TE/Prabhupada 0460 - ప్రహ్లాద మహారాజు సాధారణ వ్యక్తి కాదు

Revision as of 16:40, 22 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0460 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.7 -- Mayapur, February 27, 1977


కాబట్టి ప్రహ్లాద మహారాజు ... తండ్రి తో కొంత అసమ్మతి ఉంది, కాని ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఆయన తండ్రి చంపేస్తాడు ... ఆయన చాలా గొప్ప మనిషి, మీరు చూస్తారు. ఆయన మొత్తం విశ్వాన్ని జయించాడు. కాబట్టి ఆయన పేదవాని కుమారుడు కాదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి కుమారుడు, ప్రహ్లాద మహారాజు. ఆయన తన తండ్రి వలన తగినంతగా చదువుకున్నాడు. అయితే, ఐదు సంవత్సరాలలోనే. janmaiśvarya-śruta-śrī. అంతా ఉంది, కాని ప్రహ్లాద మహారాజు తన భౌతిక పరిస్థితులపై ఆధారపడలేదు. ఆయన భక్తియుక్త సేవ యొక్క తన లోతైన, పారవశ్య ఆధ్యాత్మిక ఆనందం మీద ఆధారపడి ఉన్నారు. అది కావలసినది. కాబట్టి ఆ దశ వెంటనే మనము చేరుకోలేము. ఆయన నిత్య సిద్ధ. నేను వివరించబోతున్నాను, కృష్ణుడు ఎప్పుడు అవతరించినా , ఆయన నిత్య-సిద్ధ భక్తులు, సహచరులు, వారు కూడా వస్తారు. కావున gaurāṅgera saṅgi-gaṇe, nitya-siddha boli māne, tara haya vrajabhūmi vāsa, ఈ విధంగా నరోత్తమదాస ఠాకూర... ఉదహరణకు, śrī kṛṣṇa caitanya prabhu nityānanda śrī advaita gadādhara śrīvasadi gaura bhakta vṛnda వలె. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క ఈ సహచరులు, వారు నిత్య-సిద్ధ. మీరు వారిలో ఎవరిని తప్పించి, మీ కల్పనను చేయలేరు, "నేను కేవలం ఆరాధిస్తాను ..." (బ్రేక్)

కృష్ణుడు అవతరించారు - పంచ-తత్వ. కృష్ణుడు īśā, నిత్యానంద ప్రభు, ఆయన ప్రకాశ, దేవుడి మొదటి విస్తరణ. దేవుడు చాలా విస్తరణలను కలిగి ఉన్నాడు. Advaita acyuta anādi ananta-rūpam ādyaṁ purāṇa-puruṣam (Bs. 5.33). ఆయనకు వేల మరియు వేల కొలది ఉన్నాయి. కాబట్టి మొదటి విస్తరణ Baladeva-tattva, Nityānanda; ఆయన అవతారం, అద్వైత; ఆయన ఆధ్యాత్మిక శక్తి, గదాధర; ఆయన తటస్త శక్తి, శ్రీవాస. కాబట్టి చైతన్య మహాప్రభు పంచ తత్వతో అవతరించారు., పంచ-తత్వాత్మకంతో మీరు దేనిని విస్మరించలేరు. మీరు "నేను కేవలం ఆరాధిస్తాను ...," అని అనుకుంటే అది ఒక గొప్ప అపరాధము, ... చైతన్య మహాప్రభు లేదా చైతన్య-నిత్యానంద కాదు మీరు పంచ-తత్వా, పంచ-తత్వాత్మామ్ కృష్ణమ్, పూజించాలి,పూర్తిగా అదేవిధముగా, హరే కృష్ణ మహా-మంత్రం, పదహారు పేర్లు, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, (భక్తులు కీర్తన చేస్తున్నారు) హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మీరు కలపలేరు. మీరు శాస్త్రము ప్రకారం చేయాలి. Mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మీరు శాస్త్రం నుండి వైదొలగితే, మీరు ఎన్నటికీ విజయము సాధించరు.

yaḥ śāstra vidhim utsṛjya
vartate kāma-kārataḥ
na siddhim avāpnoti
na sukhaṁ na parāṁ gatim
(BG 16.23)

మీరు ప్రహ్లాద మహారాజు స్థాయిని చేరుకోవాలనుకుంటే, మనం వెంటనే ఆయనను అనుకరించకూడదు. మనము సాధన భక్తి, సాధన-భక్తి, అనుసరించాలి; సాధారణముగా kṛpa-siddha, ఇది ప్రత్యేకమైనది. అది లెక్కించలేనిది. కృష్ణుడు కోరుకుంటే, ఆయన వెంటనే కొంత మందిని చాలా ముఖ్యమైన వానిగా చేయగలరు. ఇది కృపా-సిద్ధ. అందువల్ల మూడు తరగతుల భక్తులు ఉన్నారు: నిత్య-సిద్ధ సాధన-సిద్ధ కృపా-సిద్ధ. ప్రహ్లాద మహారాజు నిత్య సిద్ధ. ఆయన సాధారణ సాధన-సిద్ధ కాదు లేదా... వాస్తవానికి అంతిమంగా తేడాలేదు, చివరికి సాధన-సిద్ధ లేదా కృపా-సిద్ధ లేదా నిత్య-సిద్ధ, కాని ప్రహ్లాద మహారాజు సాధారణ భక్తుడు కాదని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆయన నిత్య-సిద్ధ. అందువల్ల అతనిలో వెంటనే ఆధ్యాత్మిక లక్షణాలను, అష్ట సిద్ధి అభివృద్ధి అయినది. అష్టా-సిద్ధి, మీరు భక్తి రసామృత పుస్తకములో చదివారు. అందువల్ల పారవశ్యములు, ekāgra-manasā. ekāgra-manasā, "పూర్తి శ్రద్ధతో." మనకు పూర్తి శ్రద్ధ రావడానికి వందల వేల సంవత్సరాలు పట్టవచ్చు, పూర్తి శ్రద్ధ. ప్రహ్లాద మహారాజు - వెంటనే. వెంటనే, ఐదు సంవత్సరాల బాలుడు, ఎందుకంటే ఆయన నిత్య సిద్ధ . ఎల్లప్పుడూ మనం అనుకరించలేమని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు, ప్రహ్లాద మహారాజ వెంటనే ekāgra-manasā ఉన్నాడు, నేను కూడా అవుతాను. కాదు అది సాధ్యం కాదు. సాధ్యం కావచ్చు, కాని అది పద్ధతి కాదు