TE/Prabhupada 0632 - నేను ఈ శరీరము కాదని తెలుసుకున్నప్పుడు భౌతిక ప్రకృతి యొక్క మూడు గుణాలను అధిగమిస్తాను

Revision as of 05:29, 24 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0632 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.28 -- London, August 30, 1973


అందువల్ల శంకరాచార్య ఈ విధముగా సిద్ధాంతీకరించారు: బ్రహ్మ సత్యం జగం మిథ్య. బ్రహ్మణ్ అంటే ఆత్మ వాస్తవమైన సత్యం, భౌతిక అభివ్యక్తీకరణం కాదు. భౌతిక అభివ్యక్తీకరణం, సరే, ఆయన మిథ్య అని చెప్పారు. మనము మిథ్య అని చెప్పము. మనము తాత్కాలికం అని చెప్తాము. కాబట్టి మన ప్రధాన శ్రద్ధ ఏమిటంటే నేను తాత్కాలికం కాదు. నా శరీరం తాత్కాలికం. ఇప్పుడు నేను శరీరం కోసం పని చేస్తున్నాను. ఇది భ్రమ. Ahaṁ mameti ( SB 5.5.8) అప్పుడు వాస్తవమైన సత్యము ఏమిటి? వాస్తవానికి నేను ఆధ్యాత్మిక కణము, మహోన్నతమైన ఆత్మ కృష్ణుడు, లేదా భగవంతుడు. అందువలన, భగవంతుని యొక్క భాగంగా అంశగా ఇది నా బాధ్యత భగవంతునికి సేవ చేయడం. అది ఆధ్యాత్మిక జీవితం, భక్తి-యోగ, ఇది స్వరూప అని పిలువబడుతుంది. ఇంకొక చోట, భగవద్గీతలో దీనిని sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate ( BG 14.26) అని నిర్ధారించారు. నేను ఈ శరీరాన్ని కాదని నేను సాక్షాత్కారము పొందినప్పుడు, వెంటనే నేను భౌతిక ప్రకృతి యొక్క మూడు గుణాలను అధిగమిస్తాను: సత్వ గుణము, రజో గుణము, తమో గుణము. శరీర భావనలో, నేను భౌతిక ప్రకృతి యొక్క గుణాలలో ఏదో ఒక దానిచే ప్రభావితం చెంది వ్యవహరిస్తున్నాను

భాగవతంలో కూడా ఇది చెప్పబడింది: yayā sammohito jīva ātmānaṁ tri-guṇātmakaṁ manute anartham ( SB 1.7.5) నేను భౌతిక ప్రకృతి యొక్క మూడు గుణాలలో ఒకదానిలో తయారు చేయబడిన ఈ శరీరాన్ని అంగీకరించాను కాబట్టి, గుర్తిస్తున్నాను, అందువలన నేను చాలా అనర్థాలను సృష్టించుకున్నాను. అనర్థా అంటే అవాంఛనీయ విషయాలు. Tat-kṛtaṁ cābhipadyate. శరీర సంబంధాల ద్వారా చాలా అనవసరమైన విషయాలు సృష్టించుకున్న తరువాత, నేను ఆలోచనలో చిక్కుకున్నాను, "నేను, ఫలానా ఫలానా దేశానికి చెందినవాడిని. అందువల్ల దీన్ని చేయాలనే బాధ్యత నాకు ఉంది, దేశానికి లేదా సమాజానికి, లేదా కుటుంబానికి, నా వ్యక్తిగతముగా లేదా నా భార్యకు, నా పిల్లలకు. " ఇది వేదముల ప్రకారం ఇది భ్రాంతి. Ahaṁ mameti ( SB 5.5.8) Janasya moho 'yam. మోహ అంటే భ్రాంతి. నేను భ్రాంతి కరమైన పరిస్థితులను సృష్టించుకొని, చిక్కుకుపోతున్నాను. ఇది నా పరిస్థితి. కానీ నా వాస్తవమైన లక్ష్యం ఈ భ్రమ నుండి బయటపడటం నా వాస్తవ చైతన్యముకు రావడం, కృష్ణ చైతన్యము, నేను తిరిగి పొందాలి. కృష్ణ చైతన్యము అంటే ఆధ్యాత్మిక శరీరం. నా ఆధ్యాత్మిక శరీరం ఆధారంగా పనిచేసిన వెంటనే, అది విముక్తి అని పిలువబడుతుంది. అది కావలసినది. అప్పుడు నేను జ్ఞానం యొక్క ఆనందకరమైన శాశ్వత జీవితంలో నివసిస్తాను. అది నా సమస్య.

కానీ ప్రజలు జీవితం యొక్క ఈ శరీర భావంలో విద్యావంతులు అవుతున్నారు, వారు సమస్యలు సృష్టిస్తున్నారు, సమస్యలను పరిష్కరించడానికి, వారు పాపములలో చిక్కుకుపోతున్నారు. ఉదాహరణకు ఈ ఉదయం చర్చించాము. గర్భం లోపలే, శిశువు యొక్క శరీరమును చంపడము గురించి, గర్భస్రావం ఎందుకంటే మనకు తెలియదు ఆ శిశువు శరీరం లోపల ఆత్మ ఉందని... ఆయన ఎవరినీ చంపడు, ఆత్మ చంపబడదు. కానీ అది కూడా వివరించబడింది, ఆత్మ యొక్క శాశ్వత తత్వం తెలిసిన వారు, ఆయన ఎవరినీ చంపడు, ఆత్మ చంపబడదు. కానీ మనము సమస్యను సృష్టిస్తున్నాము. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో ఆశ్రయం తీసుకుంది వైద్య శాస్త్రం అని పిలువబడేది చెప్తుంది శరీరాన్ని నాశనం చేయడము అంటే, అంటే ఆయన చిక్కుకుపోతాడు. సలహా ఇస్తున్న వ్యక్తి... నేను అది అర్థం చేసుకున్నాను ఒక వ్యక్తి ఇక్కడకు వస్తాడు, ఆయన భార్య వైద్యురాలు ఆమె కర్తవ్యము గర్భవతి భార్యని, స్త్రీని, పరిశీలించడం,పరీక్షించడం పిల్లవాడిని చంపాలా వద్దా అని సలహా ఇవ్వడము. అది ఆమె పని