TE/Prabhupada 0689 - మీరు పవిత్రమైన సాంగత్యమును కలిగి ఉంటే, అప్పుడు మీ చైతన్యము ఆధ్యాత్మికము అవుతుంది
Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969
భక్తుడు: "తన పూర్వ జన్మలోని భగవత్ చైతన్యము వలన, ఆయన సహజముగా యోగ సూత్రాలకు ఆసక్తి కలిగి ఉంటాడు - అయన వాటి కొరకు వెతకకుండానే. యోగ కోసం కృషి చేస్తున్నా, ఇటువంటి జిజ్ఞాసా కలిగిన భక్తుడు, ఎల్లప్పుడూ శాస్త్రముల సంప్రదాయ సూత్రాల కంటే ఉన్నతముగా ఉంటాడు ( BG 6.44) "
ప్రభుపాద: అవును.
భక్తుడు: "కానీ యోగి ..."
ప్రభుపాద: లేదు, నేను దీనిని వివరిస్తాను." భగవత్ చైతన్యము యొక్క స్వభావము వలన." మనము ఈ చైతన్యమును, కృష్ణ చైతన్యము, భగవత్ చైతన్యమును తయారు చేసుకుంటున్నాము. చైతన్యము వెళ్తుంది. ఉదాహరణకు సువాసన వలె , ఒక గులాబీ పుష్పం యొక్క వాసన గాలితో వెళ్ళుతుంది. ఆ గాలి మన దగ్గరకు వస్తే మనము కూడా గులాబీ వాసన అనుభూతి చెందుతాము. అదేవిధముగా , మనం చనిపోయినప్పుడు, ఈ భౌతిక శరీరం పూర్తిగా నాశనమవుతుంది. నీ అంతిమ గమ్యము ధూళి లేదా బూడిద లేదా మలము భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం: ఇది ఐదు మూలకాలతో చేయబడుతుంది. ... ఇప్పటివరకు భూమిపై పదార్థాలను గురించి అలోచించినప్పుడు, అది మిశ్రమంగా ఉంటుంది. కొంత మంది ఈ శరీరాన్ని కాల్చివేస్తారు, కొంత మంది పూడ్చి పెడతారు, లేదా కొంత మంది జంతువులకు తినటానికి వదలివేస్తారు. మానవ సమాజంలో మూడు పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో హిందువులు, వారు శరీరాన్ని తగలపెడతారు . కాబట్టి శరీరం బూడిదగా రూపాంతరం చెందుతుంది - అంటే భూమి అని అర్థం. బూడిద అంటే భూమి. పూర్వీకులు మృతదేహాలను పాతిపెట్టేవారు, శరీరము ధూళిగా మారుతుంది, క్రైస్తవ బైబిలు చెప్పినట్లుగా, "నీవు ధూళిగా మరుతావు." ఈ శరీరం దుమ్ము మరియు మళ్లీ దుమ్ములా మారుతుంది. జంతువులు మరియు పక్షులు, రాబందులుకి తినటము కోసం విసిరే వారు, ఉదాహరణకు భారతదేశంలో పార్సీ సమాజము వలె వారు కాల్చరు, లేదా వారు పూడ్చి పెట్టరు. వారు వదలివేస్తారు, రాబందులు వచ్చి తినడానికి. అప్పుడు శరీరం మలముగా మారుతుంది.
కాబట్టి ఇది బూడిదగా మారుతుంది లేదా దుమ్ముగా లేదా మలముగా మారుతుంది. ఈ అందమైన శరీరం, మీరు చక్కగా సబ్బు రాస్తున్నారు, ఇది మూడు రకాలుగా మారుతుంది, మలం, బూడిద, లేదా దుమ్ము. సూక్ష్మ అంశాలు అంటే - మనస్సు, బుద్ధి , అహంకారం - వీటన్నిటి కలయిక చైతన్యము అని పిలువబడుతుంది. అది మిమ్మల్ని, ఆత్మ,, ఆత్మ యొక్క చిన్న కణాన్ని తీసుకువెళ్ళుతుంది. ఇది ఈ మూడు సూక్ష్మ అంశాలచే నిర్వహించబడుతుంది: మనస్సు, బుద్ధి, అహంకారం. ప్రకారం... కేవలము వాసన వలె , అది గులాబీ వాసన అయితే, మీరు ఆనందిస్తారు, " ఇది చాలా చక్కగా ఉంది." కానీ అది అసహ్యముగా ఉంటే, మలం ద్వారా లేదా ఏదైనా ఇతర మురికిగా ఉన్న ప్రదేశములోకి వెళ్ళితే మీరు చెప్తారు, "ఓ, ఈ వాసన చాలా అసహ్యముగా ఉంది." ఈ చైతన్యం ఒక మలం వాసన లేదా గులాబీ వాసనలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది, మీ కర్మ ప్రకారం, మీరు మీ చైతన్యమును తయారు చేసుకుంటారు. మీరు మీ చైతన్యమును తయారు చేసుకుంటే, మీ చైతన్యమును కృష్ణుడి కోసము శిక్షణ ఇచ్చినట్లయితే, అప్పుడు అది మిమ్మల్ని కృష్ణుడి దగ్గరకు తీసుకువెళుతుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టము కాదు. మీరు గాలిని చూడలేరు కానీ మీరు గాలి ద్వారా అనుభూతి చెందగలరు. " గాలి వీటి ద్వారా ఈ విధముగా వెళ్ళుతుంది." అదేవిధముగా, ఈ వివిధ రకాలైన శరీరం చైతన్యము ప్రకారం అభివృద్ధి చేయబడుతుంది.
మీరు యోగ సూత్రాములో మీ చైతన్యాన్ని శిక్షణ ఇచ్చినట్లయితే, మీరు శరీరాన్ని పొందుతారు, అదే శరీరాన్ని పొందుతారు. మీకు మంచి అవకాశం లభిస్తుంది, మీరు మంచి తల్లిదండ్రులు, మంచి కుటుంబాన్ని పొందుతారు, అక్కడ మీరు ఈ పద్ధతిని సాధన చేయడానికి అనుమతించబడతారు, మీరు సహజముగా అవకాశము పొందుతారు మీరు మునుపటి శరీరమును వదలివేస్తున్నప్పుడు ఉన్న చైతన్యాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడానికి, అది ఇక్కడ వివరించబడింది. భగవత్ చైతన్యము వలన. అందువలన మన ప్రస్తుత కర్తవ్యము చైతన్యమును ఎలా దివ్యముగా తయారు చేసుకోవాలి. అది మన కర్తవ్యము. మీకు ఆధ్యాత్మిక జీవితము కావాలనుకుంటే, మీరు ఆధ్యాత్మికముగా ఉన్నతి సాధించాలంటే, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళాలనుకుంటే అనగా శాశ్వత జీవితము, ఆనందమైన జీవితం, సంపూర్ణ జ్ఞానము కలిగిన జీవితము, భగవత్ చైతన్యము లేదా కృష్ణ చైతన్యములో మనము శిక్షణ పొందాలి . మీరు సాంగత్యము ద్వారా చాలా సులభంగా చేయవచ్చు. Saṅgāt sañjāyate kāmaḥ. మీరు పవిత్రమైన సాంగత్యమును కలిగి ఉంటే, అప్పుడు మీ చైతన్యము ఆధ్యాత్మికము అవుతుంది. మీరు చెడు సాంగత్యము కలిగి ఉంటే, రాక్షసుల సాంగత్యము, అప్పుడు మీ చైతన్యము ఆ విధముగా శిక్షణ పొందుతుంది.
కాబట్టి మనము మన చైతన్యమునకు శిక్షణ ఇవ్వాలి, పవిత్రము అవటానికి. ఇది మానవ జీవితము యొక్క కర్తవ్యము. మనము మన చైతన్యమును దివ్యముగా తయారు చేసుకుంటే, అప్పుడు మనము దివ్యమైన జీవితానికి సిద్ధమవుతున్నాము. వివిధ తరగతుల జీవితము ఉన్నట్లు, కావున మానవ జీవితము పొందుట ఒక అవకాశం మాత్రమే మీ తదుపరి జీవితాన్ని పూర్తిగా దివ్యము చేసుకోవడానికి. పూర్తిగా దివ్యముగా అంటే అర్థం శాశ్వతముగా, ఆనందముగా మరియు సంపూర్ణ జ్ఞానం కలిగినదిగా. కాబట్టి సహజముగా, భగవంతుని చైతన్యము ద్వారా, మీరు భగవంతుని చైతన్యమును అభివృద్ధి చేసుకుంటున్న వ్యక్తులను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ శ్లోకములో ఇది వివరించబడింది. చదవడము కొనసాగించండి.