TE/Prabhupada 0444 - గోపికలు బధ్ధజీవులు కారు. వారు ముక్తాత్ములు

Revision as of 09:46, 18 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0444 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


ప్రభుపాద: హా?

భక్తుడు: మీ రచనలలో ఎక్కడో నేను ఈ విషయాన్ని చదివాను. రాధాకృష్ణుల యొక్క దివ్యమైన అంతరంగిక విషయాలను గ్రహించేందుకు, మనం గోపీకల యొక్క సేవలో నియుక్తం అయిన వారిని సేవించాలి, మీరు గోపీకల యొక్క సేవకుడు అని నేను భావిస్తున్నాను. అది సత్యమే అంటారా? లేదా ... నేను గోపీకల సేవకులను ఎలా సేవించగలను?

ప్రభుపాద: గోపికలు, వారు బధ్ధజీవులు కారు. వారు ముక్తాత్ములు. కాబట్టి మొదట మీరు ఈ బధ్ధజీవనం నుండి బయటపడాలి. అప్పుడు గోపికలను సేవించే స్థాయి గురించి ఆలోచించవచ్చును. ప్రస్తుత స్థితిలో గోపికలను సేవించటం అనే కార్యం మీద అత్యుత్సాహం ప్రదర్శించకండి. మీ యొక్క బధ్ధజీవన స్థితి నుండి బయటపడడానికి ప్రయత్నించండి. అప్పుడు, మీరు గోపికలను సేవించే సమయము వస్తుంది. ఈ ప్రస్తుత బధ్ధ దశలో మనం వారికి సేవ చేయలేము. కృష్ణుడు దీనిని చేస్తున్నాడు. కానీ, కృష్ణుడు విగ్రహార్చన రూపంలో మన సేవలను స్వీకరించడానికి, మనకు అవకాశాన్ని కల్పించాడు. ఎలాగంటే మనం కృష్ణుని అర్చావిగ్రహాన్ని ప్రతిష్టించి వారికి శాస్రనియమానుసారం, నియమ నిబంధనలతో ప్రసాదాన్ని సమర్పిస్తాము. కాబట్టి మనము ఈ విధంగా క్రమేనా ఉన్నత స్థితికి రావలసి ఉంటుంది, ఈ కీర్తన, శ్రవణముల ద్వారా, మరియు మందిర పూజాకార్యక్రమాల ద్వారా, హారతులు,ప్రసాదాలు సమర్పించడం ద్వారా. ఈ విధంగా, మనము భక్తిలో ఉన్నతి సాధిస్తున్నప్పుడు, అప్పుడు సహజముగానే కృష్ణుడు మనకు వెల్లడవుతాడు, మరియు మీరు మీ స్థితిని అర్థం చేసుకుంటారు, మీరు ఎలా ఉండాలి అనే విషయాన్ని ... గోపికలు అంటే ఎల్లప్పుడూ, సదా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై వుండేవారు. క్రమేనా మనకు భగవంతునితో గల మన శాశ్వత సంబంధం వెల్లడి అవుతుంది. కాబట్టి మనం ఆ సమయం కోసము వేచి ఉండవలెను. వెంటనే మనము గోపీకలను సేవిస్తున్నట్లు అనుకరించకూడదు. మీరు గోపికలను సేవించాలని అనుకోవడం,అది మంచి ఆలోచనే, కానీ అది కొంత సమయం తీసుకుంటుంది. వెంటనే కాదు. వెంటనే మనము నియమ నిబంధనలు పాటించటం,దైనందనిక కార్యక్రమాలను అనుసరించటం చేయవలిసి ఉంటుంది.