TE/Prabhupada 0498 - నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే,నా ఆకాశహార్మ్యభవనం, కర్తవ్యము సమాప్తమైపోతాయి

Revision as of 07:12, 25 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0498 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972


ఇక్కడ సిఫారసు ఉంది. కృష్ణ చైతన్యవంతుడిగా మారడానికి ప్రయత్నించండి. ఆపై మీరు భౌతిక ప్రపంచం యొక్క ఈ బాహ్య, అశాశ్వత మార్పులతో చెదిరిపోరు. ఈ శరీరానికి మాత్రమే కాదు, ఆచరణాత్మకంగా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి చెందివున్నారో రాజకీయ తిరుగుబాట్లు లేదా సామాజిక గందరగోళములు అని పిలిచే వాటి వలన ఆయన ఆందోళన చెందలేదు. లేదు. ఇవన్నీ కేవలం బాహ్యమైనవని అతనికి తెలుసు, కేవలం కలలో వలె. ఇది కూడ ఒక కల. మన ప్రస్తుత జీవితము, ఇది కూడా కల. సరిగ్గా రాత్రిపూట మనం కలలు కంటున్నట్లుగానే. కలలో, మనము చాలా విషయలు సృష్టిస్తాము. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం కూడా మొత్తం కల వంటిది. స్థూల కలలు. అది నిగూఢముగా కలలు కలగనడము. ఇది స్థూలముగా కలలు కలగనడము. అది మనస్సు, శరీరం, తెలివితేటలు యొక్క పని. కలలు కనడం. ఇక్కడ, ఐదు భౌతిక అంశాల కార్యము: భూమి, నీరు, గాలి, అగ్ని... కాని వాటన్నింటినీ, ఈ ఎనిమిది, అవన్నీ కేవలం భౌతికము. కాబట్టి మనం ఆలోచిస్తున్నాం "నేను ఇప్పుడు ఒక మంచి ఇంటిని నిర్మించాను, ఆకాశహార్మ్యభవనం." ఇది ఏమీ లేదు కానీ కల. ఏమీ లేదు కానీ కల. కల అంటే, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే,నా ఆకాశహార్మ్యభవనం, కర్తవ్యము, కర్మాగారం - అన్నీ సమాప్తమైపోతాయి నా ఆకాశహార్మ్యభవనం, కర్తవ్యము, కర్మాగారం - అన్నీ సమాప్తమైపోతాయి. సరిగ్గా అదే కల. కల కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల వరకు. మరియు అది కొన్ని సంవత్సరాలు. అంతే. ఇది కల.

కాబట్టి ఈ కలలు కంటున్న స్థితిలో ఎవరు కలవరపడకూడదు. అది ఆధ్యాత్మిక జీవితం.ఎవరూ కలతపడకూడదు. ఉదాహరణకు మనము కలతపడము. నేను కలలో, సింహాసనం మీద ఉంచబడి, నేను రాజులా పని చేస్తున్నాను. కల ముగిసిన తర్వాత, నేను ఏమీ బాధ పడను. అదేవిధముగా, కలలో పులి నాపై దాడి చేసింది అని నేను చూస్తున్నాను. నేను నిజానికి ఏడుస్తున్నాను" ఇక్కడ పులి ఉంది! ఇక్కడ పులి ఉంది నన్ను రక్షించండి! నాకు వెనుక లేదా పక్కన ఉన్న వ్యక్తి, ఆయన అంటారు, "ఎందుకు మీరు ఏడుస్తున్నారు? పులి ఎక్కడ ఉంది?" అందువలన ఆయన మెలుకువతో వున్నప్పుడు, ఆయన ఏ పులి లేదని చూస్తాడు. కాబట్టి ప్రతిదీ అటువంటిదే. కాని ఈ కల, ఈ స్థూల మరియు సూక్ష్మ కలలు, కేవలం ప్రతిబింబాలు. కేవలం కల అంటే ఏమిటి? మొత్తం రోజంతా, నేను ఏమి అనుకుంటున్నాను, స్వప్నం అనేది ప్రతిబింబం, ప్రతిబింబం. నా తండ్రి వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఆయన, కలలో ఆయన ధర చెప్తున్నాడు: "ఇది ధర." అదేవిధముగా ఇది అంతా కల. ఈ భౌతిక జీవితము, ఈ ఐదు స్థూల అంశాలతో మూడు సూక్ష్మ మూలకాలతో తయారు చేయబడినవి, అవి సరిగ్గా కలలో వలె. Smara nityam aniyatām. అందువల్ల చాణక్య పండితుడు చెప్పారు smara nityam aniyatām. ఇది అనిత్య, తాత్కాలికమైనది... ఈ కల ఎల్లప్పుడూ తాత్కాలికమైనది.

మన దగ్గర ఉన్నవి ఏమైనా, మనమేమైతే చూస్తున్నామో, అవన్నీ కల, తాత్కాలికమైనవి, అని మనము తెలుసుకోవాలి. కాబట్టి మనము తాత్కాలిక విషయాలతో నిమగ్నమైతే సోషలిజం , జాతీయవాదం, కుటుంబ - వాదం లేదా ఈ- వాదం, ఆ- వాదం అని పిలవబడే వాటితో మన సమయం వృధా చేసుకుంటే, కృష్ణచైతన్యము పెంచుకోకుంటే, అప్పుడు అది śrama eva hi kevalam ( SB 1.2.8) అని పిలువబడును కేవలం మన సమయం వృధా చేసుకోవడం, మరొక శరీరం సృష్టించడం. మన స్వంత కర్తవ్యము ఏమిటంటే మనం తెలుసుకోవాలి అది "నేను ఈ కల కాదు. నేను వాస్తవం, ఆధ్యాత్మిక వాస్తవం. కాని నాకు వేరే కర్తవ్యము ఉన్నది." అది ఆధ్యాత్మిక జీవితం అని పిలుస్తారు. అది ఆధ్యాత్మిక జీవితం, మనము అర్థం చేసుకున్నప్పుడు "నేను బ్రహ్మణ్, నేను ఈ పదార్ధము కాదు." Brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) ఆ సమయంలో మనము ఆనందం పొందుతాము. ఎందుకంటే మనము భౌతికముగా వస్తున్న మార్పులతో బాధపడుతున్నాము, మనము బాధపడుతున్నాము మరియు సంతోషముగా ఉంటున్నాము, ఈ బాహ్య కార్యక్రమాలచే ప్రభావితమై, కానీ సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు "నాకు ఈ విషయలన్నింటితో సంబంధము లేదు ," అప్పుడు మనము ఆనందిస్తాము. "నాకు బాధ్యత లేదు. ఏమీ లేదు, నాకు ఈ అన్ని విషయాలతో ఏమీ సంబంధము లేదు.