TE/Prabhupada 0656 - ఎవరైతే భక్తులో,వారు ఎవరినీ ద్వేషంచరు

Revision as of 08:47, 16 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0656 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969


భక్తుడు: "ఒక వ్యక్తి మరింత పవిత్రుడైనాడు అని ఎప్పుడు చెప్తాము అంటే- ఆయన అందరినీ నిజాయితీగల శ్రేయోభిలాషులను, స్నేహితులను మరియు శత్రువులను,అసూయపడే వారిని, పవిత్రమైన వారిని, పాపము చేసే వారిని మరియు తటస్థముగా ఉండేవారిని మరియు నిష్పక్షపాత వ్యక్తులను - సమాన మనస్సుతో చూసే వారు( BG 6.9) "

ప్రభుపాద: అవును. ఇది పవిత్రము అయినాడు అనే దాని యొక్క చిహ్నం. ఎందుకంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో, స్నేహితునిగా మరియు శత్రువుగా లెక్కించడం, ప్రతిదీ ఈ శరీరం తో సంబంధించి ఉంది, లేదా ఇంద్రియాల తృప్తితో. కానీ భగవంతుడు లేదా సంపూర్ణ సత్యము యొక్క సాక్షాత్కారములో, అలాంటి భౌతిక పరిశీలన లేదు. ఇంకొక విషయము ఏమిటంటే ఇక్కడ ఉన్న, వారు అందరూ బద్ధజీవాత్మలు, వారు భ్రమలో ఉన్నారు. ఉదాహరణకు ఒక డాక్టర్ని తీసుకుందాము, ఒక వైద్యుడు రోగి దగ్గరకి వెళతాడు. ఆయనకి మతి భ్రమించినది, ఆయన అర్థంలేనివి చెప్పుతున్నాడు. ఆయితే అతన్ని చికిత్స చేయడానికి నిరాకరించినట్లు కాదు. ఆయన అతన్ని స్నేహితుడిగా చూస్తాడు. పేషెంట్ ఆయనను పేర్లు, చెడ్డ పేర్లతో అతన్ని పిలుస్తున్నప్పటికీ, ఆయన ఆప్పటికీ ఆతనికి ఔషధం ఇస్తాడు.

ఉదాహరణకు జీసస్ క్రీస్తు చెప్పినట్లే, "మీరు పాపిని కాదు పాపాన్ని ద్వేషించండి" అని అన్నారు. పాపిని కాదు. ఇది చాలా బాగుంది. ఎందుకంటే పాపి భ్రమలో ఉన్నాడు. ఆయన పిచ్చివాడు. నీవు ఆయనని ద్వేషిస్తే, అప్పుడు నీవు ఆయనని ఎలా విడిపించగలవు? కాబట్టి ఎవరైతే భక్తులో, ఎవరైతే వాస్తవముగా భగవంతుని సేవకులో, వారు ఎవరినీ ద్వేషంచ కూడదు. ఉదాహరణకు జీసస్ క్రైస్ట్ వలె, ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయన భగవంతుడికి విజ్ఞప్తి చేస్తున్నాడు: నా ప్రభు, దయచేసి వారిని మన్నించండి. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఇది భక్తుడి యొక్క పరిస్థితి. అవును. ఎందుకంటే వారు భౌతిక ఆలోచనా ధోరణిలో పిచ్చివాడిగా ఉన్నారు, కాబట్టి వారిని అసహ్యించుకోలేము. ఎవరైనా. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చాలా బాగుంది. అసహ్యించుకునే ప్రశ్నే లేదు. అందరికీ స్వాగతం. దయచేసి ఇక్కడికి రండి. జపము చేయండి హరే కృష్ణ. కృష్ణ ప్రసాదమును తీసుకోండి భగవద్గీత నుండి మంచి తత్వము వినండి, మీ భౌతిక బద్ధ జీవితాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించండి. ఈ కార్యక్రమము- కృష్ణ చైతన్యము. చైతన్య మహాప్రభు ఈ ఉద్యమాన్ని ప్రవేశ పెట్టిన్నారు. Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa ( CC Madhya 7.128) మీరు కలుసుకునే ఎవరినైనా, మీరు ఎక్కడ కలుసుకున్నా, కేవలము అతనికి ఈ కృష్ణ చైతన్యమును నేర్పడానికి ప్రయత్నించండి. కృష్ణ -కథ. భగవంతుడు కృష్ణుడి ఉపదేశాలు. మీరు సంతోషంగా ఉంటారు వారు సంతోషంగా ఉంటారు. కొనసాగించు.

భక్తుడు: "భక్తుడు తన మనస్సును భగవంతుడిపైన కేంద్రికరించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ఆయన ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసించాలి మరియు ఎల్లప్పుడూ తన మనస్సును జాగ్రత్తగా నియంత్రించుకోవాలి. ఆయన కోరికలు మరియు అన్నీ తనవే అనే భావన నుండి (స్వాధీనత) నుండి స్వేచ్ఛ పొంది ఉండాలి. "

ప్రభుపాద: అవును. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆరంభం. ఈ అధ్యాయంలో, భగవంతుడు కృష్ణుడు యోగ పద్ధతి యొక్క సూత్రాలను నేర్పడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఆయన మొదలుపెడతారు. భక్తుడు తన మనస్సును భగవంతుని పై కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి. మహోన్నతమైన ఆత్మ అంటే కృష్ణుడు లేదా భగవంతుడు. నేను వివరించినట్లు ఆయన మహోన్నతమైన ఆత్మ,nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఆయన మహోన్నతముగా శాశ్వతమైనవాడు. ఆయన మహోన్నతమైన జీవి. కాబట్టి మొత్తం యోగ పద్ధతి భగవంతుడి పై మనస్సును కేంద్రీకరించడము. మనము భగవంతుడిమి కాదు. మీరు అర్థం చేసుకోవచ్చు. మహోన్నతమైన ఆత్మ భగవంతుడు. ఇది ద్వైత-వాదము. ద్వంద్వము. ద్వంద్వత్వం అంటే భగవంతుడు నా నుండి భిన్నమైన వాడు. ఆయన మహోన్నతమైన వాడు. నేను సేవకుడిని,ఆయన గొప్పవాడు, నేను అల్పుడిని. ఆయన అనంతము, నేను సూక్ష్మమైన వాడిని. ఇది సంబంధం. మనము అతి సూక్ష్మమైన వారము కనుక, మనం అనంతమైన, భగవంతుడి పైన మన మనస్సును దృష్టి పెట్టాలి. అప్పుడు, ఆయన ఒంటరిగా జీవిస్తాడు. ఒంటరిగా. ఇది చాలా ముఖ్యమైన విషయము. కృష్ణ చైతన్యము లేదా భగవంతుడు చైతన్యము లేని వ్యక్తులతో నివసించకూడదు. అది ఒంటరిగా నివసించడము అంటే. ఆయన ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవించాలి. ఏకాంత ప్రదేశం, అక్కడ, లేదా, అడవిలో. అరణ్యములో. ఇది చాలా ఏకాంత ప్రదేశం. కానీ ఈ యుగములో అడవికి వెళ్లి ఏకాంత ప్రదేశాన్ని గుర్తించడం చాలా కష్టము. ఏకాంత ప్రదేశము అంటే అక్కడ కేవలం భగవంతుని చైతన్యమును భోదించడము జరుగుతుంది. ఇది ఏకాంత ప్రదేశం. ఇది ఏకాంత ప్రదేశం. అప్పుడు? ఎల్లప్పుడూ జాగ్రత్తగా తన మనస్సును నియంత్రించాలి. మనస్సును ఎలా నియంత్రించాలి? భగవంతుని పైన లేదా కృష్ణుని పై మీ మనస్సును కేంద్రీకరించండి. వేరేది ఏది కాదు.

Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ ( SB 9.4.18) అప్పుడు మీ... మొన్నటి రోజు నేను వివరించినట్లుగా, మీరు మీ మనస్సులో ఎప్పుడూ కృష్ణుడు కూర్చోని ఉండేటట్లు చేయగలిగితే... ఉదాహరణకు కృష్ణుడు కాంతి వంటి వాడు, సూర్యుడు వలె. కాబట్టి మనస్సును చీకటి ఆక్రమించే ప్రశ్నే లేదు. అవకాశమే లేదు. ఉదాహరణకు సూర్యరశ్మిలో, చీకటికి అవకాశం లేదు. అదేవిధముగా, మీరు కృష్ణుడిని మీ మనస్సులో ఎల్లప్పుడూ ఉంచుకుంటే, ఈ మాయా లేదా భ్రాంతి అక్కడకు చేరలేవు. ఆమె అక్కడకు చేరుకోలేదు. అది పద్ధతి. ఆయన కోరికల మరియు అన్నీ తనవే అనే భావన నుండి (స్వాధీనత) నుండి స్వేచ్చగా ఉండాలి. మొత్తం భౌతిక వ్యాధి అదే నేను కలిగి ఉండాలి -మరియు కోరిక. ఏదైతే పోతుందో, దాని కోసం నేను విచారిస్తాను, మరియు ఏదైతే ఉన్నదో, ఏదైతే మనము లేకుండా ఉన్నామో, మనము అది కోరుకుంటాము. కాబట్టి, brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) - ఎవరైతే వాస్తవముగా భగవంతుని చైతన్యమును, కృష్ణ చైతన్యమును కలిగి ఉంటారో, ఆయనకు భౌతిక విషయముల పట్ల కోరిక లేదు. ఆయనకు కృష్ణుని ఎలా సేవించాలనే కోరిక మాత్రమే ఉంది. అంటే తన కోరిక పవిత్రము చేయబడిందని. ఈ కోరిక, మీరు కోరికను వదలివేయలేరు. అది సాధ్యం కాదు. మీరు జీవి, మీరు కోరిక కలిగి ఉండాలి. కానీ మన కోరిక, ప్రస్తుత సమయంలో, కలుషితమైనది. నేను కోరుకుంటున్నాను, భౌతిక వస్తువులు కలిగి ఉండటము ద్వారా నా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీరు కృష్ణుని కోరుకుంటే, ఈ భౌతిక వస్తువుల పట్ల కోరిక సహజముగా నశిస్తుంది. కొనసాగించు.