TE/Prabhupada 0377 - భజాహురేమన భాష్యము

Revision as of 11:53, 19 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0377 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Bhajahu Re Mana -- Los Angeles, May 27, 1972


ఈ పాట గోవింద దాస పాడినది. గోవింద దాస అభిలాష రే. అతని కోరిక ఏమిటి? అభిలాష అంటే కోరిక. భజహు రే మన శ్రీనందనందన: "నా ప్రియమైన మనసా... " మనసే మన స్నేహితుడు, శత్రువు ఎందుకంటే. మీరు మనసుకు శిక్షణ ఇచ్చినట్లైతే మీ మనసు మీకు ఉత్తమ మిత్రుడు. మీరు మీ మనస్సుకు శిక్షణ ఇవ్వనట్లయితే, అప్పుడు అది మీకు క్రూరమైన శత్రువు. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ ( SB 9.4.18) అందువల్ల మీ మనసును ఎల్లప్పుడూ కృష్ణుడి పాదపద్మముల మీద ఉంచవలెను. అప్పుడు సహజంగానే మీ మనసు నియంత్రించబడుతుంది, మీకు స్నేహితుడిగా ఉంటుంది. గోవింద దాస తన కోరికను వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రియమైన మనసా నీవు కేవలం నంద-నందనుడి యొక్క భక్తి యుక్త సేవలో నిలువుము. అతను... అతను కృష్ణ అని చెప్పలేదు, నంద నందనా అని చెబుతున్నాడు. Bhajahū re mana śrī-nanda-nandana. మనం కృష్ణుడిని నేరుగా పిలిచినట్లయితే అది అతనిని ఆనందింప చేయదు. కానీ మనము కృష్ణుని ఇలా పిలిచినట్లయితే.. నందనందనా, యశోదా నందనా, దేవకీనందనా, పార్థసారథి అతని భక్తుల సంబంధంలో పిలిచినట్లయితే, అప్పుడతను మరింత సంతోషిస్తాడు. ఎందుకు శ్రీ నంద నందనా? అందువల్ల భజహు రే మన శ్రీనందనందనా: ఇప్పుడు అభయ చరణారవింద రే. మీరు కృష్ణుడి నందనందనుడి యొక్క పాద పద్మముల ఆశ్రయం తీసుకుంటే. అప్పుడు మీకు ఇక ఆందోళన భయం ఉండదు.

samāṣritā ye pada-pallava-plavaṁ
mahat-padaṁ puṇya-yaśo murāreḥ
bhavāmbudhir vatsa-padaṁ paraṁ padaṁ
padaṁ padaṁ yad vipadāṁ na teṣām
(SB 10.14.58)

ఇది భగవద్దర్శనం Padaṁ padaṁ yad vipadām. ఈ భౌతిక ప్రపంచంలో పదం పదం అంటే, ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉంది. ఎవరైతే కృష్ణుడి పాదపద్మాల యందు ఆశ్రయం తీసుకుంటారో mahat-padaṁ puṇya-yaśo murāreḥ samāṣritā, అతనికి ఇంక ఏ ప్రమాదమూ లేదు. అభయ చరణారవింద రే కృష్ణుడి యొక్క సంపూర్ణ ఆశ్రయం పొందడం ఎలా సాధ్యమవుతుంది. ఇది నిర్భయము, ఆందోళన లేనిది, వైకుంఠము. దుర్లభ మానవ జనమ సత్సంగె. సత్ సంగె భక్తులతో మీరు ఉంటే, ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాను ఇప్పుడు నేను ఒంటరిగా జీవిస్తాను అని మీరు ఆలోచించినట్లైతే, హరిదాసు ఠాకూర్ ను అనుకరిస్తూ హరేకృష్ణ జపం చేస్తాను అది అర్థం లేనిది మీరు హరిదాసు ఠాకూర్ ను అనుకరించకూడదు. మీరు భక్తులతో కలిసి ఉండాలి.. Durlabha manava-janam sat sange. Sat-sange. Satāṁ prasaṅgān mama vīrya-saṁvido ( SB 3.25.25) భక్తులతో మీరు ఉంటే, వారి సహవాసం ద్వారా, వారితో మాట్లాడడం ద్వారా. మీరు దేవుని చైతన్యం యొక్క వాస్తవమైన అవగాహన పొందుతారు. అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఆచరణాత్మకమైనది. ఈ భౌతిక ప్రపంచంలో అనేక సమాజాలు సంఘాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు వారు వారి స్టాక్ ఎక్స్చేంజ్ అసోసియేషన్ కలిగి ఉంటారు, మారకం వినిమయం చేస్తుంటారు. వారూ అసోసియేషన్ కలిగి ఉన్నారు వారు అక్కడికి వెళ్ళుతారు అక్కడ తమ వ్యాపారము చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా క్లబ్బులు ఉన్నాయి మీరు త్రాగాలని ఇంద్రియాలని ఆస్వాదించాలని కోరుకుంటే. మీరు చాలా క్లబ్బులుకు వెళ్లి వారితో కలిసి పోయి వారి సాంగత్యం తీసుకుంటే ఎలా త్రాగాలని, ఎలా చక్కగా జతకట్టాలి అనేది నేర్చుకుంటారు. అందువలన సాంగత్యం చాలా ముఖ్యమైనది. అందువల్ల మన కృష్ణచైతన్య సంఘము మన సాంగత్యాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఒక అవకాశము. అందువల్ల అతను కృష్ణుడంటే ఏమిటి? కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? అనేది అర్థం చేసుకోగలడు. అందువల్ల గోవింద దాస సిఫార్సు చేస్తున్నారు "దుర్లభ మానవ జనమ సత్సంగె." మానవ. ఈ మానవ జీవితము దుర్లభమైనది చాలా అరుదుగా లభిస్తుంది. కుక్కల సాంగత్యము కాకుల సాంగత్యము కాదు కానీ హంసల సాంగత్యము. ప్రకృతిలో కూడా సంఘాలు ఉన్నాయి,పక్షులు ఒకే రకం ఈకలు కల పక్షులతో కలిసి పోతాయి కాకులు కాకులతో కలిసిపోతాయి మరియు హంసలు హంసలతో కలిసిపోతాయి. తెల్లని హంసలు చాలా చక్కని నీరు, చక్కని తోట అటువంటివి ఇష్టపడతాయి. కాకులకు అది ఇష్టం లేదు అనారోగ్యకరమైన విషయాలు చెడు పదార్థాలు ఎక్కడున్నాయో అవి కాకులు ఇష్టపడతాయి. అక్కడ అవి ఆనందం పొందుతాయి. అదేవిధంగా పకృతి లక్షణం ప్రకారం మానవ సమాజంలో విభిన్న సంఘాలు ఉన్నాయి. కానీ ఇది చెబుతుంది దుర్లభ మానవ సత్ సంగె: కాకులతో కాదు, కానీ హంసలతో.

నీవు హంసలకు పాలను మరియు నీటిని ఇచ్చినట్లయితే ఆది పాల భాగాన్ని మాత్రమే తీసుకుని నీటి భాగాన్ని వదిలివేస్తుంది. అదేవిధంగా ఒక హంస పరమహంస అంటే ఈ మానవ జీవితంలో, ఎవరైతే ఆధ్యాత్మిక జీవిత భాగాన్ని తీసుకుంటారో, భౌతిక జీవిత భాగాన్ని తిరస్కరిస్తాడో అతను హంస అని పిలువబడతాడు. మనము మిశ్రమంగా ఉన్నాము. మన శరీరము భౌతికము, కానీ నేను ఆ ఆత్మను. మనం సాంకేతికతలను తెలుసుకోవాలి, ఈ భౌతికము నుండి ఎలా బయటపడాలి. ఇది ఈ భౌతిక శరీరం నుండి బయటికి వస్తుంది, కానీ అది బయటికి వచ్చిన వెంటనే ఈ భౌతిక శరీరము నాశనమవుతుంది. చాలా మంచి, మంచి ఉదాహరణ అగ్నిలో అగ్ని ఉంది. చెక్కలో ఉన్నది. ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు. మీరు అగ్నిని మండించినట్లయితే మరియు దానిని మీరు ఊదినట్లయితే, అప్పుడు అగ్ని తొందరగా మండుతుంది. అగ్ని మండుతున్నప్పుడు చెక్కని వేసినట్లయితే అది నాశనమవుతుంది చెక్క యొక్క ఉనికి ఇంక ఉండదు. అదేవిధంగా మీరు మీ ఆధ్యాత్మిక జ్ఞానము, కృష్ణ చైతన్యం మేల్కొల్పినట్లయితే అప్పుడు ఇది చాలా చక్కగా జరుగుతుంది, అప్పుడు మీ భౌతిక జీవితము పూర్తవుతుంది. ఇది పద్ధతి. దుర్లభ మానవ జనమ సత్సంగె తారహో ఏ భవ సింధు రే. ఈ విధంగా అజ్ఞాన మహాసముద్రం యొక్క మరొక వైపుకు చేరతారు.

అప్పుడు ఎవరైనా ఇలా అంటే, కృష్ణ చైతన్య సంఘం యొక్క సాంగత్యాన్ని పొందగలిగితే, అప్పుడు నా కుటుంబ వ్యవహారాలు ఎలా కొనసాగుతాయి? నా భార్యాపిల్లలు సమాజం స్నేహం ప్రేమను ఎవరు చూసుకుంటారు? నాకు చాలా వ్యవహారాలు ఉన్నాయి. అందువల్ల అతను చెపుతున్నాడు, śita ātapa bāta bariṣaṇa dina jāminī jāgi re: నా ప్రియమైన మనసా, నీవు చాలా కష్టపడుతున్నావు. శీత ఆతప. తీవ్రమైన చలి లో కూడా నీవు పనిచేయడానికి వెళ్తున్నావు. మంట పుట్టించే వేడిలో కూడా నీవు పనిచేయడానికి వెళుతున్నావు నీవు నీ పనిని ఆపడం లేదు. Śīta ātapa bāta bariṣaṇa.మొత్తం రాత్రంతా పనిచేస్తున్నారు. ప్రజలు రాత్రి పని చేస్తున్నారు, śita ātapa bāta bariṣaṇa dina jāminī jāgi re: రోజంతా పని. మళ్లీ నేను మరి కొంత డబ్బు సంపాదిస్తాను అందుకోసం రాత్రి కూడా నేను పని చేస్తాను. ఈ విధంగా మనం పని చేస్తున్నాము. ఎందుకు మీరు పని చేస్తున్నారు? ఎందుకు మీరు పని చేస్తున్నారు?

śīta ātapa bāta bariṣaṇa
ei dina jāminī jāgi re
biphale sevinu kṛpaṇa durajana
capala sukha labha lāgi' re

ఈ విధంగా నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను. కృపణ దుర్జన ను సేవించుటకు, సమాజము, స్నేహమూ, ప్రేమా, అని కొన్ని పిలవబడే వాటికొరకు. కృపణ, వారు ఎప్పుడూ ఉండరు, కృష్ణచైతన్యంలో ఉండండి. కానీ నేను వారి సేవలో నియోగించబడి ఉన్నాను. ఇది సాధారణంగా, ప్రతి ఒక్క, ప్రతి ఒక్క కుటుంబంలో కాదు . దాదాపు 99.9%. biphale sevinu, "ఈ విధంగా నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను, ఆనందం ఏమిటి?" Capala sukha-labha lāgi' re. "కొన్ని నిమిషాల, మైథునం అంతే." మైథునం వెనుక, చాల కష్టాలు. అందువలన గోవింద దాస్ చెప్తున్నాడు, "మీరు సంపదను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు." ei-dhana, yauvana, putra, parijana. భౌతిక ఆనందం అంటే డబ్బు సంపాదించడం అంటే, ధన; తరువాత జన, అనేక అనుచరులు లేదా ఆధారపడినవారు. భార్య, పిల్లలు, స్నేహితులు, సమాజం, చాలా విషయలు, దేశం. So putra, parijana, ithe ki āche paratīti re. మీరు ఈ భౌతిక విషయాలలో ఎలాంటి ఆధ్యాత్మిక ఆనందం పొందలేరు. కమల-దల-జల, జీవన ఠలమల. జీవితం నిరుత్సాహపరుస్తుంది. జీవితం పూర్తయినప్పుడు మీరు చెప్పలేరు. ఉదాహరణకు కమల-జల-దల ఇవ్వబడింది. కేవలం కమల ఆకు పై నీటివలె. మీరు ఆకు మీద నీరు వేస్తే, అది ఉండదు; అది కదులుతూ ఉంటుంది. ఏ సమయంలోనైనా అది పడిపోతుంది. అదేవిధంగా, మన జీవితం అలాంటిది, కదులుతూ ఉంటుంది. ఏ సమయంలోనైనా - పూర్తవుతుంది. కమల-జల-దల, జీవన... భజహు హరి-పద నీతి రే. అందువల్ల మిమ్మల్ని మీరు ఎంత వీలైతే అంత కృష్ణచైతన్యంలోనే నియుక్తం చేసుకోవాలి. మరణం వచ్చే ముందే పూర్తి చేసుకోవాలి. ఇది మీ లక్ష్యం. మరియు కృష్ణ చైతన్యము ఏమిటి? Śravana, kīrtana, smarana, vandana, pāda-sevana... pūjana, sakhī-jana, ātma-nivedana, భక్తియుక్త సేవ యొక్క తొమ్మిది రకాలు, govinda-dāsa-abhilāṣa re.

అందువల్ల ప్రతి ఒక్కరూ గోవింద దాస లాగ కోరుకోవాలి. Śravana kīrtana, ఇవి భక్తి పద్ధతులు. వినడం, కీర్తన, జపము చేయడము, గుర్తుపెట్టుకోవడం, అర్చన, దైవాన్ని ఆరాధించడం, వందన, ప్రార్థన చేయడం. తొమ్మిది రకాలు ఉన్నాయి. మానవ జీవితం ఈ ప్రయోజనము కోసం ఉద్దేశించబడింది, ఈ పద్ధతి ద్వారా, క్రమంగా మనకు కృష్ణ చైతన్యము, లేదా ఆధ్యాత్మిక చైతన్యం యొక్క అగ్నిని మండిస్తుంది. అప్పుడు ఆ అగ్ని, ఆ జ్వలించే అగ్ని అడవిని దహించి బూడిద చేస్తుంది. అలా మనల్ని , మనల్ని కప్పివేసినవన్ని ... ఆధ్యాత్మిక ఆత్మ అజ్ఞానంతో, భౌతికముతో నిండి ఉంది. ఈ ఆవరణ అజ్ఞానం కాలి బూడిదగా అవుతుంది, మరియు మీరు స్వేచ్ఛగా భగవద్ధామమునకు తిరిగి వెళ్లి, భగవద్ధామములో ఉంటారు. ఇది ఈ పాట యొక్క సారాంశము