, కఠినమైన, స్థిరమైన ప్రయత్నాలు. ఎందుకంటే ప్రపంచంలోని చెరగని గురుశిష్య పరంపరతో కూడిన మతసిధ్ధాంతాలే అందుకు కారణం. అయినా చైతన్య మహాప్రభు, యవ్వనంలో ఆయన ఒక గొప్ప పేరుగాంచిన విద్వాంసుడుగా ప్రసిద్ధి చెందినప్పటికీ, శిక్షాష్టక అనే పేరుతో కేవలం ఎనిమిది శ్లోకలనే మనకు ఇచ్చారు.

అనాది కాలంగా హృదయంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించే శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము జయము. అలా జనన మరణాల వల్ల కలిగే బద్ధ జీవనం అనే దావాగ్ని చల్లార్పబడింది. రెండవ శ్లోకము. హే ప్రభూ , నీ పవిత్ర నామము మత్రమే జీవులకు సకల దీవెనలు ఒసగగలదు, అందువల్ల మీకు కృష్ణ, గోవింద అని అనేక వందల లక్షల నామములు కలవు. నీవు ఆ దివ్య నామముల యందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ దివ్య నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభూ! నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణ తో సమర్థులను కావించినను, దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణయు కలుగుట లేదు. మూడవది. ఎవరైనా ఈ విధమైన వినయపూర్వకమైన మనో స్థితిలో భగవంతుడు యొక్క పవిత్ర నామాన్ని సతతం కీర్తించవచ్చు. ఎలాగంటే తనను తాను వీధిలో గడ్డిపోచ కన్నా తక్కువ అనెడి నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును గూడి, ఇతరుల అగౌరవపరిచిన వారికి సమస్త గౌరవమును ఒసగుటకు సిద్ధపడిన, అటువంటి మానసిక స్థితి యందు మాత్రమే మనుజుడు భగవంతుని యొక్క పవిత్ర నామమును నిరంతరం కీర్తించగలడు.