TE/Prabhupada 0404 - మీరు కృష్ణ చైతన్యము అనే ఈ కత్తిని తీసుకోవాలి, కేవలం విశ్వాసముతో శ్రవణము చేయండి

Revision as of 12:14, 13 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0404 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.2.16 -- Los Angeles, August 19, 1972


Śuśrūṣoḥ, śuśrūṣoḥ śraddadhānasya ( SB 1.2.16) ఎవరైనా విశ్వాసముతో శ్రవణము చేయడంలో నిమగ్నమైనప్పుడు, శ్రధ్ధధాన... ఆదౌ శ్రధ్ధా. విశ్వాసము లేకుండా, మీరు ఏ పురోగతిని చేయలేరు. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆరంభం.ఆదౌ శ్రధ్ధ. ఓ, ఇక్కడ ఉంది ..., కృష్ణ చైతన్యము బాగా విస్తరిస్తోంది. ఇది చాలా బాగుంది. వారు చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. " ప్రజలు ఇప్పటికీ, మన కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. మన ప్రామాణికాలను ఉన్నతస్థాయిలో ఉంచుకుంటే, అప్పుడు ప్రజలు మనల్ని అభినందిస్తారు. దీన్ని శ్రధ్ధ అని పిలుస్తారు. ఈ ప్రశంసలను శ్రధ్ధ, శ్రధ్ధధానస్య అని పిలుస్తారు. అతను మన ఉద్యమంలో చేరకపోయునా సరే, "ఇది చాలా బాగుంది,ఈ ఉద్యమం,... ఈ హరేకృష్ణ వ్యక్తులు చాలా మంచివారు."అని ఎవరైనా అంటే, కొన్నిసార్లు వార్తాపత్రికల వారు "ఈ హరే కృష్ణ ప్రజలు చక్కగా ఉన్నారు. మనకు ఇటువంటి వారు ఇంకా చాలా అవసరం." వారు ఆ విధంగా అంటారు. అటువంటి ప్రశంసల వల్ల ఆ పలానా వ్యక్తికి ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. ఎవరైనా మన నుండి శ్రవణం చేయకపోయినా, మనతో కలువకపోయినా, కేవలం వారు " ఈ కృష్ణ చైతన్యం చాలా బాగుంది."అని ప్రశంసిస్తేచాలు. అది ఎలాగంటే ఒక చిన్నపిల్లవాడు, అతను కర తాళాలను పట్టుకొని నిలవడానికి ప్రయత్నిస్తాడు.అలా తనూ ప్రశంసిస్తున్నాడు. ప్రశంసించడం. జీవితం ప్రారంభం నుండి ప్రశంసించడం నేర్చుకుంటున్నాడు, "కృష్ణ చైతన్యం బాగుంది." అతనికి తెలిసి చేస్తున్నాడో,తెలియక చేస్తున్నాడో దానితో సంబంధం లేదు. కేవలం ఆ ప్రశంస అతనిని ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిధిలోకి తెస్తుంది. ఇది చాలా బాగుంది. శ్రధ్ధా. వారు మనకు వ్యతిరేకులు కాకుండా, "ఈ హరేకృష్ణ వారు చక్కని పని చేస్తున్నారు ..."అని ప్రశంసిస్తే చాలు. ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి అంటే ఇటువంటి ప్రశంసాపూర్వకత్వాన్ని పెంపొందించుకోవడం. అంతే. కానీ ప్రశంసలలో స్థాయిలు కూడా ఉన్నాయి.

śuśrūṣoḥ śraddadhānasya vāsudeva-kathā-ruciḥ. మునుపటి శ్లోకములో, ఇలా వివరించబడింది, yad anudhyāsinā yuktāḥ. ప్రతి ఒక్కరూ నిరంతరం కృష్ణ చింతనలో ఉండాలి. అదే మన కత్తి.మీరు కృష్ణ చైతన్యము అనే ఈ కత్తిన్ని తీసుకోవాలి. అప్పుడే మీరు బంధవిముక్తులు అవుతారు. మన హృదయ గ్రంధి ఈ కత్తి తోనే కత్తిరించబడుతుంది. ... అయితే ఆ కత్తి మనకు ఎలా దొరుకుతుంది? ఆ పద్ధతి ఇక్కడ వర్ణించబడింది, కేవలం మీరు విశ్వాసముతో శ్రవణము చేయడానికి ప్రయత్నిoచండి. మీరు కత్తిన్ని పొందుతారు. అంతే. వాస్తవానికి, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాప్తి చెందుతోంది. కేవలం శ్రవణం ద్వారా మనం ఒకటి తర్వాత మరొక కత్తిన్ని పొందుతున్నాము. నేను ఈ ఉద్యమాన్ని న్యూయర్కు నగరంలో ప్రారంభించాను. మీకందరికి తెలుసు. వాస్తవానికి నా వద్ద ఏ కత్తి లేదు. కొన్ని మతపరమైన సూత్రాల విధముగా, వారు ఒక వైపున మత గ్రంథాలను తీసుకుంటారు, మరొక చేయిలో కత్తి ని తీసుకొని: "మీరు ఈ గ్రంథాన్ని అంగీకరించాలి, లేకపోతే నేను మీ తలని కత్తిరిస్తాను." ఇది కూడా మరొక రకపు ప్రచారం. కానీ నా వద్ద కూడా కత్తి ఉంది, కాని పైన పేర్కొన్న కత్తి కాదు. ఈ కత్తి - శ్రవణం చేసే అవకాశం ఇవ్వడం. అంతే. వాసుదేవ-కథా-రుచి, వెంటనే అతను ఒకరు రుచిని పెంపొందించుకుంటే... రుచి,రుచి అంటే ఇష్టం అని అర్థం. ఓ,ఇక్కడ కృష్ణ కథ ఉంది,చాలా బాగుంటుంది. నేను కూడా వింటాను. ఇలా అనుకున్న వెంటనే మీరు ఆయుధాన్ని పొందుతారు . మీ చేతిలోకి ఆయుధం వస్తుంది. వాసుదేవ-కథా-రుచి. కానీ రుచి ఎవరికి వస్తుంది? ఈ రుచి? ఎందుకంటే, నేను అనేక సార్లు మీకు వివరించినట్లు, ఈ రుచి, కండచక్కెర లాగా ఉంటుంది. అందరికీ తెలుసు అది చాలా తీపి పదార్థం అని, కానీ మీరు కామెర్లతో బాధపడుతున్న వ్యక్తికి దానిని ఇస్తే, అతనికి అది చేదుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ కండచక్కెర తియ్యగా వుంటుందని తెలుసు, కానీ కామెర్ల వ్యాదితో బాధ పడేవానికి, అతను చాలా చేదుగా కండచక్కెరను రుచి చూస్తాడు.ఈ విషయం అందరికీ తెలుసు. అది వాస్తవము.

కాబట్టి రుచి,వాసుదేవ-కథ శ్రవణానురక్తి, కృష్ణ- కథ, ఈ రుచిని భౌతికవ్యాదిగ్రస్తుడు రుచి చూడలేడు. ఇష్టపడడు. ఈ రుచిని పొందడానికి కొన్ని ప్రాథమిక కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏమిటి? మొదటిది ప్రశంసించుట: "అబ్బ!ఈ కృష్ణచైతన్యం చాలా బాగుంది." Ādau śraddhā, śraddadhāna. అందువల్ల శ్రధ్ధ, ప్రశంసించుట, అది ఆరంభం. తర్వాత సాధు-సంగ (CC Madhya 22.83). అప్పుడు భక్తులతో కలవడం: "పర్లేదు!ఈ వ్యక్తులు కృష్ణుని యొక్క జప కీర్తనల యందు నియుక్తులైనారు. నేను కూడా వెళ్లి కూర్చుంటాను.మరిన్ని వివరాలను తెలుసుకుంటాను. " దీనిని సాధు-సంగ అంటారు. ఎవరైతే భక్తులున్నారో వారి సాంగత్యాన్ని తీసుకోవడం. ఇది రెండవ దశ. మూడవ దశ పేరు భజనక్రియ. ఎవరైనా అయితే చక్కని సాంగత్యాన్ని తీసుకుంటున్నప్పుడు, అతను ఇలా అనుకుంటాడు, "ఎందుకు నేను శిష్యున్ని కాకూడదు?" అప్పుడు మనం దరఖాస్తును అందుకుంటాం, "ప్రభుపాద, దయచేసి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి." ఇది భజన క్రియ యొక్క ఆరంభ దశ. భజన క్రియ అంటే భగవంతుని యొక్క సేవలో నియుక్తమవడం అని అర్థం. ఇది మూడవ దశ.