TE/Prabhupada 0544 - మనము ప్రత్యేకంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురా యొక్క లక్ష్యమునే వక్కాణిస్తున్నాము
ప్రభుపాద: నేడు, మంగళమైన రోజు, మన పూర్వీకులు (ముందు) ఆధ్యాత్మిక గురువు, Oṁ Viṣṇupāda Paramahaṁsa Parivrājakācārya Aṣṭottara-śata Śrīmad Bhaktisiddhānta Sarasvatī Ṭhākura Prabhupāda. శ్రీల భక్తి సిద్ధాoత సరస్వతి ఠాకురా యొక్క లక్ష్యము ... ఆయన జీవితము గురించి కాకుండా, మనము ప్రత్యేకంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురా యొక్క లక్ష్యము పై వక్కాణించి చెబుతున్నాము. ఈ ప్రదేశము, మాయాపూర్, గతంలో మియాపురా అని పిలువబడింది. ఎక్కువగా ఇక్కడ మహమ్మదీయులు నివసించేవారు. ఏదో ఒక విధముగా ఇది మాయాపుర్ కు బదులుగా మియాపురా పేరుగా మార్చబడినది. అయినప్పటికీ, శ్రీ చైతన్య మహాప్రభుపు జన్మ స్థానము ఎక్కడ ఉంది అని చాలా మంది సందేహాస్పదంగా ఉన్నారు. భక్తివినోద ఠాకురా వాస్తవ స్థలాన్ని తెలుసుకోవడానికి పరిశోధన చేశారు. అందువల్ల జగన్నాథ దాస బాబాజీ మహారాజ పర్యవేక్షణలో ఈ ప్రస్తుత యోగపీఠము శ్రీ చైతన్య మహాప్రభుపు యొక్క జన్మధామముగా నిర్ధారించబడినది. కాబట్టి ప్రారంభంలో భక్తివినోద ఠాకురా ఈ ధామమును ఎంతో ఘనంగా అభివృద్ధి చేయాలని అనుకున్నారు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పవిత్ర పేరుకు అనుగుణంగా. అందువలన ఆయన ఈ మాయాపూర్ అభివృద్ధి ఉద్యమం ప్రారంభించారు. ఆయన దాన్ని ముగించలేకపోయారు, కాబట్టి అది భక్తిసిద్ధాంతా సరస్వతి ఠాకురాకు అందచేయబడినది. తన ప్రయత్నoలో, ఆయన శిష్యులు సహాయo చేయాగా, ఈ ధామము క్రమంగా అభివృద్ధి చెందింది, మన ప్రయత్నం కూడా ఈ ధామమును అభివృద్ధి పరచటము. అందువల్ల మనము ఈ దేవాలయాన్ని మాయాపూర్ చంద్రదోయ అని పేరు పెట్టాము. ఈ ధామమును చక్కగా ఘనంగా అభివృద్ధి చేయడానికి గొప్ప ఆశయం మాకు ఉన్నది, అదృష్టవశాత్తూ మనము ఇప్పుడు ముఖ్యంగా విదేశాలతో, ముఖ్యంగా అమెరికన్లతో అనుసంధానించబడి ఉన్నాము. భక్తివినోద ఠాకురా యొక్క గొప్ప కోరిక అమెరికన్లు ఇక్కడకు వస్తారు, ఈ ధామమును అభివృద్ధి చేస్తారు, వారు భారతీయులతో పాటు ఇక్కడ కీర్తన మరియు నృత్యం చేస్తారు.
తన కల అలాగే చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ప్రకారము,
- pṛthivīte āche yata nagarādi grāma
- sarvatra pracāra haibe mora nāma
- (CB Antya-khaṇḍa 4.126)
కాబట్టి భారతీయులందరు పాల్గొనాలని చైతన్య మహాప్రభు కోరుకున్నారు.
- bhārata bhūmite manuṣya-janma haila yāra
- janma sārthaka kari' kara para-upakāra.
- (CC Adi 9.41)
ఇది చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము, para-upakāra. para-upakāra అంటే ఇతరులకు మంచి చేయటము. వాస్తవానికి, మానవ సమాజంలో అనేక శాఖలు ఉన్నాయి ఇతరులకు మంచి చేయడం - సంక్షేమ సంఘాలు - కాని కొంచము తేడాతో ... ఎందుకు కొంచము? దాదాపు పూర్తిగా, వారు ఈ శరీరము మనము అని అనుకుంటున్నారు, శరీరానికి కొంత మంచి చేయటం సంక్షేమ కార్యక్రమము అని అనుకుంటున్నారు. కాని వాస్తవానికి ఇది సంక్షేమ కార్యక్రమము కాదు ఎందుకంటే భగవద్గీతలో మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాము, antavanta ime dehaḥ nityasyoktāḥ śarīriṇaḥ. ఈ శరీరం antavat ఉంది. "అంత" అది నాశనము అవుతుంది అని అర్థం. అందరికి తన శరీరము శాశ్వతము కాదు అని తెలుసు. అది నాశనము అవుతుంది అని తెలుసు. ఏదైనా భౌతికమైనది - bhūtvā bhūtvā pralīyate ( BG 8.19) - అది జన్మ సమయము కలిగి ఉంటుoది, అది కొంత సమయం పాటు ఉంటుంది, ఆపై అది నాశనమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక విద్య "నేను ఈ శరీరం కాదు" అని అర్థం నుండి ప్రారంభమవుతుంది. ఇది ఆధ్యాత్మిక విద్య. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన మొదటి ఉపదేశము, ఇది, మనము ఈ శరీరము కాదు. ఎందుకంటే అర్జునుడు శరీర స్థితి నుండి చెప్పుతున్నాడు, కాబట్టి కృష్ణుడు అతన్ని కోప్పడినారు, అది aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase: ( BG 2.11) అర్జునా, నీవు చాలా జ్ఞానము కలిగిన వ్యక్తిలా మాట్లాడుతున్నావు, కాని నీవు విచారిస్తున్న విషయము దాని గురించి ఏ జ్ఞానము కలిగిన వ్యక్తి విచారించడు. " Aśocyān anvaśocas tvam.
కాబట్టి శరీర సంబంధమైన సంక్షేమ కార్యక్రమాలు, ఉదాహరణకు ఆసుపత్రి మరియు చాలా ఇతర విషయాలు, అవి నిస్సందేహంగా మంచివి, కాని అంతిమ లక్ష్యం ఆత్మ యొక్క సంక్షేమాన్ని చూడటము. అది అంతిమ లక్ష్యం. అది మొత్తం వేదముల సూచన. కృష్ణుడు ఈ విషయం నుండి ప్రారంభిస్తారు. Dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā ( BG 2.13)