TE/Prabhupada 0379 - దశావతారము స్తోత్రము యొక్క భాష్యము

Revision as of 05:29, 21 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0379 - in all Languages Category:TE-Quotes - Unknown Date Category:TE-Q...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Dasavatara Stotra, CD 8


Pralaya-payodhi-jale dhṛtavān asi vedam. గొప్ప వైష్ణవ కవి జయదేవ గోస్వామి ఈ పాట పాడారు. వినాశనం ఉన్నప్పుడు, మొత్తం విశ్వం నీటితో ప్రవహింప బడింది. ఈ భౌతిక ప్రపంచమును అంతిమంగా రద్దు చేయడం కొరకు, మొట్టమొదట, అక్కడ నీరు ఉండదు, భూమి మీద ఉన్న నీరు అంతా సూర్యుని వేడి పీల్చడం ద్వారా ఎండిపోతుంది. ప్రస్తుత క్షణం కంటే సూర్యుడు 12 రెట్లు తీవ్రము అవుతాడు. ఆ విధంగా అన్ని జలాలు ఆవిరై, సముద్రాలు మహా సముద్రాలన్నీ ఆవిరైపోతాయి. అందువలన భూమిపై ఉన్న ప్రాణులన్నీ చనిపోతాయి, ఆపై, మంట పుట్టించే వేడి వలన, ఆచరణాత్మకంగా ప్రతిదీ బూడిదగా మారుతుంది. వంద సంవత్సరాలు వర్షం పడుతుంది, వర్షము యొక్క చుక్కలు, ఏనుగు తొండం వలె ఉంటాయి. అందువలన మొత్తం విశ్వం నీటితో నిండి ఉంటుంది. దీనిని ప్రళయ పయోధి అని పిలుస్తారు. వినాశ సమయంలో, ప్రళయ, మొత్తం విశ్వమంతా..... ఇది ఇప్పుడు గాలితో నిండినట్లుగా, ఆ సమయంలో అది నీటితో నిండి పోతుంది.

ఆ సమయంలో వేదాలు ఒక పడవలో భగవంతుని ద్వారా రక్షించబడతాయి. మరియు ఆ పడవ మహోన్నత మీనం యొక్క రెక్కలకు కట్టి వేయబడుతుంది. ఆ మహోన్నత మీనం కృష్ణుడి యొక్క అవతారము. అందువల్ల అతన్ని పూజిస్తున్నాము. keśava dhṛta-mīna-śarīra jaya jagadīśa. అలా (mīna-śarīra) మీన శరీర. తరువాత kṣitir iha vipulatare tiṣṭhati tava pṛṣṭhe dharaṇi-dhāraṇa-kiṇa-cakra-gariṣṭhe. తర్వాత అవతారము తాబేలు కూర్మరూపం. అక్కడ చిలకడం ఉంటుంది, తాబేలు వీపు మీద మేరు పర్వతము పెట్టబడుతుంది. లేదా ప్రపంచము మొత్తము తాబేలు వీపుపై ఉంటుంది. ఇది రెండవ అవతారము మొదటిది మీనము చేప, ఆపై కూర్మము తాబేలు.

తర్వాత వరాహావతారము, ఒక రాక్షసుడు, హిరణ్య, హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు. అందువలన అతను అతని రాక్షస కార్యక్రమముల ద్వారా భూమిని గర్భోదక సముద్రంలో పడవేస్తాడు. అటువంటి సముద్రం ఈ విశ్వంలోనే ఉంది. సగం గోళము గర్భోదకసముద్రంతో నిండి ఉంది. అక్కడ దానిపై గర్భోదకశాయి విష్ణు ఉంటారు. మరియు అతని నుండి ఒక కమలం యొక్క కాండం వస్తుంది అందులో బ్రహ్మ జన్మిస్తాడు. అన్ని లోకములు ఈ వాస్తవకాండం యొక్క విభిన్నమైన కాడలు గా ఉంటున్నాయి. గర్భోదకశాయి విష్ణువు యొక్క ఉదరం నుండి బయటికి వస్తాయి. అలా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు. అతను ఈ భూమిని నీటిలో ఉంచుతాడు. ఆ సమయంలో భగవంతుడు వరాహావతారంలో బయటికి వస్తారు. వరహ అవతరం బ్రహ్మ యొక్క ముక్కు నుండి ఒక చిన్న పురుగుగా వచ్చారు, మరియు ఎప్పుడైతే అతను తన చేతి మీద ఉంచుకున్నాడో, అతను వృద్ధి చెందడం ఆరంభించాడు. ఈ విధంగా అతను చాలా భారీ శరీరాన్ని తీసుకున్నాడు. మరియు అతని దంతంతో అతను గర్భోదకసముద్రం నుండి భూమిని పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. వీరినే కేశవ ధృత వరాహ రూపా అని పిలుస్తారు.

తరువాత tava kara-kamala-vare nakham adbhuta-sṛṅga dalita-hiraṇyakaśipu-tanu-bhṛṅgam. హిరణ్యకశిపుడు అతను అమరత్వంతో ఉండాలని కోరుకున్నా మరొక రాక్షసుడు. అందువలన అతను బ్రహ్మనుండి వరం పొందాడు, భూమి మీద కానీ ఆకాశంలో లేదా నీటిలో కాని చనిపోకుండా. అందువలన బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని పాటిస్తూ అలాగే యథాతథంగా ఉంచెను... భగవంతుడు కృష్ణుడు తన భక్తుల ఉపదేశాలు గౌరవించడానికి ప్రయత్నిస్తాడు. బ్రహ్మ అతనికి ఆశీర్వాదాలు ఇచ్చాడు “సరే, నీవు భూమి మీద కాని నీటిలో కానీ ఆకాశంలో కానీ చనిపోవు”. కానీ నరసింహస్వామి సగం సింహం సగం మనిషి గా అవతరించాడు . ఎందుకంటే హిరణ్యకశిపుడు ఏ జంతువు చేతనైనను లేదా ఏ మనిషీ చేతనైనను చంపబడకుండా బ్రహ్మనుండి వరం తీసుకున్నాడు. అందువలన అతను మనిషి లేదా జంతువు అని చెప్పలేని రూపాన్ని ధరించాడు. ఆయన ఆ రాక్షసుని తన ఒడిలో వేసుకున్నాడు. అది భూమి, నీరు లేదా ఆకాశము కాదు. మరియు అతను కోరుకున్నాడు ఏ ఆయుధాల చేతను చంపబడకూడదని. అందువల్ల భగవంతుడు అతన్ని తన గోర్లతో చంపాడు. గోర్లు ఆయుధంగా పరిగణించబడవు. ఆ విధంగా అతను బ్రహ్మను మోసం చేయాలని కోరుకున్నాడు కానీ భగవంతుడు చాలా తెలివైనవాడు. అతను హిరణ్యకశిపుని మోసం చేశాడు మరియు అతన్ని చంపాడు. Keśava dhṛta-narahari-rūpa. Dalita-hiraṇyakaśipu -tanu -bhṛṅgam. మనం ఏ విధంగా అయితే గోళ్లతో ఒక చిన్న కీటకమును చంపగలము, ఒక చిన్న చీమను తీసుకోండి దాన్ని మీరు విభజించవచ్చు. అదేవిధంగా హిరణ్యకశిపుడు అనే గొప్ప రాక్షసుణ్ణి అతను చిన్న కీటకం వలె పోల్చాడు. మరియు భగవంతుడి యొక్క గోర్ల ద్వారా చంపబడ్డాడు